Srivalli
-
ఉమెన్ పవర్ 2024: కాలాన్ని కట్టడి చేశారు
కాలం.. మరో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. జారిపోతున్న కాలపు క్షణాలను అపురూపంగా ఒడిసిపట్టుకొని ఉన్నతంగా ఎదిగినవారు కొందరు... ఉదాత్తంగా జీవనాన్ని మలుచుకున్నవారు ఇంకొందరు ఆర్థిక స్థితి గతులు ఎలా ఉన్నా వెనక్కి లాగే పరిస్థితులు ఏవైనా కాలానికి ఎదురు నిలిచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అత్యున్నతంగా ఎదిగిన కొందరు మహిళా మణుల కృషిని ఈ ఏడాది ‘సాక్షి ఫ్యామిలీ’ ఆవిష్కరించింది. ఆ గాథలను మరోమారు గుర్తుచేసుకుందాం. ఎదనిండా స్ఫూర్తిని నింపుకుందాం.డాక్టరమ్మ క్రీడా శిక్షణనిజామాబాద్ పట్టణంలో బాలికల క్రీడానైపుణ్యాలను చూసి, వారి కోసం తన పేరుతోనే 2019లో ఫుట్‌బాల్ అకాడమినీ ఏర్పాటు చేశారు డాక్టర్ శీలం కవితారెడ్డి. ఈ అకాడమీలో 41 మంది బాలికలకు కోచ్ పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు ఈ అకాడమీ లో ఉచిత వసతి, ఆహారం, దుస్తులు, వైద్యసేవలను అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనే క్రీడాకారులకు అవసరమైన ఖర్చులన్నీ భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి జాతీయ–అంతార్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులు ఉన్నారు.అమ్మాయిలను కాపాడుకుందాం..గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణారావు. హైదరాబాద్ వాసి అయిన ఈ సామాజిక కార్యకర్త డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్‌గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయ వేదిక ‘మకాం’ సహ వ్యవస్థాపకురాలిగానూ ఉన్నారు. నారీశక్తి పురస్కార గ్రహీత అయిన రుక్మిణీరావు ముప్పై ఏళ్లుగా ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్’ ద్వారా తెలంగాణలోని ఆరు మండలాలో 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరుచుకోవడానికి, అలాగే ఆడపిల్లల పెంపంకం పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి కృషి చేస్తున్నారు.అమ్మలాంటి అన్నదాత కోసంసాయి ప్రియాంక చదువుకున్నది హైదరాబాద్‌లో. పోషకాహారం దాని ప్రభావిత అంశాల గురించి చర్చించడానికి 600 మంది ప్రతినిధులతో కొలంబోలో జరిగే అంతర్జాతీయ సదస్తులో పాల్గొనే అవకాశాన్ని పొందింది. ఖమ్మంవాసి అయిన పగడాల సాయి ప్రియాంక తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. కూతురికి వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. తెలంగాణలోని రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గ్రామాలలో రైతులను కలిసి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పరీక్షించింది. ఢిల్లీలోని ఐఏఆర్ఐ (ఇండియన్అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో పీహెచ్‌డి చేస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్ ‘కృషి విజ్ఞాన కేంద్రం’లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సైంటిస్ట్‌గా పనిచేస్తోంది. విభిన్న ఆలోచనలు గల సాయి ప్రియాంక కొత్త దారిలో ప్రయాణించడమే కాదు, తన తోటివారి స్ఫూర్తిగా నిలుస్తోంది.సవాళ్లే పట్టాలెక్కించేదిదక్షిణ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పిసిసిఎమ్)గా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ సీనియర్ అధికారిగా కె.పద్మజ ఈ ఏడాది ఆగస్టులో నియమితులయ్యారు. 1991 ఐఆర్సిఆర్లో మొట్టమొదటి మహిళా పిసిసిఎమ్. ఉద్యోగంలో మహిళగా ఎదుర్కొన్న వివక్షను వివరించారు. ‘సమస్యలు వచ్చేదే మనల్ని ధైర్యంగా ఉంచడానికి. మనకు ఏం కావాలో స్పష్టత ఉంటే ఆ పని కూడా సులువు అవుతుంది’ అని తెలిపారు‘మారతాను’ అనుకుంటే మారథాన్ గెలిచినట్టే!జీవనశైలిని మార్చుకోవాలన్న ఒకే ఒక ఆలోచనతో ఇండియా ఫాసెస్ట్ మారథాన్ రన్నర్‌గా తనకై తాను ఓ గుర్తింపును సాధించారు కవితారెడ్డి. 50 ఏళ్ల వయసులో ఆరు ప్రపంచ మారథాన్లను పూర్తి చేసి, స్టార్ మెడల్స్‌ను సొంతం చేసుకున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో మారథాన్ రన్స్‌లో పాల్గొంటున్న కవితారెడ్డి పదేళ్ల క్రితం వరకు గృహిణిగా బాధ్యతల నిర్వహణలో ఉన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం జిమ్‌లో చేరి, అటు నుంచి మారథాన్ రన్నర్‌గా దేశ విదేశాల్లో మహిళల్లో క్రీడాస్ఫూర్తిని నింపుతున్నారు.