ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: ఐటా టాలెంట్ సిరీస్ జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అమాన్ అయూబ్‌ఖాన్, శ్రీవల్లి రష్మిక టైటిల్స్ సాధించారు. సూర్య టెన్నిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని పల్లవి స్కూల్ ప్లే గ్రౌండ్స్‌లో జరిగిన తుదిపోరులో అయూబ్, శ్రీవల్లి గెలిచారు. బాలుర అండర్-14 ఫైనల్లో మూడో సీడ్ అయూబ్ ఖాన్ 6-4, 6-4తో నాలుగో సీడ్ సిక్కా సంచిత్‌పై గెలుపొందాడు.
బాలికల టైటిల్ పోరులో టాప్ సీడ్ శ్రీవల్లి రష్మిక 6-2, 6-2తో రెండో సీడ్ ఐశ్వర్యపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆర్మీ బ్రిగేడ్ కల్నల్ రాంబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టెన్నిస్ సంఘం (ఏపీఎల్‌టీఏ) సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ భార్గవ్, సూర్య టెన్నిస్ ఫౌండేషన్ డెరైక్టర్ ఏఆర్ రావు పాల్గొన్నారు.
టెన్నిస్ చాంప్స్ అయూబ్, శ్రీవల్లి
Published Wed, May 21 2014 12:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement