కష్టపడి, చెమటోడ్చి ఎదగడం ఒక మార్గం.. ఖజానాకు కన్నం వేసి, కుంభకోణాలు చేసి పైకెదగడం మరొక మార్గం. సగటు మనిషి మొదటి మార్గాన్ని ఎంచుకుంటారు. చెమటోడ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారు. కానీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. కుంభకోణాలపై కోర్టుల్లో వేసిన కేసుల్లో ‘స్టే’లు తెచ్చుకుని విచారణ నుంచి తప్పించుకుంటూ అక్రమార్జనలో ఆరితేరిపోయారు. రెండెకరాలనుంచి తప్పుడు మార్గాల్లో రూ.6 లక్షల కోట్లకు పడగలెత్తారు.
సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రభుత్వ ఖజానా నుంచి రూ.371 కోట్లను డిజైన్ టెక్ అనే ప్రైవేటు సంస్థకు దోచిపెట్టి.. షెల్ కంపెనీలకు మళ్లించి.. వాటిని తన జేబులో వేసుకున్న చంద్రబాబు బాగోతాన్ని సీఐడీ సిట్ విభాగం గుట్టు రట్టు చేసింది. దీంతో చంద్రబాబును అరెస్టు చేయడంతో రెండెకరాల నుంచి రూ.6 లక్షల కోట్లకు అధిపతిగా ఆయన ఎదిగిన తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నారావారిపల్లెకు చెందిన రెండెకరాల రైతు.
1978 ఎన్నికల్లో అక్కడి నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు.. తొలి రోజు నుంచే అక్రమార్జనకు తెరతీశారు. ఐదేళ్లూ చంద్రబాబు దోపిడీని కళ్లారా చూసిన చంద్రగిరి ప్రజలు 1983 ఎన్నికల్లో ఓడించి.. సొంత నియోజకవర్గం నుంచి ఆయన్ను తరిమేశారు. ఆ దెబ్బకు భయపడి.. 1989 ఎన్నికల్లో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కుప్పానికి వలస వెళ్లి.. భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్చుకుని.. యథేచ్ఛగా డబ్బులు, మద్యం వెదజల్లుతూ.. రౌడీయిజం చేస్తూ గెలుస్తూ వస్తున్నారు.
నిజ స్వరూపాన్ని చాటిన నేత
విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో 600కుపైగా హామీలను ఎర వేసిన చంద్రబాబు అత్తెసరు మెజార్టీతో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. చంద్రన్న కానుక నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ వరకు స్కామ్‌ల కోసమే స్కీమ్‌లు ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ ఖజానాను అడ్డగోలుగా దోచేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో కమీషన్లు ఎలా దండుకోవచ్చో దేశానికి చాటిచెప్పారు. రాజధాని లేని రాష్ట్రానికి దేవతల రాజధాని అమరావతిని తలదన్నే రీతిలో నిర్మిస్తానంటూ బీరాలు పలికారు. ఆ ముసుగులో రూ.లక్షల కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధానిలో రైతుల భూములను తక్కువ ధరలకే కాజేశారు. అంతటితో ఊరుకోకుండా వాటిని ల్యాండ్ పూలింగ్ నుంచి తప్పించి రింగ్ రోడ్డును ఆ భూములకు సమీపంలో పోయేలా అలైన్మెంట్ రూపొందించి.. వాటికి ధరలు పెంచుకున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానం ముసుగులో సింగపూర్ కంపెనీలతో కలిపి రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్లు కాజేసేందుకు పథకం వేశారు.
ఇది చాలదన్నట్టు రాజధానిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంలోనూ కాంట్రాక్టు సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెట్టి.. వాటి నుంచి రూ.118.98 కోట్లు లంచంగా తీసుకుని ఐటీ శాఖకు అడ్డంగా దొరికపోయారు. కేంద్రమే కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకుని.. కమీషన్ల కోసం దాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ చెప్పడం చంద్రబాబు అవినీతికి పరాకాష్ట.
ఏలేరు స్కాంతో సంచలనం
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. అక్రమార్జనే లక్ష్యంగా పాలన సాగించారు. ఏలేరు రిజర్వాయర్ నిర్మాణం, కాలువల తవ్వకం కోసం జరిపిన భూసేకరణలో అక్రమాలకు పాల్పడి దేశంలో సంచలనం సృష్టించారు. బంజరు భూముల్లో కొబ్బరి చెట్లున్నట్లు.. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా చిత్రీకరిస్తూ ఏలిన వారు ప్రభుత్వ ఖజానాను ఎలా కొల్లగొట్టొచ్చో ఆ కుంభకోణం ద్వారా దేశానికి చాటిచెప్పారు. అదే ఊపులో విద్యుత్ కొనుగోలు, మద్యం కొనుగోలు, డిస్ట్రిబ్యూటరీలకు అనుమతులు ఇలా అన్నింటా అక్రమాలకు పాల్పడ్డారు.
ఊరూ పేరులేని ఐఎంజీ భారత్ అనే సంస్థకు క్రీడా మైదానాలను నిర్మించే పేరుతో ఖరీదైన భూములు కట్టబెట్టి.. వాటిని కాజేయడానికి పథకం వేయడం.. దాన్ని కప్పి పుచ్చడానికి ఒలింపిక్స్‌ను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఎల్లో మీడియాతో ప్రచారం చేయించుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. నక్సల్స్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న చంద్రబాబు.. అదే సానుభూతితో గెలిచేందుకు 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ఆ సానుభూతి నాటకాలను ప్రజలు తిప్పికొట్టారు. ఘోరంగా ఓడించడం ద్వారా అవినీతి పాలనకు తెరదించారు.
పవన్ కళ్యాణ్‌కుఅక్కడే 2.40 ఎకరాలు
చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పడికెడు వాటా ఇచ్చారు. ఈ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే ఆయనకు 2.4 ఎకరాల భూమి ఉంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్టు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కళ్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment