లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం | Techie Lavanya Lahari Suicide Case Update | Sakshi
Sakshi News home page

లావణ్య ఆత్మహత్య కేసులో కొత్త కోణం

Published Sun, Jun 28 2020 7:34 PM | Last Updated on Sun, Jun 28 2020 8:00 PM

Techie Lavanya Lahari Suicide Case Update - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. లావణ్య భర్త పైలట్‌ వెంకటేశ్వర్‌రావుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటమే ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరో మహిళతో వెంకటేశ్వర్‌రావు ఉండగా.. లావణ్యకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో లావణ్య అతడిని నిలదీసింది. అయితే ఆ తర్వాత నుంచి వెంకటేశ్వర్‌రావు మరింతగా రెచ్చిపోయాడు. ఇంట్లో ఉండే ఆ మహిళతో సోషల్‌ మీడియాలో చాటింగ్‌ చేయడంతో పాటు.. లావణ్య ముందే ఆమెకు వీడియో కాల్స్‌ చేసి మాట్లాడేవాడు. (చదవండి : ఇక భరించలేను.. ఉండలేను!)

దీంతో లావణ్య తనకు అన్యాయం చేయవద్దని ఆ మహిళను వేడుకున్నారు. మరోవైపు తీరు మార్చుకోని వెంకటేశ్వర్‌రావు.. లావణ్యపై భౌతిక దాడులకు పాల్పడ్డాడు. గర్భవతి అనికూడా చూడకుండా భర్త తనపై దాడి చేయడంతో లావణ్య మరింత ఉద్వేగానికి లోనయ్యారు. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి అసలు రూపం తెలుసుకుని మనస్తాపం చెందారు. ఈ క్రమంలో లహరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో లావణ్య మృతికి సంబంధించి మరో మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలు కూడా సేకరించినట్టుగా సమాచారం. మరోవైపు తమ కూతురిని వెంకటేశ్వర్‌రావు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు. పెళ్లి జరిగిన నాటి నుంచి అనేక రకాలుగా వేధించాడని, తమ నుంచి లక్షల రూపాయలు దండుకున్నాడన్నారు. అతడి పైలట్‌ లైసెన్స్‌ను రద్దు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. కాగా, శంషాబాద్‌లోని సీఎస్‌కే విల్లాలో నివాసం ఉంటున్న లావణ్య భర్త వేధింపుల కారణంగా శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. (చదవండి : వీడియో: పైలట్‌ మొగుడి పైశాచికం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement