టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్‌కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్‌లైన్‌లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్‌ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: ఎన్‌బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment