భర్తతో శరణ్య (ఫైల్)
ఆత్మహత్య చేసుకున్న శరణ్య తల్లిదండ్రుల ఆరోపణ
ముషీరాబాద్: శాడిస్తు భర్త వేధింపులు తాళలేక తన కుమార్తె శరణ్య ఆత్మహత్య చేసుకుందని కరీనంగర్ జిల్లా కాపువాడకు చెందిన మృతురాలి తల్లిదండ్రులు మోహన్, విజయలు ఆరోపించారు. సోమవారం రాంనగర్ వారు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... చిన్న కుమార్తె శరణ్య(25)ను గోదావరిఖని ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఇంజనీర్ రాజమౌళి కుమారుడు ఎం.మధుకర్‌కు ఇచ్చి 2015 నవంబర్‌లో పెళ్లి చేశారు. రూ.10 లక్షలు నగదు, 30 తులాల బంగారం, రెండు కిలోల వెండి, రూ.30 లక్షలు విలువ చేసే రెండు గుంటల స్థలం కట్నం కింద ఇచ్చారు.
పెళ్లికి ముందు శరణ్య సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసేది. నెలకు రూ.80 వేలు జీతం వచ్చేది. ఉద్యోగం మాన్పిం చి భర్త శరణ్యను తనతో పాటు బెంగళూర్ తీసుకెళ్లాడు. ప్రస్తు తం ఆమె ఏడు నెలల గర్భిణి. బెంగళూర్ వెళ్లాక మధుకర్ భార్యను మానసిక శారీరక వేధింపులకు గురి చేసేవాడు. ఉద్యోగానికి వెళ్లే ముందు భార్య ఎవరితోనూ ఫోన్‌లో మాట్లాడకూడదని ఫోన్‌కు లాక్ చేసేవాడు. ఏప్రిల్ 25న కరీంనగర్‌లో శర్యణకు శ్రీమంతం చేశారు. బెంగళూరుకు తిరిగి వెళ్లే సమయంలో తన భర్త వేధిస్తున్న తీరును తల్లిదండ్రులకు చెప్పి రోదించింది.
అయితే, తల్లిదండ్రులు కూతురికి సర్దిచెప్పి పంపారు. కాగా, భర్త మధుకర్, అత్తింటివారు రకరకాలుగా వేధిస్తుండటంతో తాళలేక తమ కుమార్తె ఈనెల 3న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని శరణ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె మృతిపై బెంగళూరులోని మాడివాల పోలీస్ స్టేష న్ పరిధిలో కేసు నమోదు చేశామని, అయితే అల్లుడు మధుకర్ తన పలుకుబడితో కేసును తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, హోం మంత్రి నాయిని, డీజీపీ, కరీంనగర్ జిల్లా ఎస్పీ స్పందించి తమ కుమార్తె ఆత్మహత్యకు కారుకులైన అల్లుడు మధుకర్, అతని కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయించాలని వేడుకున్నారు.