‘పెళ్లాం ఉండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నావు’ | Software Engineer Lavanya Record Video Before Suicide | Sakshi
Sakshi News home page

అందుకేనా నన్ను పెళ్లి చేసుకుంది?: లావణ్య

Published Mon, Jul 13 2020 6:27 PM | Last Updated on Mon, Jul 13 2020 7:31 PM

Software Engineer Lavanya Record Video Before Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య లహరి ఆత్మహత్యకు పాల్పడటం పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆత్మహత్యకు ముందు లావణ్య రికార్డు చేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో లావణ్య చెప్పుకున్న బాధలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి. ప్రేమ పేరుతో తన భర్త వెంకటేశ్‌ ఏ విధంగా మోసం చేశాడో లావణ్య ఈ వీడియోలో వివరించారు. అయినా అతడి మీద ప్రేమ చావలేదని కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తనను ఎంతో ప్రేమించారని.. కానీ వాళ్లను మోసం చేసి ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నందుకు క్షమించాలని కోరారు. (లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం)

‘ప్రేమించానని వెంటపడ్డావు. నా కోసం ఏదైనా చేస్తానని చెప్పావు. నీ మీద నమ్మకంతో తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్నాను. కానీ పెళ్లైన తర్వాత నీ నిజస్వరూపం తెలిసింది. బయటకు ఎన్నో నీతులు చెప్తావు.. కానీ నీకు అసలు వ్యక్తిత్వం ఉందా?. నేను గర్భిణిగా ఉన్నప్పుడు.. నువ్వు మరోకరితో సంబంధం పెట్టుకున్నావు అని తెలిసింది. నా ముందే వాళ్లతో వీడియో కాలింగ్‌లో మట్లాడేవాడిని. అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు తప్పని చెప్పినందుకు నాపై దాడి చేశావు. అనేక సార్లు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టావు. హింసించావు. ఇందుకోసమేనా నన్ను పెళ్లి చేసుకుంది. 

నీ గురించి తెలిసిన రోజే నిన్ను వదిలేసి ఉంటే బాగుండేది. కానీ అలా చేయకపోవడం నేను చేసిన తప్పు. నీకు, నీ కుటుంబానికి బంధుత్వాల గురించి తెలియవు. కుక్కలకైనా తిన్న విశ్వాసం ఉంటుంది.. మీ కుటుంబానికి అది కూడా లేదు. తప్పు చేస్తుంటే నీ తండ్రే నీకు మద్దతుగా నిలుస్తున్నాడు. పెళ్లాం.. ఉండగానే శిరీష అనే అమ్మాయితో తిరుగుతున్నావు. ఇలా ఎంత మంది అమ్మాయిల జీవితాలను నాశం చేస్తావు. నేను ఇక ఉండను కాబట్టి.. కనీసం ఆమెను అయినా పెళ్లి చేసుకో. మరోక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు.  నీ ముఖానికి ఉన్న మాస్క్‌ తీసేయ్‌. (ఇక భరించలేను.. ఉండలేను! )

ఎన్నో ఆశలతో నీతో భవిష్యత్తును ఊహించుకున్నాను. పెళ్లి తర్వాత నీ విశ్వరూపం తెలిసింది. నేను సంపాందించి అంతా నీ పేరున వేసుకున్నావు. నీకు ఉద్యోగం లేకపోయినా ఏళ్ల తరబడి పోషించాను. నీకు ఉద్యోగం వచ్చాక హింసించడం మొదలు పెట్టావు. కావాలంటే నా పే స్లిప్‌లు చూడండి. నేను సంపాదించింది ఎంతో తెలుస్తోంది. డాడీ వీడి వద్ద 48 లక్షలు తీసుకోండి.. ఒక అబ్బాయిని దత్తతు తీసుకుని మంచిగా పెంచండి. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు.. ఎంతో  ఇచ్చారు.. కానీ దాని మోసం చేసి వెళ్లిపోతున్నాను.  మీ అందరు అంటే నాకు చాలా ఇష్టం.. ఈ వెధవ అన్న నాకు చాలా ఇష్టం.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని లావణ్య తెలిపారు. మరోవైపు లావణ్య ఆత్మహత్య కేసులో శంషాబాద్‌ పోలీసులు ఇప్పటికే ఆమె భర్త, అత్తమామలు, ఇద్దరు ఆడపడుచుల్ని అదుపులోకి తీసుకని విచారిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement