దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆదాయ పన్ను శాఖ సోదాలపై టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు విప్పకపోవడం అందరినీ విస్మయపరుస్తోంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద ఎత్తున రాద్దాంతం చేసే చంద్రబాబు.. ఐటీ సోదాల్లో రూ. 2 వేల కోట్ల బినామీ సొమ్ము బయటపడిన విషయంపై మౌనం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.