havy rains
-
గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి
సాక్షి, గుంటూరు: ఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు మురుగు వాగులో కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మాన్విక్‌గా గుర్తించారు.విజయవాడలో నిన్నటి నుండి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మేఘన, బోలెం లక్ష్మీ, లాలూ, అన్నపూర్ణ చెందారు, నగరంలో రహదారులన్నీ జలమయంగా మారాయి.ఎన్టీఆర్ సర్కిల్ నుండి కానూరువరకు రహదారి నీటమునిగింది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలదిగ్భంధంలో చిక్కుకుంది. దుర్గగుడిపైనా భారీ వర్షాల ప్రభావం పడింది. దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేశారు. దుర్గగుడి కొండపై ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడుతున్నారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో కాలనీలు నీటమునిగాయి. నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?
-
వంకలో కొట్టుకుపోయిన కారు: ఇద్దరు గల్లంతు
-
భారీ వర్షాలతో కరీంనగర్ రైతులు నష్టాలను ఎదుర్కొంటున్నారు
-
అల్పపీడనం: ఏపీలో రేపు భారీ వర్షాలు..
సాక్షి, అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తులశాఖ పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని.. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారుల సూచించారు. -
14 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ పంట నష్టం పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఆ తర్వాత 12 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే బుధవారం నాటికి అది కాస్తా 14 లక్షల ఎకరాలకు చేరి ఉండొచ్చని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకే ఇంత నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అయితే ఈ వివరాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. వరి దాదాపు 5,10,216 ఎకరాలు, పత్తి 7,50,150 ఎకరాలు, ఇంకా ఇతర పంటలు కలిపి 14,06,110 ఎకరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఓ అంచనా ప్రకారం దాదాపు 7,60,138 మంది రైతులు పంటలు నష్టపోయినట్లు తెలిసింది. అయితే నష్టం రూ.వేల కోట్లలో ఉంటుందంటున్నారు. అన్నదాత గగ్గోలు..: వరి, పత్తికి కనిష్టంగా రూ.25 వేలు, గరిష్టంగా రూ.35 వేల చొప్పున రైతులు పెట్టుబడి పెట్టారు. వరదలు, వర్షాలతో పెట్టుబడి మొత్తం కోల్పోయే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ పరిస్థితుల్లో నష్ట పరిహారం అందజేయలని కోరుతున్నారు. కాగా, ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం నుంచి వైదొలిగింది. దీంతో పంటల బీమా కూడా అందే దిక్కు లేకుండా పోయిం ది. ఎలాంటి బీమా పథకాలు ఈ వానాకాలం సీజన్లో అమలు చేయకపోవడంతో చాలా నష్టం వాటిల్లింది. రైతు యూనిట్‌గా పంటల బీమా కోసం కేంద్రా న్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో డిమాండ్ చేసింది. అయితే అది అమల్లోకి రాలేదు. ఇప్పుడు కేంద్ర పథకం నుంచి వైదొలగడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేకంగా పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కసరత్తు జరిగింది. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులు దానిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేంద్రం ఇచ్చే పరిహారంపైనే ఆశలున్నాయి. -
తేరుకుంటున్న హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్/ చాంద్రాయణగుట్ట: హైదరాబాద్‌లో వరదలు కొంత తగ్గుముఖం పట్టినా.. అవి మిగిల్చిన బురద కష్టాలు లోతట్టు ప్రాంతాల్లోని బాధితులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చాలా కుటుంబాలు ఇంకా మురుగు నీటిలోనే ఉండిపోయాయి. సీజనల్ వ్యాధులు భయపెడుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో నగరం కాస్త తేరుకుంది. ముంపు ప్రాంతాల్లోని బాధితులు క్రమేపీ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంట్లో తడిసి ముద్దయిన విలువైన