మయసభలో వినోదం! | Entertainment in the maya sabha | Sakshi
Sakshi News home page

మయసభలో వినోదం!

Published Sun, Mar 27 2016 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

మయసభలో వినోదం!

మయసభలో వినోదం!

హాస్యనటుడు ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘మయసభ’. నెప్పలి కృష్ణ దర్శకత్వంలో ఖమ్మం క్రియేషన్స్ పతాకంపై సరోజని, దేవా, కోటయ్య, రమణారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘‘వినోదభరితంగా సాగే చిత్రమిది. రొటీన్‌కి భిన్నంగా ఇందులో సరికొత్త వినోదాన్ని ప్రేక్షకులు చూస్తారు. సింగిల్ షెడ్యూల్‌లో చిత్రం పూర్తి చేయాలనుకున్నాం.

ఇప్పటివరకు 50శాతం షూటింగ్ పూర్తయింది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ‘‘ఆద్యంతం వినోదంతో ఈ ‘మయసభ’ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇందులో ఉండే నాలుగు పాటలు ఆకట్టుకుంటాయి. ఖమ్మం, కృష్ణాజిల్లా, హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని ‘చిత్రం’ శ్రీను తెలిపారు. చింటు, జూ.రేలంగి, షకలక శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాకేత్, కెమేరా: గోపి కాకర్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement