ఎంత కాలం నటిస్తావు..? | Software Engineer Lavanya Full Video Reveals Rangareddy Police | Sakshi
Sakshi News home page

నీ వ్యక్తిత్వానికి ముసుగేసుకున్నావ్‌

Published Tue, Jul 14 2020 7:41 AM | Last Updated on Tue, Jul 14 2020 7:41 AM

Software Engineer Lavanya Full Video Reveals Rangareddy Police - Sakshi

శంషాబాద్‌: మూడు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లావణ్య లహరి.. ఆత్మహత్యకుకు ముందు భర్త వెంకటేశ్వరావును ఉద్దేశించి మాట్లాడిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది.  అతడి ప్రవర్తనతో విసిగి జీవితంపై విరక్తితో ఆత్మహత్య నిర్ణయం తీసుకుంటున్నాని లావణ్య లహరి గతంలోని ఓ వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే.. అదే రోజు ఆ వీడియోకు ముందు వెంకటేశ్వర్‌రావును ఉద్దేశించి కూడా లావణ్య మాట్లాడిన మరికొంత వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది ‘సమాజాన్ని మోసం చేయడానికి ముసుగు వేసుకుని నటిస్తున్నావు.. ఎంత కాలం నటిస్తావు..?  నీ కుటుంబ చరిత్ర కూడా ఎంతో హీనమైంది.. నిన్ను కూడా అదే దారిలో నడిపించాలని వారు చూస్తున్నారు. ప్రేమ.. ప్రేమ అని వెంటపడి నన్ను మోసం చేశావు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘డబ్బుతో ఏ నీచానికైనా ఒడిగట్టాలనే మనస్తత్వం నీది.. మన మధ్యన ఒక్క తీపి జ్ఞాపకం కూడా లేదు. ఏడు నెలల గర్భం పోయి నేను బెడ్‌పై ఉన్నప్పుడు మరో ఆడదానితో చాటింగ్‌ చేశావు. రేపు దానిని కూడా నువ్వు మోసం చేస్తావు’ అని లావణ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

నీవు నన్ను కొట్టిన ప్రతి దెబ్బలను ప్రతి గోడ చెబుతుంది.. అంతలా నన్ను శారీరకంగా హింసించావు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, గతంలోని వీడియోకి అనుబంధంగానే ఈ వీడియో ఉన్నప్పటికీ.. అప్పుడు బయటికి వచ్చిన వీడియో మధ్యలోంచి ఉంది.. ఇందులో ఆమె భర్తను నేరుగా ప్రశ్నించి.. ఆవేదన వ్యక్తం చేసినట్లు ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement