సైంటిఫిక్ థ్రిల్లర్‌గా | Pambalakadi Jamba in November | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్ థ్రిల్లర్‌గా

Published Fri, Oct 30 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

సైంటిఫిక్ థ్రిల్లర్‌గా

సైంటిఫిక్ థ్రిల్లర్‌గా

ప్రేమను ప్రేమతోనే జయించాలనే కథాంశంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం ‘పంబలకడి జంబ’. బాబ్జీ, శ్రావణి, అశోక్ ముఖ్యతారలుగా గొర్రెపాటి శివరామ్ దర్శకత్వంలో యు.ఎన్.రాజు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇంత వరకూ రాని కొత్త పాయింట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. నవంబర్ 6 నుంచి 11 లోపు ఈ సినిమాను వీక్షించేవారి పేర్లతో ఒక లక్కీ డిప్ నిర్వహించి, ఒకర్ని ఎంపిక చేస్తాం. విజేతకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సమీపంలో వేసిన వెంచర్‌లో 50 గజాల ఫ్లాట్‌తో పాటు ఓ గిఫ్ట్‌ను ఇవ్వనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముజీర్ మాలిక్, సంగీతం: జయవర్ధన్, నిర్వహణ: చీయకుర్తి ప్రభాకర్‌రావు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement