హిచ్‌కాక్ తరహా స్క్రీన్‌ప్లే
ఆ బంగ్లాలో ఓ ఫ్యామిలీ దిగుతుంది. అక్కడ ఏవేవో వింతలూ విడ్డూరాలూ వాళ్లకు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘నో ఎండ్’. భరత్, స్నేహానాయుడు, ప్రవీణ్, శరణ్య కాంబినేషన్‌లో మురళి కామేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తుందని, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని మురళి కామేటి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి, కెమెరా: రవి.ఎం. మురళీకృష్ణ, సహనిర్మాతలు: సంజీవ కామేటి, నరేశ్ యాదవ్.