వస్తువులను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు, ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోగా... ఇంట్లోని టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్‌మిషన్, మంచాలు, పరుపులు, బీరువాలోని బట్టలు, విలువైన డాక్యుమెంట్లు, నగదు, బియ్యం సహా ఇతర నిత్యావసరాలన్నీ బురదలో మునిగిపోవడం చూసి బోరున విలపిస్తున్నారు. కాలనీల్లో ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సుడిగుండాలే. బడంగ్పేట్, మీర్పేట్, సరూర్‌నగర్, ధర్మపురికాలనీ, హరిహరపురం కాలనీ, అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్, బంజారాకాలనీ, బేగంపేటలోని అల్లంతోటబావి, మయూరిమార్గ్, బ్రాహ్మణవాడీ, వడ్డెరబస్తీలు, పాతబస్తీ గుర్రంచెరువు కింద ఉన్న హఫీజ్‌బాబానగర్ ఎ, బి, సి. హెచ్ బ్లాక్, నసీబ్‌నగర్, ఉప్పుగూడ, శివాజీనగర్, క్రాంతినగర్, అరుంధతి కాలనీలు, పల్లె చెరువు కింద ఉన్న హాషామాబాద్, అల్‌జుబేల్ కాలనీలు ఇప్పటికీ ముంపులోనే ఉండిపోయాయి. గత రెండు రోజులతో పోలిస్తే వరద ఉధృతి తక్కువగా ఉంది. ఇంటి చుట్టూ పేరుకుపోయిన బురుద, జంతు కళేబరాలు, ఇతర వ్యర్థాలు తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతూ ముంపు బాధితుల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి. కొనసాగుతున్న సహాయక చర్యలు మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రామంతాపూర్ నేతాజీనగర్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ముంపునకు గురైన ఇండ్లను సందర్శించి ప్రతి ఇంటికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందచేశారు. ఇక చంపాపేట డివిజన్ పరిధిలోని బైరామల్‌గూడ, హరిజన బస్తీ, బీఎన్‌రెడ్డి డివిజన్ పరిధిలోని సాహెబ్‌నగర్, బతుకమ్మ కుంట కాలనీ, మన్సూరాబాద్ డివిజన్లోని వీకర్స్ సెక్షన్, సరూర్‌నగర్ డివిజన్లోని అం బేద్కర్నగర్, శంకర్‌నగర్, భగత్‌సింగ్ నగర్, ఓల్డ్ సరూర్‌నగర్, బాపూనగర్లలో ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వ ఆర్థిక సహా యం అందజేశారు. నిత్యావసరాలతో కూడిన కిట్లను, దుప్పట్లను అందజేశారు. కేవలం ఇంటి యజమానులకే ఆర్థికసాయం అందజేస్తున్నారని, ముంపులో సర్వం కోల్పోయి తాత్కాలికంగా ఊరికి వెళ్లిపోయిన కిరాయిదారులను పట్టించుకోవడం లేదని బాధి తులు ఆరోపిస్తున్నారు. ఇంకా చీకటిలోనే కాలనీలు హైదరాబాద్ సౌత్ సర్కిల్ పరిధిలో 12, సెంట్రల్ సర్కిల్ పరిధిలో 8, సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో 3, హబ్సిగూడ సర్కిల్ పరిధిలో రెండు చొప్పున మొత్తం 25 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఇప్పటికీ నీటిలోనే ఉండిపోయాయి. సౌత్‌జోన్‌లోని ఆల్జుబేల్కాలనీ, బాలాపూర్, మైసారం, ఓమర్కాలనీ, అఫ్జల్బాబా నగర్ , సెంట్రల్ జోన్‌లోని బాలాజీ భాగ్యనగర్, నదీంకాలనీ, నదీంకా లనీ నాలా, అక్బర్ మజీద్, సరూర్‌నగర్‌లోని శ్రీ చైతన్యకాలేజీ, అయ్యప్పకాలనీ 1, అయ్యప్పకాలనీ 2, హబ్సిగూడలోని లక్ష్మీనగర్ 1, మధురాబార్ కాలనీలు వారం రోజుల నుంచి అంధకారంలో ఉన్నాయి. శాంతించాలని గంగమ్మతల్లికి పూజలు వరణుడు శాంతించాలని, వరద ఉధృతి తగ్గాలని కోరుతూ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్‌లు బుధవా రం పురానాపూల్ వద్ద మూసీనదిలో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... 112 ఏళ్ల అనంతరం ఆ స్థాయిలో వరదలు రావడంతో శాంతించాలని గంగమ్మతల్లికి పూజలు నిర్వహించామన్నారు. -
దసరా వరకు పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, జరగాల్సిన అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేసినట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను ఆదేశించామని పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు యూని వర్సిటీలు కూడా ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా వేస్తు న్నట్లు ప్రకటించాయి. దసరా తర్వాత పరీక్షలు యథావిధిగా ఉంటాయని వెల్లడించాయి. 27వ తేదీ పరీక్షలు యథావిధిగా జరుగు తాయని జేఎన్టీయూ వెల్లడించింది. -
ఇంకా.. మునకలోనే!
