
సెకండ్ ఇన్నింగ్స్‌లో కథానాయిక జ్యోతిక టాప్‌గేర్‌లో దూసుకెళ్తోన్నట్లు తెలుస్తోంది. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చిన జ్యోతిక తాజాగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, తోటి నటీమణులకు సవాల్ విసురుతున్నారు. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రలుగా ‘గులేబకావళి’ ఫేమ్ కల్యాణ్ దర్శకత్వంలో కామెడీ నేపథ్యంలో తమిళంలో ఓ సినిమా తెరకెక్కనుంది. వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసి వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా పూజా కార్యక్రమం ఆదివారం చెన్నైలో జరిగాయని సమాచారం.
రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే.. సమ్మర్‌లో థియేటర్‌లో నవ్వుల హంగామా సృష్టిస్తారన్నమాట జ్యోతిక. ఈ సినిమా కాకుండా జేజే ఫెడ్రిక్ అనే కొత్త దర్శకుడు వినిపించిన స్క్రిప్ట్‌కు కూడా జ్యోతిక ఊ కొట్టారని కోలీవుడ్ టాక్. ఈ చిత్రం షూటింగ్ మార్చిలో స్టార్ట్ కానుందట. ఇటీవల ఎస్. రాజ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన సినిమాలోనూ జ్యోతిక నటించారు.
Comments
Please login to add a commentAdd a comment