అన్నీ తానై... తానే నాన్నయివ్యవసాయం చేసే తండ్రి అనారోగ్యంతో చనిపోతే డిగ్రీ చదువుతున్న అతని చిన్న కూతురు అఖిల రైతుగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామ వాసి అఖిల ఉన్న రెండెకరల భూమిని సాగు చేస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న తల్లినీ, నాయినమ్మనూ సంరక్షిస్తోంది. ΄÷లం పనులకు ట్రాక్టర్ నడుపుతూ, వ్యవసాయం చేసుకుంటూ, పోటీ పరీక్షలకు సిద్ధపడుతోంది. తండ్రిలేని లోటును తీర్చుతూ కుటుంబానికి అండగా నిలబడింది. నానమ్మ గురించి రాస్తా!పన్నెండేళ్ల అమ్మాయి పదహారేళ్ల అమ్మాయి గురించి కథలుగా రాసి, దానిని బుక్‌గా అందరికి ముందుకు తీసుకువచ్చింది ఏడవ తరగతి చదువుతున్న అక్షయినీ రెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనవరాలైన అక్షయినీ తాతయ్యలా ‘లా’ చేస్తాను, సమాజంలో ఉన్న గాధలను కథలుగా పరిచయం చేస్తాను, నానమ్మ గురించి రాస్తాను.. అంటూ తన భవిష్యత్తు లక్ష్యాలను మన ముందుంచింది. ఆటపాటలతో రోజులు గడిపేసే ఎంతో మంది పిల్లల మధ్య ఉంటూనే ప్రపంచంలో పేరొందిన రచయితల పుస్తకాలు చదువుతూ, క్రీడల్లో రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్గాన్ని రూపొందించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. చిన్నపిల్లలైనా పెద్ద కలలు కనవచ్చు అంటూ తన పుస్తకాన్ని చూపుతూ భావితరానికి చెబుతోంది.నీ ఆటే బంగారం శ్రీవల్లికరీంనగర్ వాసి శ్రీవల్లికి క్రికెట్ అంటే ఇష్టం. ఐదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే హై స్కూల్ అబ్బాయిలతో కలిసి క్రెకెట్ ఆడటానికి వెళ్లింది. అందరూ ఆమెను చూసి వెటకారం గా నవ్వారు. వారి నవ్వులకు వెనకడుగు వేయకుండా విషయం పీటీటీ సర్‌కు చెప్పింది. శ్రీవల్లి ఇష్టం చూసిన పీఈటీ రహీం శ్రీవల్లి ఉత్సాహానికి మద్దతుగా నిలిచారు. తల్లిదండ్రులూ తమ ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లోని స్పోర్ట్స్ అకాడమీలో చేరి, నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. జాతీయ స్థాయి మహిళా క్రికెట్ జట్టులో తన సత్తా చాటుతోంది. చైతన్య లహరి బాసర ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. కరాటేలో బ్లాక్‌బెల్ట్, కిక్ బాక్సింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్’ ఏర్పాటు చేసింది. నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. తోటి విద్యార్థులకు అండగా నిలిచేందుకు ‘హోప్ హౌజ్ ఫౌండేషన్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. తండ్రిలాగే సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనేది లహరి లక్ష్యం.బస్తీ దొరసానిచెత్తను సేకరించే అమ్మాయి బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ హోదాలో ఒక రోజు అధికారిణిగా పలు శాఖల విధులను స్వయంగా సందర్శించి, తెలుసుకుంది. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లిగుడెసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బస్తీల పిల్లల బాగు కోసం కృషి చేస్తోంది. తల్లిదండ్రులతో పాటు చేత్త సేకరణ పనిచేస్తూ, కాలేజీ చదువులు చదువుతూ, బస్తీ పిల్లలకు చదువులు చెబుతుంటుంది. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేసింది. ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకుంది. గాంధీ కింగ్ స్కాలర్షిప్కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో జయలక్ష్మి ఒకరు. ఇందులో భాగంగా కిందటేడాది అమెరికా వెళ్లి వచ్చింది. ఇప్పుడు డిగ్రీ చేస్తూ యుపీఎస్సీ సాధించాలని కృషి చేస్తోంది.టీచర్ కొలువిచ్చిన సి‘విల్’ పవర్వనపర్తి వాసి అయిన హుమేరా బేగం తండ్రి రోజువారీ కూలీగా హైదరాబాద్‌లో ఒక మదర్సాలో పనిచేసేవాడు. అమ్మ ఉర్దూ టీచర్‌గా కొంత కాలం పనిచేసింది. హుమేరా ఏడో తరగతిలో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతం బారిన పడ్డాడు. తండ్రి అనారోగ్య ప్రభావం హుమేరా చదువుపై పడింది. పదవ తరగతి లో ఉండగా తండ్రి ఆరోగ్యం క్షీణించి మరణించాడు. హుమేరాకు సివిల్స్ సాధించాలన్నది కల. ఆర్థిక స్థితి లేక చదువును వదిలేయాల్సిన స్థితి. హుమేరాకు చదువుపై ఉండే ఆసక్తి, పట్టుదల ‘సేవ్ ద గర్ల్ చైల్డ్’ సంస్థ దృష్టికి చేరింది. ఆ సంస్థ ఆమె చదువుకు అండగా నిలబడింది. డీఎడ్పూర్తి చేసి ఎస్జీటీ ఉర్దూ టీచర్‌గా ఎంపిక అయ్యింది. దయనీయమైన పరిస్థితుల నుంచి టీచర్‌గా ఎదిగిన హుమేరా కృషి ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. -
