
మాజీ మిస్ ఇండియాకు బెదిరింపులు
ఫెమినా మిస్ ఇండియా 2010 నేహా హింగెకు చంపేస్తానంటూ ఓ అగంతకుడు బెదిరించాడు. నేహా పుణె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేసి నిందితుడి అరెస్ట్ చేశారు.
నాసిక్కు చెందిన 22 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్లో నేహా పేరుతో నకిలీ అకౌంట్లు తెరిచాడు. అందులో ఆమె ఫొటోలను పోస్ట్ చేసి, వాటిపై అసభ్యకర వ్యాఖ్యలు రాశాడు. అంతేగాక నేహా స్నేహితులను కూడా సోషల్ మీడియా ద్వారా వేధించడం మొదలుపెట్టాడు. ఇలాంటి పనులు మానుకోవాలని నేహా హెచ్చరించడంతో చంపేస్తానని ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె పుణె పోలీసులను ఆశ్రయించింది. వీటివల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నానని నేహా చెప్పింది.