Neha Hinge
-
మా లక్ష్యం అదే!
కథలో కొత్తదనానికి పెద్దపీట వేస్తూ సినిమాలు తీయాలన్నదే మా లక్ష్యం. నేటి ట్రెండ్‌కు తగ్గ జనరంజక చిత్రాల్ని నిర్మించాలన్నదే మా అభిమతం’’ అని నిర్మాతలు రాజ్‌కుమార్ బృందావనం, సునీత రాజ్‌కుమార్ అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వారు నిర్మించిన ‘శ్రీవల్లీ’ సినిమా ఈరోజు రిలీజవుతోంది. రాజ్‌కుమార్, సునీత మాట్లాడుతూ– ‘‘మాది పాలకొల్లు. ఈ ప్రాంతం నుంచి ఉద్దండులైన సినీ ప్రముఖులు వచ్చారు. వారి స్ఫూర్తితో సినిమా రంగంలోకి వచ్చాం. ‘బాహుబలి’ మాటల రచయిత విజయ్‌కుమార్ ద్వారా విజయేంద్ర ప్రసాద్‌గారిని కలిశాం. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ నచ్చింది. ఆయన మాత్రమే కథకి న్యాయం చేయగలరని భావించి, దర్శకత్వం చేయమన్నాం. శ్రీవల్లీ అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ప్రతిక్షణం మలుపులతో కొత్త అనుభూతినిస్తుంది. గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. రాజ్‌తరుణ్ హీరోగా సుకుమార్ రైటింగ్స్‌లో మా తర్వాతి సినిమాను చేయనున్నాం. ఈ చిత్రానికి ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తారు. ఎప్పటికైనా పవన్‌కల్యాణ్‌తో సినిమా చేయాలన్నదే మా అభిలాష’’ అన్నారు. -
సైంటిఫిక్ థ్రిల్లర్
‘బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్’ వంటి అద్భుతమైన చిత్రాలకు కథ అందించి, ‘రాజన్న’ మూవీతో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’. రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. టీజర్, ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ బాగుందని పలువురు ప్రముఖులు ఫోన్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
సైంటిఫిక్ థ్రిల్లర్
రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి యాక్షన్, హ్యూమన్ ఎమోషన్స్ కథలు రాసిన ఆయన కలం నుంచి ఇప్పుడో సైంటిఫిక్ థ్రిల్లర్ కథ వస్తోంది. ‘శ్రీవల్లి’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఆయనే దర్శకుడు. రజత్, నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24న టీజర్‌ను, త్వరలో పాటలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘ఆసక్తికరంగా సాగే సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
మాజీ మిస్ ఇండియాకు బెదిరింపులు
ఫెమినా మిస్ ఇండియా 2010 నేహా హింగెకు చంపేస్తానంటూ ఓ అగంతకుడు బెదిరించాడు. నేహా పుణె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేసి నిందితుడి అరెస్ట్ చేశారు. నాసిక్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నేహా పేరుతో నకిలీ అకౌంట్లు తెరిచాడు. అందులో ఆమె ఫొటోలను పోస్ట్ చేసి, వాటిపై అసభ్యకర వ్యాఖ్యలు రాశాడు. అంతేగాక నేహా స్నేహితులను కూడా సోషల్ మీడియా ద్వారా వేధించడం మొదలుపెట్టాడు. ఇలాంటి పనులు మానుకోవాలని నేహా హెచ్చరించడంతో చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పుణె పోలీసులను ఆశ్రయించింది. వీటివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని నేహా చెప్పింది.