![Commonwealth Games 2022: IOA felicitates CWG medal winners with cash awards - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/14/IOA-1.jpg.webp?itok=9gOD4BDV)
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది.
ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment