సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ | srivalli is a Scientific Thriller | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

Published Wed, Dec 21 2016 1:13 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

రచయిత విజయేంద్రప్రసాద్‌ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్‌’ వంటి యాక్షన్, హ్యూమన్‌ ఎమోషన్స్‌ కథలు రాసిన ఆయన కలం నుంచి ఇప్పుడో సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథ వస్తోంది. ‘శ్రీవల్లి’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. రజత్, నేహా హింగే జంటగా రాజ్‌కుమార్‌ బృందావనం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24న టీజర్‌ను, త్వరలో పాటలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆసక్తికరంగా సాగే సైంటిఫిక్‌ ఎరోటిక్‌ థ్రిల్లర్‌ ఇది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: శివశక్తి దత్త, అనంత్‌ శ్రీరామ్, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సునీత రాజ్‌కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement