Cash prizes
-
ఆటకు అందలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. 2.99లక్షల మ్యాచ్‌లు.. 52.31లక్షల క్రీడాకారులు తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 1.50లక్షల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక్కడి విజేతలు అనంతరం మండల స్థాయిలో పోటీపడతారు. అంటే 680 మండలాల్లో మొత్తం 1.42లక్షల మ్యాచ్‌లు ఉంటాయి. ఈ దశలో గెలుపొందిన జట్లను నియోజవకర్గ పోటీలకు పంపిస్తారు. 175 నియోజకవర్గాల్లో 5,250 మ్యాచ్‌లలో పోటీలు నిర్వహిస్తారు. వీటిల్లో సత్తా చాటిన వారు జిల్లా స్థాయికి ఆడాల్సి ఉండగా.. 26 జిల్లాల్లో 312 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. జిల్లా స్థాయి విజేతలతో రాష్ట్ర స్థాయిలో 250 మ్యాచ్‌ల్లో పోటీపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో 34.20లక్షల మంది, మండల స్థాయిలో 17.10లక్షల మంది, నియోజకవర్గ పోటీల్లో 77,520 మంది, జిల్లా స్థాయిలో 19,950 మంది, రాష్ట్ర స్థాయిలో 2,964 మంది ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. వివిధ దశల్లో కలిపి మొత్తం 52.31లక్షల మంది ఒకే వేదికపై 50 రోజుల పాటు క్రీడా మహోత్సవంలో సందడి చేయనున్నారు. నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు శాప్ ఎండీ ధ్యాన్‌చంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు (మెన్, ఉమెన్) సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో, వాలంటీర్ల ద్వారా, ఆన్లైన్లో aadudamandhra.ap.gov. in వెబ్సైట్ ద్వారా, 1902కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఐదు క్రీడాంశాల్లో గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహిస్తామన్నారు. 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో డిసెంబర్ 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, ఖోఖోతో పాటు సంప్రదాయ యోగ, టెన్నీకాయిట్, మారథాన్ అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే క్రీడా సామగ్రిని జిల్లాలకు తరలించామన్నారు. పోటీల్లో విజేతలకు సర్టీఫికెట్లు, ట్రోఫీలు, పతకాలు అందజేస్తామని చెప్పారు. నియోజవకర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రత్యేక నగదు బహుమతులు అందజేస్తామన్నారు. ఫైనల్స్‌ను విశాఖలో నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. -
Commonwealth Games 2022: విజేతలకు ఐఓఏ నజరానా
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఘనంగా సత్కరించింది. నగదు పురస్కారాలతో వారిని గౌరవించింది. స్వర్ణం గెలిచిన వారికి రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 7.5 లక్షల చొప్పున ఐఓఏ అందించింది. ఈ కార్యక్రమంలో ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు అనిల్ ఖన్నా, రాజీవ్ మెహతా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే తదితరులు పాల్గొన్నారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన పోటీల్లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు (మొత్తం 61 పతకాలు) సాధించింది. -
కేంద్రం ప్రభుత్వం కొత్త పోటీ.. 15 లక్షలు గెలుచుకునే అవకాశం!
సాక్షి, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆగస్టు 15లోగా కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్ఐ... తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. బహుమతులు ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ. 2 లక్షల వంతున బహుమతులు అందివ్వనున్నారు. ఇలా పంపండి దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపివ్వాల్సి ఉంటుంది. డీఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ యాక్ట్ 2021 ద్వారా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపింది. డీఎప్ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఈ పథకం ద్వారా దేశ రూపురేఖలు మారిపోతాయని కేంద్రం చెబుతోంది. .@FinMinIndia in association with @mygovindia is announcing a contest to crowdsource the name, tagline and logo of the new Development Financial Institution. Cash prizes of up to Rs 5 lakh in each category! Last date for entries is 15.08.2021. https://t.co/uK5AojlWlB (1/2) — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 The setting up of a Development Financial Institution was announced by Finance Minister Smt @nsitharaman in Budget 2021-22. Both Houses of Parliament passed the National Bank for Financing Infrastructure and Development (NaBFID) Bill 2021 in March 2021. (2/2) pic.twitter.com/8AFa26Bdxf — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 -
ఎక్కువ ఓట్లు వేయిస్తే నగదు నజరానాలు
గీసుకొండ: అధికంగా ఓట్లు వేయించిన కార్యకర్తలు, నాయకులకు రూ.50 వేలు నజరానాలు ఇస్తానని పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుకొండ మండలం కొనాయమాకులలో బుధవారం సంగెం మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కమిటీల సభ్యులతో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికంగా ఓట్లు పడిన గ్రామానికి రూ.లక్ష నగదును నజరానాగా ఇస్తానని ప్రకటించారు. -
‘బిగ్‌బాస్’ శివ బాలాజీ
-
‘బిగ్‌బాస్’ శివ బాలాజీ
సాక్షి, హైదరాబాద్: ‘బిగ్‌బాస్’ విన్నర్ ఎవరు? లక్షల నగదు బహుమతిని దక్కించుకునే ఆ విజేత ఎవరు? ఈ ఉత్కంఠకు ఎట్టకేలకు ఆదివారం తెరపడింది. 3.37 కోట్ల ఓట్లతో శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆదర్శ్ రన్నరప్ నిలిచారు. విన్నర్, రన్నరప్ మధ్య ఓట్ల వ్యత్యాసం ఎనిమిదిన్నర లక్షలే. బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి శివబాలాజీకి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. మాటీవీలో 70 రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగిన సంగతి తెలిసిందే. చివరికి హౌస్‌లో నవదీప్, శివ బాలాజీ, ఆదర్శ్ బాలకృష్ణ, అర్చన, హరితేజ మిగిలగా, శివ బాలాజీని విజయం వరించింది. ఫైనల్‌కి చేరిన ఐదుగురు కంటెస్టంట్లలో అర్చన 5, నవదీప్ 4, హరితేజ3, ఆదర్శ్ 2 స్థానాల్లో నిలిచారు. గత వారం అక్షరాలా పదకొండు కోట్లకు పై చిలుకు మంది ఆడియన్స్ తమ అభిమాన సెలబ్రిటీని గెలిపించేందుకు ఓటింగ్‌లో పాల్గొన్నారు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో శివ బాలాజీ బిగ్‌బాస్ సీజన్-1 టైటిల్‌తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. విన్నర్‌ను ప్రకటించిన వెంటనే శివ బాలాజీ కుటుంబసభ్యుల దగ్గరికి చేరి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం విజేతకు ట్రోఫీ, క్యాష్ ప్రైజ్‌లను వ్యాఖ్యాత ఎన్టీఆర్ అందజేశారు. 71రోజులు.. 60 కెమెరాల మధ్య.. 16 మంది (ఇద్దరు వైల్డ్ కార్డ్) కంటెస్టెంట్స్‌తో జూలై 16వ తేదీన షో ప్రారంభమైంది. కంటెస్టంట్ల ప్రదర్శనలతో 71 రోజుల పాటు షో ప్రేక్షకులను అలరించింది. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో ఎన్టీఆర్ విన్నర్‌ని అనౌన్స్ చేయడంతో బిగ్‌బాస్ సీజన్-1కి శుభం కార్డు పడింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు వారాలబ్బాయి అని వినేవాణ్ణి. ఇప్పుడు వారం వారం వచ్చి మీతో (ప్రేక్షకులు), ‘బిగ్ బాస్’ హౌస్‌మేట్స్‌తో ప్రేమను పంచుకున్నాను. ఇది నాకు మంచి ఎమోషనల్ జర్నీ. ఆ దేవుడు ఎవర్ని ఎప్పుడు, ఎక్కడ కలుపుతాడో తెలియదు’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నాపై చూపించిన అభిమానానికి మాటలు రావడంలేదు. అనంతరం విన్నర్ శివబాలాజీ మాట్లాడుతూ ‘‘విన్నర్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. మధ్యలో ఎలిమినేట్ అయిపోతా నేమో అనుకున్నప్పటికీ చివరి వరకూ ఉంటాననే నమ్మకం కూడా ఉండేది. ఏదైనా కావాలని బలంగా కోరుకుంటే అది నెరవేరుతుందన్నది నా నమ్మకం. నా హౌస్మేట్స్ నాకు బాగా సహకరించారు’’ అని అన్నారు. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న తొలి షో బిగ్ బాసే. షో ప్రారంభం నుంచే ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రతి వారాంతంలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పెద్ద ఎత్తున టీఆర్పీ రేట్లు నమోదయ్యాయి. ఈ ఆదివారం జరిగిన చివరి ఎపిసోడ్‌ను నిర్వాహకులు ప్రత్యేకంగా నిర్వహించారు. షోలో పాల్గొన్న కంటెస్టంట్లందరిని కార్యక్రమానికి ఆహ్వానించారు. అంతేకాదు స్టేజ్‌పై బిగ్‌బాస్‌ను అనుకరిస్తూ బిగ్‌బాస్ స్కిట్కూడా చేశారు. కార్యక్రమం ప్రసారం దాదాపు 5.30 గంటలకు పైగా ప్రసారం అయింది. అంతేకాదు చివరి రోజు ఎన్టీఆర్‌తో కలిసి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ బిగ్‌బాస్ స్టేజ్‌పై పాటలు, డాన్స్‌తో అలరించారు. బిగ్‌బాస్‌లోని కంటెస్టంట్లందరికి ఫన్నీఅవార్డులను కూడా ప్రకటించారు. ఫన్నీ అవార్డ్స్: ఉచిత సలహా అవార్డు (మహేష్ కత్తి) అయోమయం అవార్డు (సంపూర్ణేష్ బాబు) గ్రైన్డర్ అవార్డ్ (దీక్ష) రోమియో అవార్డు (ప్రిన్స్) బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డు (ధనరాజ్) గురకరాయుడు అవార్డు (సమీర్) ఫిటింగ్ మాస్టర్ అవార్డు (కత్తి కార్తీక) గుండెల్లో గోదారి అవార్డు (మధుప్రియ) -
పదాలతో చెడుగుడు.. పతకాలతో బుడతలు
సాక్షి, సిటీబ్యూరో: ఆంగ్ల పదాలతో చిన్నారులు చెడుగుడాడుకున్నారు. అడిగిందే తడవుగా ఇంగ్లిష్ వర్డ్స్ స్పెల్లింగులను గడగడా చెప్పి విద్యార్థులు ఔరా అనిపించారు. పిల్లల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు సాక్షి మీడియా గ్రూప్ వినూత్నంగా నిర్వహిస్తున్న సాక్షి ఇండియా స్పెల్ బీ-2014 ఫైనల్స్ శనివారం నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విడివిడిగా నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బంగారు, వెండి, కాంస్య పతకాలతోపాటు నగదు బహుమతులు అందజేశారు. ఫైనల్స్‌కు ఎంపికైన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలు కూడా ఇచ్చారు. బంగారు పతాక విజేతలకు రూ. 25 వేలు, రజత పతకం గెలుపొందిన వారికి రూ.15 వేలు, కాంస్య పతకాలు పొందిన వారికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఇరు రాష్ట్రాల నుంచి మొత్తం 25 వేల మంది ఈ పోటీలకు నమోదు చేసుకోగా దాదాపు 160 మంది ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. శుక్రవారం నగరంలోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఫైనల్ పోటీలు జరిగాయి. నాలుగు కేటగిరిల్లో నిర్వహించిన పోటీల్లో ఒక్కో కేటగిరి నుంచి ముగ్గురు చొప్పున మొత్తం 24 మందిని పతకాలు వరించాయి. ముఖ్య అతిథులుగా హాజరైన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డిలు విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. వీరితోపాటు భారతి సిమెంట్ మార్కెటింగ్ సీనియర్ జనరల్ మేనేజర్ ఎం.సి.మల్లారెడ్డి, అడ్వటైజింగ్ ఏజీఎం బి.చంద్రశేఖర్, పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి మేథో పోటీల్లో అమిత ఉత్సాహంగా పాలుపంచుకోవడం సంతోషకరమన్నారు. అందరూ పతకాలు పొందలేకపోయినా ఫైనల్స్ వరకూ రావడమే గొప్ప విజయంగా అభివర్ణించారు. రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి విద్యార్థులను ఇంత దూరం తీసుకొచ్చి వారి ఆసక్తి, ప్రతిభను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థుల్లో మేధస్సు సంపత్తిని పెంపొందించే మరిన్ని పోటీలు నిర్వహించేందుకు సాక్షి సిద్ధంగా ఉందని రామచంద్రమూర్తి వెల్లడించారు. సాక్షి ఇండియా స్పెల్ బీ పోటీలు నిర్వహించడం వరుసగా ఇది మూడోసారి. వచ్చే ఏడాది జనవరిలో సాక్షి జీయో బీ-2015 పేరిట ప్రత్యేక పోటీలకు కూడా సాక్షి మీడియా శ్రీకారం చుట్టింది.