
శరణ్య మృతదేహం
గొల్లపల్లి(వెల్గటూర్): చదువుకోమని తండ్రి మందలించడంతో మండలంలోని కిషన్‌రావుపేటకు చెందిన కీకల శరణ్య అనే డిగ్రీ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కీకల చంద్రయ్య కూతురు శరణ్య ధర్మారం మండలంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. కొద్ది రోజుల క్రితం చదువు విషయమై తండ్రితో వాగ్వాదం జరిగింది. దీంతో కలత చెందిన శరణ్య ఈనెల 27న వేకువ జామున ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కరీంనగర్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. తండ్రి చంద్రయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.