దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం | YS Jagan invited to South India all party leaders meeting | Sakshi
Sakshi News home page

దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం

Mar 13 2025 5:48 AM | Updated on Mar 13 2025 7:28 AM

YS Jagan invited to South India all party leaders meeting

వైఎస్‌ జగన్‌ను కలిసిన తమిళనాడు పీడబ్ల్యూడీ మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్‌.. 22న చెన్నైలో సమావేశం

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను తమిళనాడు పీ­డ­బ్ల్యూడీ శాఖ మంత్రి ఈవీ వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్‌ కలిశారు. ఈనెల 22న చెన్నైలో నిర్వహించే దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానిస్తూ తమిళ­నాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ రాసిన లేఖను వైఎస్‌ జగన్‌కు అందజేసి, దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి ఆహ్వానించా­రు. 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ వివిధ రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు. దీన్లోభాగంగా తమిళనాడు డీఎంకే నేతలు వైఎస్‌ జగన్‌ను కలిశారు.  

Advertisement
 
Advertisement
Advertisement