
చెన్నై: తమిళ, తెలుగు సినిమాల్లో హీరోల తల్లి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటి శరణ్య ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ మలయాళ దర్శకుడు ఆంటోనీ భాస్కర్ రాజ్(95) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని విరుగంబక్కమ్‌లో తన కూతురు శరణ్య ఇంట్లో ఉన్న ఆయనకు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. (దర్శకుడు నిషికాంత్ ఇకలేరు)
దర్శకుడి మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా 70కు పైగా చిత్రాలను తెరకెక్కించిన ఏబీ రాజ్ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కువగా తమిళనాడులోనే జరిగింది. తొలుత శ్రీలంకలో దర్శకుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మలయాళం పరిశ్రమలో అడుగు పెట్టారు. అక్కడ స్టార్ హీరోలతో కలిసి పలు హిట్ సినిమాలు నిర్మించిన ఆయన తమిళంలోనూ సినిమాలు రూపొందించారు. (సెప్టెంబర్‌లో బిగ్‌బాస్; అతడికి 16 కోట్లు!)