సాక్షి, అమరావతి : ‘అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు భయమెందుకు? అనేక కేసుల్లో జరిగే తరహాలోనే ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు ఎందుకు? విచారణకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చు’ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. స్కిల్ స్కామ్‌లో సీఐడీ పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతోనే దర్యాప్తు చేస్తున్నారని, రూ.241 కోట్ల ప్రజాధనం అక్రమంగా మళ్లించినట్టు స్పష్టమవుతోందని చెప్పారు.
కస్టోడియల్ కస్టడీలో విచారిస్తే నిజ నిర్ధారణ జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. కొద్ది రోజులుగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తన చేతికి ఆ రిమాండ్ రిపోర్టు అందినందున, ఇందులో నిజా నిజాలు, క్రెడిబులిటీ చెప్పదల్చుకున్నానని తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
క్లియర్ ఎవిడెన్స్ కనిపిస్తున్నాయి..
♦ ఎంతో మంది నాయకులు క్రిమినల్ కేసులు ఎదుర్కొన్నారు. కొంత మందికి శిక్షలు పడ్డాయి. నిర్దోషులు హానరబుల్ (గౌరవం)గా బయటకొచ్చారు. కానీ ఎక్కడా జరగని విధంగా ఇక్కడే ఏదో జరిగిపోయినట్టు చంద్రబాబు కేసు విషయంలో కొంత మంది గగ్గోలు పెడుతున్నారు. ఆయన అరెస్టు సరైనదే అని కొందరు సమర్థిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.241 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కేసులో ఈ నెల 9న సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.
♦ ప్రభుత్వ డబ్బు (ప్రజాధనం) బోగస్ ఇన్వాయిస్‌ల ద్వారా టెక్నాలజీ పార్ట్‌నర్స్‌కు, ఇతరులకు డిస్ట్రిబ్యూట్ అయ్యింది. ఆ సిక్స్ క్లస్టర్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేయలేదు. వారికి ఇచ్చిన డబ్బుకు లెక్కలేదు. దానికి జీఎస్టీ కట్టలేదని జీఎస్టీ అథారిటీ వారు కూడా ఎంక్వైరీ చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వాళ్లూ విచారించారు. తర్వాత ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కూడా ఇన్‌వాల్వ్ అయ్యింది. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత.. దీనికి సంబంధించి కొన్ని కీ నోట్ ఫైల్స్ మిస్ అయ్యాయి కాబట్టే చంద్రబాబును అరెస్టు చేశారు.
♦ 141 మంది సాకు‡్ష్యలను కూడా విచారించి ఆధారాలు సేకరించారు. ఆ డబ్బు ఎవరి అకౌంట్‌లో పడింది.. నిధులు ఎలా దారి మళ్లాయి.. షెల్ కంపెనీల ద్వారా తిరిగి వీళ్ల వద్దకు ఆ డబ్బు ఎలా వచ్చింది.. ఇవన్నీ మరింత స్పష్టంగా విచారించడానికే చంద్రబాబును అరెస్టు చేశారు.
నేరం చేయకపోతే భయమెందుకు?
♦ చంద్రబాబు ఏ రకమైన నేరం (ఫ్రాడ్) చేయకపోతే, నిధులు దుర్వినియోగం చేయకపోతే, నిబంధనలు ఉల్లంఘించకపోతే, ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కిందకు రాకపోతే, అది 409 కిందకు రాకపోతే ఎందుకు భయపడుతున్నట్లు? నిధులు అక్రమంగా మళ్లింపు(సైఫెన్) అని తెలుస్తోంది. ఆ డబ్బు దుర్వినియోగం అయినట్టు తేటతెల్లమైంది. సీఐడీ పోలీసులు రికార్డును బట్టే ముందుకెళ్తున్నారు.
♦ ఇది సరికాదనుకున్నప్పుడు మా దగ్గర రికార్డు ఉంది.. జరిగిందిదీ అని ఆ ఆరు షెల్ కంపెనీలు వచ్చి చెప్పడం లేదు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రైవేటు కెపాసిటీతో ఏదైనా లెటర్ ఇచ్చి ఉండొచ్చు. అండర్ స్టాండింగ్ ఉండొచ్చు. కానీ దాంతో మా కంపెనీకి ఏ సంబంధం లేదని సిమన్స్ ఇండస్ట్రీ వాళ్లు చెబుతున్నారు. డిజైన్ టెక్ ప్రైవేట్ కంపెనీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది. షెల్ కంపెనీలు కూడా వాస్తవ సమాధానం చెప్పడం లేదు. ఇంత మందికి శిక్షణ ఇచ్చామని, ఇన్ని పరికరాలు కొన్నామని బెయిల్ పిటిషన్లలో ఎందుకు చెప్పలేదు?
♦ ఇంత క్లియర్‌గా కేసు ఉంటే ఏదో ఘోరం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం విచిత్రం అనిపిస్తోంది. ఆయన సత్యవంతుడని నిరూపించుకుంటే రేపు పరువు నష్టం దావా వేయొచ్చు. ఇలా గగ్గోలు పెట్టడం అనవసరం. ఇంత కంటే పూర్తి ఆధారాలతో కూడిన(ఫుల్ ఫ్రూఫ్) కేసు నేను చూడలేదు. అనుమానాలకు తావులేదు.
గవర్నర్ అనుమతి అవసరం లేదు
♦ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి కావాలనే వాదన జరుగుతోంది. సెక్షన్ 17ఎ ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ 2018లో ఫోర్స్‌లోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన నేరాలకు అది వర్తించదు. కాబట్టి అవి అంతకంటే ముందు నేరాలు కాబట్టి 17ఎ లో గవర్నర్ అనుమతి తీసుకోవాలనేది వర్తించదు. అచ్చెన్నాయుడు కేసులో ఇది డిసైడ్ అయ్యింది.
♦ అరెస్టు, కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఇవన్నీ విచారణలో భాగమే. దాదాపు 141 మంది సాకు‡్ష్యలను విచారించారు. ఏడుగురిపై రిమాండ్ రిపోర్టు ఇచ్చారు. తర్వాత అత్యంత ఎక్కువ సమాచారం సేకరించారు. దర్యాప్తునకు సహకరించడ లేదు. అంతకు ముందు చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాసరావు విదేశాలకు వెళ్లిపోయాడు. వాళ్లిద్దరూ సహకరించడం లేదు. తర్వాత కొన్ని నోట్ ఫైల్స్ మిస్సింగ్. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం వీరికి చేరిందనేది నిర్ధారణ కావాలంటే అరెస్ట్ చేసి విచారిస్తేనే నిజానిజాలు బయటపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment