తమిళ సినిమా: ఆదిరాజ్ దర్శకత్వం వహింన చిత్రం అరువా సండై. వైట్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.రాజా నిర్మిం కథానాయకుడిగా నటింన చిత్రం ఇది. సిలంది, కన్నడ చిత్రం గణతంత్ర చిత్రాల ఫేమ్ ఆదిరాజా దర్శకత్వం వహింన ఈ చిత్రానికి ధరన్ కుమార్ సంగీతాన్ని అందించారు. చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు.
నిర్మాత కలైపులి ఎస్ ధాను తమిళ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ మురళి, కేఆర్, నటుడు నిర్మాత కె. రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయకుడు వి.రాజా మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తాను ఎంతో కష్టపడి నిర్మించి విడుదల చేస్తున్నానని చెప్పారు. అయితే చిత్ర ప్రమోషన్స్‌కి హీరోయిన్లు రావడం లేదని అంటున్నారని, చివరికి అమ్మ పాత్ర పోషిస్తున్న నటీమణులు కూడా రావడం లేదని ఆరోపించారు.
ఈ చిత్రంలో నటి శరణ్య పొన్‌వన్నన్ ది హీరోయిన్ పాత్ర కంటే ముఖ్యమైందని చెప్పారు. అలాంటిది ఆమె చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమిలాడినా పాల్గొనలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. అదే పెద్ద నిర్మాత చిత్రం అయితే ఆమె ఇలా ప్రవర్తిస్తుందా..? అంటూ ప్రశ్నించారు. ఈ విధంగా వర్ధమాన నిర్మాతలను తొక్కేసే ప్రయత్నం చేయరాదన్నారు. అతిథిగా పాల్గొన్న నిర్మాత కె.ఆర్ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment