► రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి
► పెరంగళత్తూరులో విషాదం
► మృతుల్లో ముగ్గురు మహిళలు
నిశ్చితార్థానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. ఈ ఘటన చెన్నై పెరంగళత్తూరుకు చెందిన ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన కారు, లారీ ఢీ కొనడంతో ఐదుగురు సంఘటనా స్థలంలోనే విగత జీవులు అయ్యారు. మరొకరు ఆసుపత్రిలో మరణించారు.
సాక్షి, చెన్నై: తాంబరం సమీపంలోని పెరంగళత్తూరుకు చెందిన సుందరం(60) కా టాన్ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సింగపూర్‌లో ఇంజనీర్‌గా ఉన్న తనయుడు నరేష్‌కు వివాహం జరిపేందుకు సుంద రం నిర్ణరుుంచాడు. తంజావూరు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తో వివాహ నిశ్చితార్థానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం నిమిత్తం పెరంగళత్తూరు, రెడ్‌హిల్స్‌లోని తన బంధువు ల్ని తంజావూరుకు సుందరం తీసుకెళ్లా డు. కొందరు బంధువులు తనతో పాటు గా కారులో, మిగిలిన వారిని వ్యాన్‌లో తీసుకెళ్లారు. ఆదివారం నిశ్చితార్థం ము గించుకుని రాత్రికి రాత్రే తిరుగు పయ నం అయ్యారు. ఆనందోత్సాహాలతో శుభకార్యాన్ని ముగించుకుని తిరుగు పయనంలో ఉన్న వాళ్లు, మరికొన్ని గం టల్లో పెరంగళత్తూరు చేరుకోవాల్సి ఉం ది. మార్గమధ్యలో మృత్యువు కబళించడంతో ఆరుగురు విగత జీవులయ్యారు.
నిశ్చితార్థానికి వెళ్లి వస్తూ....: తిరుగు పయనంలో కారును సుందరం బంధువు దురైరాజ్ కుమారుడు రామచంద్రన్(34) నడిపాడు. ఆ కారులో మరో బంధువు వీరాస్వామి భార్య పద్మ(55), కార్తీకేయన్ భార్య సుశీల(65), ఇరులయ్య కుమారుడు ఆకాష్(11)లతో పాటుగా రెడ్‌హిల్స్‌కు చెందిన పాపాత్తి (65)లు పయనం సాగించారు. విల్లుపురం జిల్లా ఉలందూరు పేట సమీపంలోని ఆసనూరు వద్దకు సోమవారం వేకువ జామున ఒంటి గంట సమయంలో చేరుకుంది. అక్కడి కూడలి వద్ద హఠాత్తుగా తిరుచ్చి వైపుగా వెళ్తున్న లారీ అడ్డు పడడంతో కారు అదుపు తప్పింది. రెండు వాహనాలు అతి వేగంగా ఢీ కొనడంతో కారులో ఉన్న వాళ్లందరూ తలా ఓ దిక్కున పడ్డారు. వెనుక వైపు వ్యాన్‌లో వస్తున్న మిగిలిన బంధువులు ఈ ఘటనతో ఆందోళనలో పడ్డారు.
హుటాహుటీన కారు వద్దకు సమీపించారు.అప్పటికే కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడంతో పాటు గా సుందరం, ఆకాష్, పాపాత్తి, పద్మ, సుశీల మృతి చెందడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. రామచంద్రన్ తీవ్ర గా యాలతో పడి ఉండడంతో హుటాహుటీన ఉలందూరుపేట ఆసుపత్రికి తరలించారు. అరుుతే, అక్కడ చికిత్స ఫలిం చక మరణించాడు. తమ వాళ్లు ఆరుగురు మరణించడంతో ఆ కుటుంబాలు తీవ్ర విషాదంలో పడ్డారుు. సమాచారం పెరంగళత్తూరు, రెడ్ హిల్స్‌లోని మిగి లిన బంధువులకు అందడంతో సర్వత్రా శోక సంద్రంలో మునిగారు. కొందరు అరుుతే, ఆగమేఘాలపై ఉలందూరు పేటకు తరలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృత దేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో గంటన్నరకు పైగా జాతీయ రహదారిలో వాహనాల రాక పోకలకు తీవ్ర ఆటంకం తప్పలేదు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను మంగళవారం పెరంగళత్తూరుకు తరలించే అవకాశాలు ఉన్నారుు.