సాక్షి,న్యూఢిల్లీ: నోట్ల రద్దు సమయంలో భారీ మొత్తంలో డిపాజిట్, విత్‌డ్రాయల్స్ జరిపిన 18 డొల్ల కంపెనీల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనుమానిత లావాదేవీలపై విచారణ జరపాలని 18 కంపెనీల వివరాలను తీవ్ర ఆర్థిక నేరాల విచారణ సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐఓ)కు అప్పగించింది. అదేసమయంలో తక్కువ మొత్తం డిపాజిట్లతో వేలాది బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలు సాగించిన ఇతర కంపెనీల రికార్డులను స్కాన్ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రాంతీయ డైరెక్టర్లను ఆదేశించింది.
రూ 100కోట్ల పైబడిన లావాదేవీలు నిర్వహించిన సంస్థలన్నింటినీ ఎస్‌ఎప్‌ఐఓకు నివేదించామని, విచారణల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కంపెనీల ఇతర చట్టాల ఉల్లంఘనలపై ఐటీ, ఈడీ వంటి ఏజెన్సీలూ విచారణ చేపడతాయని తెలిపాయి.నోట్ల రద్దు సమయంలో డిపాజిట్ చేసిన పాత కరెన్సీ నోట్ల వివరాలను తెలపాలని కంపెనీలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కోరింది.
Comments
Please login to add a commentAdd a comment