సైంటిఫిక్ థ్రిల్లర్‌తో... రచనా ‘బాహుబలి’ | Scientific Thriller Directed by Vijayendra Prasad | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్ థ్రిల్లర్‌తో... రచనా ‘బాహుబలి’

Published Thu, Aug 27 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

సైంటిఫిక్ థ్రిల్లర్‌తో... రచనా ‘బాహుబలి’

సైంటిఫిక్ థ్రిల్లర్‌తో... రచనా ‘బాహుబలి’

 ‘బాహుబలి’, ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రాల కథా రచయితగా విజయేంద్రప్రసాద్ పేరు దేశమంతా మారుమోగిపోతోంది. ఈ రె ండు చిత్రాలు  ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించాయి. అర్ధాంగి, శ్రీకృష్ణ, రాజన్న తదితర చిత్రాలు డెరైక్ట్ చేసిన ఈ రచయిత మళ్లీ మెగాఫోన్ పట్టి, ఓ సైంటిఫిక్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు.
 
 రజత్‌కృష్ణ, నేహ జంటగా  రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ బృందావన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. నిర్మాత మాట్లాడుతూ-
 ‘‘ఓ వైవిధ్యమైన కథాంశంతో విజయేంద్ర ప్రసాద్ బాగా తెరకెక్కిస్తున్నారు. ఆయన టేకింగ్ సూపర్బ్. రాజీవ్ కనకాల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement