Comedy Entertainer
-
కామెడీకి రెడీ
‘సూపర్ 30, వార్’ చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్నారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. ఆయన తదుపరి సినిమా ఏంటనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఫరాఖాన్‌తో ఓ సినిమా చేస్తారనే వార్తలు వచ్చాయి. తర్వాత ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. తాజాగా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్, సింగం, గోల్మాల్’ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించారట హృతిక్. ఇదో కామెడీ ఎంటర్టైనర్ అని, హృతిక్ పాత్ర ఆద్యంతం వినోదం పంచేలా ఉంటుందని బాలీవుడ్ టాక్. -
వేసవిలో నవ్వుల హంగామా
సెకండ్ ఇన్నింగ్స్‌లో కథానాయిక జ్యోతిక టాప్‌గేర్‌లో దూసుకెళ్తోన్నట్లు తెలుస్తోంది. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన జ్యోతిక తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తోటి నటీమణులకు సవాల్ విసురుతున్నారు. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రలుగా ‘గులేబకావళి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో కామెడీ నేపథ్యంలో తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుంది. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసి వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగాయని సమాచారం. రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే.. సమ్మర్లో థియేటర్లో నవ్వుల హంగామా సృష్టిస్తారన్నమాట జ్యోతిక. ఈ సినిమా కాకుండా జేజే ఫెడ్రిక్ అనే కొత్త దర్శకుడు వినిపించిన స్క్రిప్ట్‌కు కూడా జ్యోతిక ఊ కొట్టారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రం షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుందట. ఇటీవల ఎస్. రాజ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన సినిమాలోనూ జ్యోతిక నటించారు. -
ముప్పై రోజుల్లో లాయర్ అవ్వడం ఎలా?
పైన టైటిల్ చూస్తే.. కొన్ని ఫేమస్ బుక్స్ గుర్తొస్తాయనుకుంటా? మరి అలాగే ముప్పై రోజుల్లో లాయర్ అవ్వడం ఎలాగో కమెడియన్ పృథ్వీని అడగాలి. ఎందుకంటే పృథ్వీ అది చదివి లాయర్ అవుతున్నాడు తన తదుపరి సినిమాలో. హీరోగా మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి కామెడీ ఎంటర్టైన్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. మళ్లీ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించడానికి ‘మై డియర్ మార్తాండం’ సినిమాతో రెడీ అయ్యారు. మజీన్ మూవీ మేకర్స్‌పై వస్తోన్న ఈ సినిమాకు పవన్ సంగీతాన్ని అందించగా, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. Here's the first look of #MyDearMaarthandam, a thoroughly entertaining crime comedy court room drama, starring Prudhvi as a defence lawyer, who completes law by reading a book called "30 rojullo lawyer avvadam yela"? Produced by Mazin Movie Makers banner, directed by Harish KV pic.twitter.com/fnrlPGHrTs — BARaju (@baraju_SuperHit) July 10, 2018 -
‘జంబ లకిడి పంబ’ టీజర్ రిలీజ్ చేసిన నాని
శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్, మెయిన్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై తెరకెక్కిన సినిమా జంబ లకిడి పంబ. జె.బి.మురళీ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను హీరో నాని గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ - ‘ ఈవీవీగారి ‘జంబ లకిడి పంబ’ నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్ తో సినిమా అనగానే, అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . కరెక్టుగా టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది. మనం ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కాన్సెప్ట్ ఇది. చాలా ఫన్ గా, సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది . ఇక శ్రీనివాస్ రెడ్డి చేస్తే తిరుగేముంది! నాకిష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే ఫస్ట్ నుంచి నాకిష్టం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ గారంటీ. నాలుగైదు సీన్స్ లో కనిపించినా ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే ‘జంబ లకిడి పంబ’ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోండి. ఈ టీజర్ ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది.’ అన్నారు. చిత్రయూనిట్ సమయం కేటాయించి టీజర్ రిలీజ్ చేసినందుకు నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఆ నగర్లో ఐదుగురు
వైవిధ్యమైన కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆనందనగర్‌లో ఐదుగురు’. రామకృష్ణ బొత్స దర్శకత్వంలో యల్లమిల్లి బాలమురళీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రికార్డ్ చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ మూడు పాటలను రికార్డ్ చేశాం. పాటలన్నీ సందర్భానుసారంగా సాగుతాయి. సంగీతదర్శకుడు లక్ష్మణ సాయి అద్భుతమైన స్వరాలందిస్తున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రం ఇది. ఓ అయిదుగురి జీవితాల చుట్టూ తిరిగే కథ’’ అని తెలిపారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా
ప్రేమను ప్రేమతోనే జయించాలనే కథాంశంతో కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘పంబలకడి జంబ’. బాబ్జీ, శ్రావణి, అశోక్ ముఖ్యతారలుగా గొర్రెపాటి శివరామ్ దర్శకత్వంలో యు.ఎన్.రాజు నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 6న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇంత వరకూ రాని కొత్త పాయింట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాం. నవంబర్ 6 నుంచి 11 లోపు ఈ సినిమాను వీక్షించేవారి పేర్లతో ఒక లక్కీ డిప్ నిర్వహించి, ఒకర్ని ఎంపిక చేస్తాం. విజేతకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సమీపంలో వేసిన వెంచర్లో 50 గజాల ఫ్లాట్‌తో పాటు ఓ గిఫ్ట్‌ను ఇవ్వనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ముజీర్ మాలిక్, సంగీతం: జయవర్ధన్, నిర్వహణ: చీయకుర్తి ప్రభాకర్‌రావు. -
అంజలి లేకపోతే గీతాంజలి లేదు : కోన వెంకట్
‘‘ ‘గీతాంజలి’ కథ అనుకున్నప్పుడు మా కళ్లలో మెదిలిన రూపం అంజలి. ఆమె ఒప్పుకోకపోతే ఈ సినిమా లేదు. అనుకున్నట్లు ఈ సినిమాకు అన్నీ కుదిరాయి. హారర్‌తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ ఇది’’ అని కోన వెంకట్ అన్నారు. అంజలి ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘గీతాంజలి’. కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో హీరోగా మారారు. రాజాకిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని బ్రహ్మానందం చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటునిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే వేదికపై బ్రహ్మానందాన్ని చిత్ర బృందం ఘనంగా సత్కరించింది. కోన వెంకట్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘ప్రసాద్ వి.పొట్లూరి ఈ కథ నాకు వినిపించారు. వారే ఈ సినిమా నిర్మించాలని కూడా అనుకున్నారు. కానీ ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో ఆ బాధ్యత నాపై పడింది. ఓ మంచి సినిమా తీయాలని ఎదురు చూస్తున్న ఎం.వి.వి. సత్యనారాయణగారికి ఈ కథ వినిపించాను. ఆయన వెంటనే ‘ఓకే’ అనడంతో సినిమా మొదలుపెట్టాం. జూన్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నవ్విస్తూ భయపెట్టే సినిమా ఇదని, యూనిట్ అంతా చక్కని సహకారం అందిస్తున్నారని నిర్మాత అన్నారు. ‘‘నేను టైటిల్ రోల్ పోషిస్తున్న మూడో చిత్రమిది. నటిగా నాకు మంచి గుర్తింపు తెస్తుందీ సినిమా’’ అని అంజలి ఆశాభావం వ్యక్తపరిచారు. శ్రీనివాసరెడ్డి లీడ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం అద్భుతమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోందని బ్రహ్మానందం చెప్పారు. సినిమా ఘనవిజయం సాధించాలని అతిథిగా విచ్చేసిన వి.వి. వినాయక్ ఆకాంక్షించారు. ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, రచనా సహకారం: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కిలారు.