నీ ఆటే బంగారం... శ్రీవల్లీ
‘క్రికెట్ ప్లేయర్ కావాలనుకుంటున్నాను’ అనే మాట అబ్బాయిల నోట వినిపిస్తే అభినందనలు తెలుపుతారు. ఆశీర్వదిస్తారు. అదే మాట అమ్మాయిల నోటి నుంచి వినిపిస్తే..? అవాక్కవుతారు. ‘అమ్మాయిలకు క్రికెట్ ఎందుకు?’ అని కూడా అంటారు. లక్ష్యం మీద గురి పెట్టిన వారు మాత్రం అలాంటి మాటలను లక్ష్యపెట్టరు. అలాంటి ఒక అమ్మాయి శ్రీవల్లి. ఎన్నో సవాళ్లను అధిగమించి తన కలను నెరవేర్చుకున్న శ్రీవల్లి క్రికెట్లో రాణిస్తోంది. డిసెంబరు 4 నుంచి అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో బీసీసీఐ సీనియర్ మహిళల జట్టులో హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.శ్రీవల్లికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం టీవీలో వీక్షణకే పరిమితం కాలేదు. చిన్న వయసులోనే బాల్, బ్యాట్‌తో గ్రౌండ్లో అడుగు పెట్టేలా చేసింది. శ్రీవల్లి అయిదవ తరగతి చదువుతున్న రోజుల్లో... స్కూల్ ప్లే గ్రౌండ్‌కు వెళ్లింది. హైస్కూల్ అబ్బాయిలు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ‘అన్నా... నేను కూడా ఆడతాను’ అని అడిగింది చిన్నారి శ్రీవల్లి. వాళ్లు బిగ్గరగా నవ్వారు.ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ‘అయిదో క్లాసు అమ్మాయి హైస్కూల్ అబ్బాయిలతో ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. ‘ఆడపిల్లలు క్రికెట్ ఆడడం ఏమిటి!’ అని కావచ్చు. వారి వెటకారపు నవ్వులతో వెనక్కి వెళ్లిపోలేదు శ్రీవల్లి. పీఈటీ రహీం సార్‌కు చెప్పింది. ‘నీ ఉత్సాహం సరే, వారితో ఆడగలవా?’ అని అడిగారు సార్. ‘ఆడతాను’ అని ఉత్సాహంతో తల ఊపింది.నిజానికి అది ఉత్సాహం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన తొలి సంకేతం. విజయపథం వైపు వేసిన తొలి అడుగు. శ్రీవల్లి చేసిన బౌలింగ్‌లో సీనియర్లు షాట్లు బాగానే కొట్టారు. కానీ, తన స్పీడ్‌కు కొందరు బెంబేలెత్తడం పీఈటీ సార్ గమనించారు. లైన్ లెంగ్త్ సరిదిద్దితే శ్రీవల్లిని బాగా తీర్చిదిద్దవచ్చు అని గుర్తించారు. అక్కడ నుంచి తానే కోచ్‌గా మారారు. శ్రీవల్లి బౌలింగ్‌లోని లోపాలను సరిచేస్తూ క్రమంగా స్పీడ్బౌలర్గా తీర్చిదిద్దారు. ‘మీ అమ్మాయికి మంచి భవిష్యత్ ఉంది’ అని శ్రీవల్లి తల్లిదండ్రులకు చె΄్పారు.‘క్రికెట్ అంటే ఏదో సరదాగా ఆడుతోంది కానీ అమ్మాయిని డాక్టర్‌గా చూడాలనేది మా కల’ అని వారు అని ఉంటే శ్రీవల్లి కల ఆవిరైపోయేది. అయితే సార్ మాట విని శ్రీవల్లి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కుమార్తెకు మరింత సాధన అవసరమనుకున్న తండ్రి లక్షా్మరెడ్డి శ్రీవల్లిని హైదరాబాద్ పంపాడు.‘పై చదువుల కోసమో, ఎంసెట్ కోచింగ్ కోసమో పిల్లల్ని హైదరాబాద్‌కు పంపిస్తారుగానీ క్రికెట్ కోచింగ్ కోసం పంపిస్తున్నావా!’ అని బోలెడు ఆశ్చర్యపడిన వాళ్లు... ‘క్రికెట్లో ఎవరికో ఒకరికి అదృష్టం దక్కుతుంది. ఆడినవాళ్లందరూ స్టార్లు కాలేరు’ అని నిరాశపరిచిన వాళ్లూ్ల ఉండొచ్చు. ఎవరి నుంచి ఎలాంటి మాటలు వచ్చినా ఆ తల్లిదండ్రులకు బాగా నచ్చిన మాట...‘మీ అమ్మాయికి క్రికెట్లో మంచి భవిష్యత్ ఉంది’హైదరాబాద్‌లో కనిష్కనాయుడు శిక్షణలో క్రికెట్లో తన నైపుణ్యాన్ని మరింతగా మెరుగుపరుచుకుంది శ్రీవల్లి. ఫాస్ట్బౌలర్గానే కాకుండా, బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోగల ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని సొంతం చేసుకుంది.బాల్యంలోనే పెద్ద కలలు కన్న శ్రీవల్లి టీనేజ్‌లో ఆ కలలను తన సాధనతో మరింత సాకారం చేసుకుంది.ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలనేది శ్రీవల్లి లక్ష్యం. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. – అనిల్ కుమార్ భాషబోయిన సాక్షి ప్రతినిధి, కరీంనగర్ఆ స్ఫూర్తితోనే...అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు క్రికెట్ ఆడడానికి రకరకాల పరిమితులు ఉండొచ్చు. అయితే ఆడాలనే ఉత్సాహంతోపాటు సంకల్పబలం ఉంటే ఆ పరిమితులు మనకు అడ్డుకావు. ఎంతోమంది స్టార్ క్రికెట్ ప్లేయర్ల అపూర్వ విజయాలతో స్ఫూర్తి పొందాను. ఆ స్ఫూర్తితోనే క్రికెట్ గ్రౌండ్లోకి అడుగుపెట్టాను. ఫాస్ట్ బౌలర్‌గా రాణించాలనేది నా కల. – కట్టా శ్రీవల్లి రెడ్డి -
'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!
పుష్ప సినిమా పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఆ డైలాగ్ ఒక్కటే. అదే గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అని చెప్పడం. ఈ డైలాగ్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్కువసార్లు ప్రదర్శించి ఉంటాడు. అంతలా ఫేమస్ అయింది పుష్ప సినిమా డైలాగ్. కానీ అదే రేంజ్లో వైరలైన మరో సీన్ కూడా ఈ చిత్రంలో ఒకటి ఉంది. ఇప్పుడు దానిపైనే మన బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందామా? ఈ సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయిన ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముగ్ధులైపోయారు. ఈ పాటలోని అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌లో చెప్పును వదిలేసి డ్యాన్స్ వేసే స్టెప్పును చాలామంది ట్రై చేశారు. తాజాగా ఆ సాంగ్ గురించే అమితాబ్ ప్రశ్న వేశారు. ఈ సందర్బంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్. ఈ సందర్భంగా పుష్ప చిత్రం గురించి, అందులోని శ్రీవల్లీ పాటకు బన్నీ వేసిన స్టెప్పు గురించి మాట్లాడుతూ.. 'పుష్ప మూవీ నిజంగా అద్భుతం. ఇంకా శ్రీవల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్లో ఇదే మొదటిసారి చూశా. ఆ స్టెప్పును చాలా మంది అనుకరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆ స్టెప్ వేసి.. చెప్పులు వదిలేసి మరీ వేసుకునే వారు' అంటూ అమితాబ్ నవ్వారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలోనే పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. GOAT praises GOAT. 🧎@SrBachchan @alluarjun #Pushpa pic.twitter.com/J5yPkgDq9a — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) November 8, 2023 -
‘మూడు తరాల’ మృత్యువాత!
వైరారూరల్: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారిసహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. బాసరలో బాబుకు అక్షరాభ్యాసం చేయించి స్వస్థలానికి తిరిగి వస్తుండగా వారి ప్రయాణం మధ్యలోనే ముగిసింది. వైరా మండలం పినపాక స్టేజీ వద్ద జాతీయ రహదారిపై కారును ఎదురుగా వస్తున్న లారీ అతివేగంతో ఢీకొనడంతో అజ్మీరా రాంబాబు (52), ఆయన కుమార్తె బానోతు అంజలి (25), మనవరాలు బానోతు శ్రీవల్లి (18 నెలలు) మృతి చెందారు. ఇదే ఘటనలో బానోతు బాబు, రాణి, స్వాతి, ప్రవీణ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బోడిమల్లె తండాకు చెందిన అజ్మీరా రాంబాబు, వాచ్యానాయక్ తండాకు చెందిన బానోతు బాబు వియ్యంకులు. బాబు, రాణి కుమారుడైన డెంటల్ డాక్టర్ నవీన్‌కుమార్‌తో రాంబాబు కుమార్తె అంజలికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కార్తికేయ, 18 నెలల కుమార్తె శ్రీవల్లి ఉన్నారు. కార్తికేయకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందకు బానోతు బాబు, రాణి దంపతులు వారి కుమారులు నవీన్, ప్రవీణ్, కోడళ్లు అంజలి, స్వాతి, మనవరాలు శ్రీవల్లిని తీసుకుని వియ్యంకుడు అజ్మీరా రాంబాబుతో కలసి బాసర వెళ్లారు. గురువారం రాత్రి తిరిగి ఖమ్మం చేరుకున్నారు. అక్కడే బంధువుల ఇంట్లో ఉండి శుక్రవారం మధ్యాహ్నం కారులో వాచ్యానాయక్ తండాకు బయలుదేరారు. కారు పినపాక స్టేజీ చేరుకుంటుండగా ఎదురుగా అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాంబాబు, ఆయన మనవరాలు శ్రీవల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె అంజలిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. గాయపడినవారిలో బాబు, ప్రవీణ్, స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏసీపీ ఎం.ఎ.రెహమాన్, సీఐ తాటిపాముల సురేశ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. -
క్లాస్‌రూంలో పుష్ప ‘శ్రీవల్లి’ స్టెప్పులు! ప్రధానోపాధ్యాయురాలిపై వేటు
బరంపురం: ‘పుష్ప’మేనియా గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. అల్లు అర్జున్ సినిమా ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఓస్కూల్లో పోరగాళ్లు శ్రీవల్లి పాటకు పుష్పరాజ్ లెవల్లోనే చిందులేశారు. దీంతో ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిపై వేటు వేశారు అధికారులు. ఒడిశాలోని గంజాం జిల్లాలో హింజిల్‌కట్ బ్లాక్‌లో ఉన్న ఓ స్కూల్లో విద్యార్థులు ‘పుష్ప’ పాటకు క్లాస్‌రూములోనే డ్యాన్స్ చేశారు. దాంతో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. బారాముందాలి హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు కొందరు టీచర్లు లేని సమయంలో డిజి క్లాస్‌రూమ్‌లోని ఎల్ఈడీ స్క్రీన్‌పై పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి...’ పాటకు చిందేశారు. అంతటితో ఆగకుండా మరికొన్ని సినిమా పాటలు వేసుకుని.. తెగ చిందులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ప్రధానోపాధ్యాయురాలు సుజాతపై వేటు వేశారు జిల్లా విద్యాధికారులు. -
Pushpa: శ్రీవల్లిగా రష్మిక.. ఫస్ట్‌లుక్ అదుర్స్
-
ఇంటర్నెట్లో అది దొరకదు!
పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని కృష్ణమురళి, బాలాచారి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘చిత్రపటం’. బండారు దానయ్య కవి దర్శకత్వంలో పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్‌ను నిర్మాత ఆర్.బి. చౌదరి విడుదల చేశారు. బండారు దానయ్య కవి మాట్లాడుతూ– ‘‘ఇంటర్నెట్లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి.. దొరకనిదల్లా భావోద్వేగం మాత్రమే. దాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రి, కూతురి కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలున్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. మేలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’ కూడా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను’’ అన్నారు. -
గోరింటాకు శ్రీవల్లి
కూతురు అంటే తల్లిదండ్రుల చాటు బిడ్డలా, వారిపై ఆధారపడేలా కాకుండా కుటుంబానికే పెద్ద దిక్కుగా మారే విధానం ‘గోరింటాకు’ సీరియల్లో కనిపిస్తుంది. స్టార్ మా’లో వస్తున్న ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయం అయ్యింది కావ్య. బెంగుళూరు నుంచి తెలుగింటికి వచ్చిన కావ్య సీరియల్లోని తన పాత్ర గురించి, నిజ జీవితం గురించి ఆనందంగా పంచుకుంది. ‘తండ్రికి గుండెజబ్బు. అతను చేసేది మగ్గం పని. కుటుంబం గడవలేని స్థితిలో తండ్రి స్థానాన్ని శ్రీవల్లి తీసుకుంటుంది. చేనేత చీరల అమ్మకం, అందులోని ఎగుడుదిగుడులను తట్టుకుంటూ తను ముందుకుసాగడం చూసే ప్రేక్షకులు ఇలాంటి ధైర్యవంతురాలైన కూతురు తమ ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ మాటలు నాతోనే ప్రేక్షకులు నేరుగా అన్నప్పుడు కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు.’ ఆడిషన్స్ ద్వారా ఎంపిక బిఎస్సీ పూర్తి చేశాక కన్నడ సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కన్నడలోనూ నీలి, నాయకి సీరియల్స్ చేస్తున్నాను. ముందు ఈ ఫీల్డ్ అనుకోలేదు కానీ, మా అమ్మ భాగ్య నేను నటిని కావాలని ఆశపడేది. ఎక్కడ సీరియల్స్, సినిమా ఆడిషన్స్ జరిగినా అక్కడకు తీసుకెళ్లేది. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తి గమనించే అమ్మ నన్ను ఈ ఫీల్డ్కి పరిచయం చేయాలనుకున్నారు. కన్నడలో మూడేళ్లుగా సీరియల్స్ చేస్తున్నాను. ఈ ఏడాది తెలుగులో అవకాశం వచ్చింది. నాన్న నటరాజ్ బోర్‌వెల్స్ బిజినెస్ చేస్తారు. నాకో చెల్లెలు. తను డిగ్రీ సెకండియర్ చదువుతోంది. శ్రీవల్లికి పూర్తి వ్యతిరేకం సీరియల్లో శ్రీవల్లికి ఉన్నంత బరువు బాధ్యతలు నాకు లేవు. అలాగే, అందులో శ్రీవల్లి విలన్స్ నుంచి ఎదుర్కొనే టీజింగ్ సీన్స్ లాంటివి కూడా లేవు. నిజం చెప్పాలంటే నా జీవితం శ్రీవల్లి పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. భక్తురాలిని... గోరింటాకు సీరియల్లో శ్రీవల్లి చాలా స్ట్రిక్ట్. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించదు. ధైర్యంతో పాటు దైవం అంటే భక్తి కూడా ఉంటుంది. మా అమ్మకు దేవుడి మీద బాగా నమ్మకం. రెండు నెలలకోసారి ఇంట్లో హోమాలు, పూజలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో నేనూ పాల్గొంటాను. కాటన్ చీరలు చేనేత బ్యాక్‌గ్రౌండ్ మీద సీరియల్ థీమ్ నడుస్తుంది. ఈ సీరియల్లో శ్రీవల్లికి చీరల షోరూమ్ కూడా ఉంటుంది. మిగతా సీరియల్స్‌లో లాగా హీరోయిన్‌కి హెవీగా మేకప్, డిజైనర్ డ్రెస్సులు కాకుండా కాటన్ చీరలను యూనిట్ సజెస్ట్ చేసింది. దాంతో మంగళగిరి చేనేత చీరలను ధరిస్తుంటాను. సింపుల్‌గా కాటన్ చీరలో కనిపించడంతో శ్రీవల్లి వ్యక్తిత్వం కూడా ఇందులో ప్రతిఫలిస్తుంటుంది. తొందరపడను చేసే పని ఒకేలా ఉండకూడదు అనుకుంటాను. అందుకే త్వరగా అన్నీ చేసేయాలని కోరుకోను. ఈ పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటూనే ఇంకా పై చదువులు చదవాలని ఉంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాను. వేటికీ ఎక్కువ హైరాన పడటం ఉండదు కాబట్టి కాస్త ఖాళీ టైమ్‌ను నా కోసం ఉండేలా జాగ్రత్తపడతాను. అప్పుడేగా మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవచ్చు. ఏ కాస్త తీరికి దొరికినా డ్యాన్స్ చేస్తాను. రాక్, పాప్, ఇండో–వెస్ట్రన్.. ఇలా అన్ని రకాల సంగీతాన్ని ఇష్టపడతాను. అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటాను. నన్ను చూసి నేర్చుకోవాలంటుంది మా చెల్లి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనేది తన తాపత్రయం. ‘అక్కా, ఇద్దరం కలిసే పెరిగాం కదా! నీకింత ధైర్యం ఎలా వచ్చింది’ అని అడుగుతుంటుంది. నన్ను చూసి తనూ ఒక ఫొటో షూట్ ట్రై చేసింది. సూచనలు అడుగుతాను అమ్మానాన్న, చెల్లి నా సీరియల్స్ చూసి సూచనలు చెబుతుంటారు. ఒక్కోసారి వాళ్లు చెప్పకపోయినా నేనే అడుగుతాను. తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రతీ డైలాగ్నకి ముందు దాని పూర్తి అర్ధం తెలుసుకుంటాను. ప్రేక్షకులు మెచ్చేలా నటన ఉండాలని తపిస్తాను’ అని వివరించింది కావ్య. – నిర్మలారెడ్డి -
శ్రీవల్లి క్లీనిక్‌లో చట్టవిరుద్ధంగా అబార్షన్లు
-
అది అతి పెద్ద యజ్ఞం
– విజయేంద్రప్రసాద్ ప్రస్తుత రోజుల్లో కొత్తవారితో సినిమా తీసి రిలీజ్ చేయడమే నా దృష్టిలో అతి పెద్ద యజ్ఞం. ఆ పనిని మా నిర్మాతలు విజయవంతంగా పూర్తిచేశారు. ముఖ్యంగా నాలాంటి తిక్కవాడితో సినిమా తీసి సక్సెస్ అయ్యారు’’ అని ప్రముఖ రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్ అన్నారు. రజత్, నేహాహింగే జంటగా ఆయన దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ‘శ్రీవల్లీ’ విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘శ్రీవల్లీ’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం సంతోషాన్ని కలిగించింది. రజత్ ఫేస్‌లో నెగటివ్ షేడ్స్ చూసి ఈ సినిమాలో హీరోగా అవకాశామిచ్చాను. మోహన్‌బాబు, చిరంజీవి, రజనీకాంత్‌తో పాటు చాలా మంది విలన్‌గా మొదలై, గొప్ప నటులయ్యారు. వారి తరహాలోనే రజత్ అడుగులు వేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘ఈ చిత్ర విజయం మరిన్ని సినిమాల్ని రూపొందించడానికి మాలో ధైర్యాన్ని నింపింది’’ అన్నారు నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్. -
వాళ్లందరూ నాకు స్ఫూర్తి
‘సక్సెస్ అనేది ఓవర్‌నైట్‌లో రాదు. ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చిన చిరంజీవిగారు, మోహన్‌బాబుగారు ఎంతో కష్టపడ్డారు కాబట్టే... ఇప్పుడీ స్థాయిలో ఉన్నారు. సినిమా నేపథ్యం అయినప్పటికీ... బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున గార్లు కష్టపడబట్టే సక్సెస్ అయ్యారు. వాళ్లందరూ నాకు స్ఫూర్తి’’ అన్నారు రజత్. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆయన హీరోగా పరిచయమైన సినిమా ‘శ్రీవల్లీ’. సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ సిన్మా శుక్రవారం విడుదలైంది. ప్రేక్షకుల స్పందన చాలా హ్యాపీగా ఉందంటున్న రజత్ మాట్లాడుతూ– ‘‘నాన్న విజయ్ రామరాజుగారు హైకోర్టులో క్రిమినల్ లాయర్. అమ్మ హౌస్ వైఫ్. మాది చిత్తూరులోని మదనపల్లి. నేను హైదరాబాద్‌లో బీటెక్ చేశా. చిన్నప్పట్నుంచి సినిమాలంటే ఆసక్తి. చిరంజీవిగారి సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే నన్ను లాక్కొచ్చారని చెప్పాలి! ‘వైజాక్’ సత్యానంద్‌గారి దగ్గర ట్రయినింగ్ తీసుకున్నా. రచయితగా, దర్శకుడిగా సక్సెస్‌లో ఉన్న విజయేంద్రప్రసాద్‌గారి సినిమాతో హీరోగా పరిచయం కావడం నా అదృష్టం. ఆయన్నుంచి కష్టపడే తత్వం నేర్చుకున్నా. ఈ సినిమా క్లైమాక్స్ 20 నిమిషాలు, అందులో గ్రాఫిక్స్ సూపర్బ్ అంటుంటే హ్యాపీగా ఉంది. నా నటనకు కూడా మంచి పేరొచ్చింది. ఎటువంటి పాత్రలకైనా నేను సిద్ధమే’’ అన్నారు. -
మా లక్ష్యం అదే!
కథలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం’’ అని నిర్మాతలు రాజ్‌కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్ అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వారు నిర్మించిన ‘శ్రీవల్లీ’ సినిమా ఈరోజు రిలీజవుతోంది. రాజ్‌కుమార్, సునీత మాట్లాడుతూ– ‘‘మాది పాలకొల్లు. ఈ ప్రాంతం నుంచి ఉద్దండులైన సినీ ప్రముఖులు వచ్చారు. వారి స్ఫూర్తితో సినిమా రంగంలోకి వచ్చాం. ‘బాహుబలి’ మాటల రచయిత విజయ్‌కుమార్ ద్వారా విజయేంద్ర ప్రసాద్‌గారిని కలిశాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ నచ్చింది. ఆయన మాత్రమే కథకి న్యాయం చేయగలరని భావించి, దర్శకత్వం చేయమన్నాం. శ్రీవల్లీ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది. గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. రాజ్‌తరుణ్ హీరోగా సుకుమార్ రైటింగ్స్‌లో మా తర్వాతి సినిమాను చేయనున్నాం. ఈ చిత్రానికి ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తారు. ఎప్పటికైనా పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలన్నదే మా అభిలాష’’ అన్నారు. -
సెమీఫైనల్లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శ్రావ్య శివానిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వియత్నాంలోని హో చి మింగ్ సిటీలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... శ్రావ్య పరాజయం చవిచూసింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి రష్మిక 6–3, 6–4తో ఆరో సీడ్ జింగ్యి వాంగ్ (చైనా)పై గెలుపొందగా, ఐదో సీడ్ శివాని 4–6, 6–0, 3–6తో నాలుగో సీడ్ చున్‌జి గుయో (చైనా) చేతిలో ఓడింది. నేడు జరిగే సెమీఫైనలో శ్రీవల్లి... ఏడో సీడ్ పీ యు లై (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక 6–0, 6–1తో రాఫెల్లా విల్లనుయెరా (ఫిలిప్పీన్స్)పై అలవోక విజయం సాధించగా, శ్రావ్య శివాని 7–5, 6–2తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గింది. బాలికల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ శ్రీవల్లి–జింగ్ యంగ్ (చైనా) జోడి 5–7, 7–5, 6–10తో గాబ్రియెల్లా–రేనియా అజీజ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడింది. శివాని–రాఫెల్లా విల్లనుయెరా జోడి 6–3, 6–1తో హుయాన్ హుయంగ్–కె సుయాన్ జంగ్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. -
‘బాహుబలి’తో మార్కెట్ పెరుగుతుందని..
– విజయేంద్రప్రసాద్ ‘‘బాహుబలి’ విడుదల తర్వాత రెండు ప్రశ్నలు నన్ను వెంటాడాయి. ఒకటి –‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని’. ‘బాహుబలి–2’తో ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. రెండోది – ‘శ్రీవల్లీ’ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేద్దామని’. చాలా రోజులుగా ఈ చిత్రబృందం రెండో ప్రశ్న అడుగుతున్నారు. ‘బాహుబలి–2’ తర్వాత ‘శ్రీవల్లీ’ విడుదల చేస్తే మార్కెట్ పెరుగుతుందనే ఆలోచనతో వెయిట్ చేశాం. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయేంద్రప్రసాద్. ఆయన దర్శకత్వంలో రజత్, నేహా హింగే జంటగా సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. మంగళవారం హైదరాబాద్‌లో ‘శ్రీవల్లీ’ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ‘‘ఇది ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ. మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది’’ అని విజయేంద్రప్రసాద్ చెప్పారు. ‘‘మా ధైర్యం, బలం అన్నీ విజయేంద్రప్రసాద్‌గారే. ఆయన కథ, దర్శకత్వంపై నమ్మకంతో మూడు భాషల్లో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు నిర్మాతలు. -
‘శ్రీవల్లీ’ వర్కింగ్ స్టిల్స్
-
రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..!
-
రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..!
