చెన్నై:భారత ఒలింపిక్ సంఘం కీలక సమావేశం శుక్రవారం జరిగింది. 38 వ జాతీయ క్రీడలకు సంబంధించి బిడ్డింగ్ లో భాగంగా ఒలింపిక్ సంఘం సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిడ్డింగ్ లో ఏపీ క్రీడా సమాఖ్య వైఫల్యం చెందింది. ఇందుకు సంబంధించి రూ.50 లక్షల డీడీ ఇవ్వడంలో ఏపీ క్రీడాధికారులు చొరవ చూపలేదు. ఏపీ సర్కారుకు, క్రీడా అధికారులు దూరం పెరగడంతో బిడ్ వేయడంలో విఫలమయ్యారు.
దీని కోసం రూ. 50 లక్షల డీడీ కట్టిన ఉత్తరాఖండ్ ఆ బిడ్ ను చేజిక్కించుకుంది. ఉత్తరాఖండ్ తరుపున అడిషనల్ చీఫ్ సెక్రటరీతో సహా క్రీడా అధికారులు హాజరయ్యారు.