Scientific Thriller
-
సైంటిఫిక్ థ్రిల్లర్
రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి యాక్షన్, హ్యూమన్ ఎమోషన్స్ కథలు రాసిన ఆయన కలం నుంచి ఇప్పుడో సైంటిఫిక్ థ్రిల్లర్ కథ వస్తోంది. ‘శ్రీవల్లి’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. రజత్, నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24న టీజర్‌ను, త్వరలో పాటలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆసక్తికరంగా సాగే సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
గతజన్మ స్మృతులతో..!
‘బాహుబలి’, ‘బజ్రంగీ భాయ్‌జాన్’ చిత్రాలతో ఈ ఒక్క ఏడాదే వెయ్యి కోట్ల రచయిత అనిపించుకున్నారు విజయేంద్ర ప్రసాద్. కొంత విరామం తర్వాత ఆయన ‘వల్లీ’ పేరుతో ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ డైరెక్ట్ చేస్తున్నారు. నేహా హింగే, రజత్ కృష్ణ, అర్హా ముఖ్యతారలుగా రాజ్‌కుమార్ బృందావన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ గురువారం జరిగింది. ‘‘మనిషి మనసు చదవగలిగే యంత్రం కనిపెట్టడా నికి జీవితాన్ని ధారపోసే ఓ సైంటిస్ట్ కూతురు వల్లి. ఆమె తన తండ్రి లక్ష్యాన్ని సాధించా లనుకుంటుంది. ఆ క్రమంలోనే తన గురువు అశోక్ మల్హోత్రా చేసే ప్రయోగాలకు ఆధారమవు తుంది. ఫలితంగా ఆమెకు తన గత జన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి. అప్పుడే తను లైలా అని తెలుస్తుంది. ఈ లైలా ప్రేమ కోసం వేయి సంవ త్సరాలుగా ఎదురుచూస్తున్న మజ్ను, ఇంకో పక్క వల్లిని ప్రేమించే యువకుడు, మరో పక్క ఆమెను ఇబ్బందిపెట్టే లెస్బియన్... మధ్య కథ నడుస్తుంది’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. షూటింగ్ పూర్తయిందనీ, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయనీ నిర్మాత చెప్పారు. వేడుకలో రాజీవ్ కనకాల, రజత్‌కృష్ణ, అర్హాన్ తదితరులు పాల్గొన్నారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా
ప్రేమను ప్రేమతోనే జయించాలనే కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘పంబలకడి జంబ’. బాబ్జీ, శ్రావణి, అశోక్ ముఖ్యతారలుగా గొర్రెపాటి శివరామ్ దర్శకత్వంలో యు.ఎన్.రాజు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇంత వరకూ రాని కొత్త పాయింట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. నవంబర్ 6 నుంచి 11 లోపు ఈ సినిమాను వీక్షించేవారి పేర్లతో ఒక లక్కీ డిప్ నిర్వహించి, ఒకర్ని ఎంపిక చేస్తాం. విజేతకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సమీపంలో వేసిన వెంచర్లో 50 గజాల ఫ్లాట్‌తో పాటు ఓ గిఫ్ట్‌ను ఇవ్వనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముజీర్ మాలిక్, సంగీతం: జయవర్ధన్, నిర్వహణ: చీయకుర్తి ప్రభాకర్‌రావు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
కాలేజ్ నేపథ్యంలో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్ ‘కుర్ర తుఫాన్’. తేజ, తరుణ్, మాస్టర్ శ్రీరామ్ కాంబినేషన్లో కృష్ణమోహన్ దర్శకత్వంలో సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్ ఇచ్చారు. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తామని కృష్ణమోహన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: టి.పి. భరద్వాజ్, కెమెరా: గోపాల్ సామరాజు. -
సైంటిఫిక్ థ్రిల్లర్‌తో... రచనా ‘బాహుబలి’
‘బాహుబలి’, ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రాల కథా రచయితగా విజయేంద్రప్రసాద్ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఈ రె ండు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించాయి. అర్ధాంగి, శ్రీకృష్ణ, రాజన్న తదితర చిత్రాలు డెరైక్ట్ చేసిన ఈ రచయిత మళ్లీ మెగాఫోన్ పట్టి, ఓ సైంటిఫిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. రజత్‌కృష్ణ, నేహ జంటగా రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ బృందావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ వైవిధ్యమైన కథాంశంతో విజయేంద్ర ప్రసాద్ బాగా తెరకెక్కిస్తున్నారు. ఆయన టేకింగ్ సూపర్బ్. రాజీవ్ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.