రాజమౌళి, తెలుగు సినీ రంగంలో ఓ బ్రాండ్. ప్రాంతీయ సినిమా మార్కెట్ పరిథులను చెరిపేసి రీజినల్ సినిమా కూడా జాతీయ స్థాయి సినిమాలతో పోటి పడగలదని ప్రూవ్ చేసిన దర్శకుడు. ఆర్థిక వనరులు అనుకూలించాలే గాని హాలీవుడ్ స్థాయి సినిమాలు తీయగల సాంకేతిక నిపుణులు మన దగ్గరా ఉన్నారని ప్రూవ్ చేసిన దర్శకుడు. అలాంటి రాజమౌళిని శ్రీవల్లి ఆడియో ఫంక్షన్లో చూసిన వారు అవాక్కయ్యారు. రాజమౌళి తండ్రి, బాహుబలి, భజరంగీ బాయిజాన్ లాంటి చిత్రాల కథా రచయిత అయిన.. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీవల్లి. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఆడియో వేడుకకు రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ వేడుకలో జరిగిన ఓ సంఘటన రాజమౌళి స్థాయిని అభిమానుల హృదయాల్లో మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఆడియో వేడుక జరుగుతుండగా వేదిక మీద ఉన్న విజయేంద్ర ప్రసాద్ షూ లేస్ ఊడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన రాజమౌళి వెంటనే స్వయంగా ఆయనే కింద కూర్చొని తండ్రి షూ లేస్‌ను కట్టారు. జాతీయ స్థాయిలో భారీ ఇమేజ్ ఉన్న దర్శకుడిని అలా చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎన్ని విజయాలు సాధించిన రాజమౌళి అయినా.. తండ్రికి కొడుకే కదా..! -
ఆయన్ను కలిశాక అరగంటలో కథ చెబుతున్నా– సుకుమార్
‘‘విజయేంద్రప్రసాద్‌గారు ‘భజరంగీ భాయిజాన్’ చిత్రకథను కేవలం 22 నిమిషాల్లో చెప్పారు. గతంలో గంటల తరబడి కథలు చెప్పే నేను ఆయన్ను కలసిన తర్వాతే అరగంటలో కథ చెబుతున్నా. సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్, లవ్, రొమాన్స్, హిస్టరీ.. అన్ని కథలూ చెప్పగలరు. ఆయనోసారి కథ చెప్పి బయటకు వెళ్లబోతుంటే తలుపులు వేసి కాళ్లమీద పడ్డా. రెండు కాళ్లనూ పూర్తిగా టచ్ చేశా’’ అన్నారు దర్శకుడు సుకుమార్. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన సినిమా ‘శ్రీవల్లీ’. ఈ చిత్రం టీజర్‌ను సుకుమార్ విడుదల చేశారు. ‘‘ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం వల్ల ఆమెకు గత జన్మ జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అప్పుడేం జరిగిందనేది ఆసక్తిగా ఉంటుంది. ఓ సీన్లో నేహా టాప్‌లెస్‌గా నటించింది’’ అని విజయేంద్రప్రసాద్ తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ – ‘‘ఈ వయసులో విజయేంద్రప్రసాద్‌గారు దర్శకత్వం వహించడం చాలా అద్భుతమైన విషయం. ‘టెన్షన్లు తట్టుకోలేక ఎప్పుడు దర్శకత్వం మానేసి నిర్మాణంవైపు వెళ్దామా?’ అని భయపడుతున్న నాకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇదొక విచిత్రమైన కథ. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. రాజ్‌కుమార్ బృందావనంతో కలసి త్వరలో ఓ చిత్రం నిర్మించనున్నా’’ అన్నారు. ‘‘విజయేంద్రప్రసాద్‌గారు కథాబలి. ఆయన దగ్గరున్న కథల్లో ఆణిముత్యంలాంటి కథతో ఈ సినిమా చేశాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ నిర్మాత సునీతా రాజ్‌కుమార్. రజత్, నేహా హింగే, నిర్మాత రాజ్‌కుమార్ బృందావనం పాల్గొన్నారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి యాక్షన్, హ్యూమన్ ఎమోషన్స్ కథలు రాసిన ఆయన కలం నుంచి ఇప్పుడో సైంటిఫిక్ థ్రిల్లర్ కథ వస్తోంది. ‘శ్రీవల్లి’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. రజత్, నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24న టీజర్‌ను, త్వరలో పాటలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆసక్తికరంగా సాగే సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
మయసభలో వినోదం!
హాస్యనటుడు ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మయసభ’. నెప్పలి కృష్ణ దర్శకత్వంలో ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై సరోజని, దేవా, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వినోదభరితంగా సాగే చిత్రమిది. రొటీన్‌కి భిన్నంగా ఇందులో సరికొత్త వినోదాన్ని ప్రేక్షకులు చూస్తారు. సింగిల్ షెడ్యూల్లో చిత్రం పూర్తి చేయాలనుకున్నాం. ఇప్పటివరకు 50శాతం షూటింగ్ పూర్తయింది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఆద్యంతం వినోదంతో ఈ ‘మయసభ’ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో ఉండే నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి. ఖమ్మం, కృష్ణాజిల్లా, హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని ‘చిత్రం’ శ్రీను తెలిపారు. చింటు, జూ.రేలంగి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, కెమేరా: గోపి కాకర్ల. -
టెన్నిస్ చాంప్స్ అయూబ్, శ్రీవల్లి
ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఐటా టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో అమాన్ అయూబ్‌ఖాన్, శ్రీవల్లి రష్మిక టైటిల్స్ సాధించారు. సూర్య టెన్నిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని పల్లవి స్కూల్ ప్లే గ్రౌండ్స్‌లో జరిగిన తుదిపోరులో అయూబ్, శ్రీవల్లి గెలిచారు. బాలుర అండర్-14 ఫైనల్లో మూడో సీడ్ అయూబ్ ఖాన్ 6-4, 6-4తో నాలుగో సీడ్ సిక్కా సంచిత్పై గెలుపొందాడు. బాలికల టైటిల్ పోరులో టాప్ సీడ్ శ్రీవల్లి రష్మిక 6-2, 6-2తో రెండో సీడ్ ఐశ్వర్యపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆర్మీ బ్రిగేడ్ కల్నల్ రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్నిస్ సంఘం (ఏపీఎల్టీఏ) సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ భార్గవ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ డెరైక్టర్ ఏఆర్ రావు పాల్గొన్నారు.