సాక్షి, హైదరాబాద్: చినుకు రాలితే నగరవాసి గజగజ వణికిపోతున్నాడు. వారం రోజులుగా హైదరాబాద్‌ను ముంచె త్తిన వర్షాలు ఇంకా వీడటం లేదు. వరుణుడు శాంతించడం లేదు. బస్తీ ల్లోని పేదలకు ఉపశమనం కనిపించ డం లేదు. రాబోయే మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేయ డంతో హైదరాబాద్ మహానగరంలోని ముంపు ప్రాంతాల ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే వరద వణికిస్తుండగా, మళ్లీ భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. గత వారం రోజులుగా నీళ్లలో నానుతున్న కాలనీలు, బస్తీల్లోని ఇళ్లు, బహుళ అంతస్తుల్లోని కుటుంబాలన్నింటినీ జీహెచ్ ఎంసీ, డీఆర్ఎఫ్ అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. కొత్తగా ముప్పు పొంచివున్న లోతట్టు ప్రాంతాలను కూడా గుర్తించి... ఖాళీ చేయిస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు విడిచివచ్చేం దుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. జీవితాన్ని ధారపోసి కొన్నా మని.. ఎలా ఖాళీ చేయాలంటూ బాధితులు కన్నీటిపర్యంతమవు తున్నారు. భారీ వర్షం, వరద నీటితో నానిన భవనాల పునాదులు, గోడలు బలహీనపడి దెబ్బతినే అవకాశం ఉం దని, వాటిల్లో ఉండటం సురక్షితం కాదని అధికారులు అవగాహన కల్పి స్తున్నారు. ఇంకా 200కు పైగా కాలనీలు నీటిలోనే నానుతు న్నాయి. సోమవారం నగరమంతటా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. 37 వేల కుటుంబాలు... నగరంలో నీట మునిగిన కాలనీలకు చెందిన సుమారు 37 వేల కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలినట్లు అధికారగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కొందరు పునరావాస కేంద్రాలకు చేరుకోగా, మరికొందరు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. వాస్తవానికి ముంపునకు గురైన కుటుంబాలు దీనికి రెట్టింపు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో వరద చేరి గుర్రంచెరువు, పల్లెచెరువు, అప్పా చెరువులు తెగిపోగా, మరికొన్ని చెరువులు నిండుకుండలుగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి. కొత్తగా గుర్తించిన ముంపు ప్రాంతాలపై సైతం అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నీట మునిగిన కాలనీల నుంచి బాధిత కుటుంబాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ అధికారులు సుమారు 20 బోట్లను వినియోగిస్తుండగా, మరో 30 బోట్లను ఏపీ, కర్ణాటకల నుండి తెప్పించే చర్యలు చేపట్టారు. గడ్డిఅన్నారం డివిజన్లోని కోదండరాంనగర్, శారదానగర్, సీసలబస్తీ, న్యూగడ్డిఅన్నారం కాలనీ, కమలానగర్ ప్రాంతాల్లో వరద నీరు తగ్గకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నీట మునిగిన ఇండ్లలోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మల్లికార్జున్‌నగర్, అయ్యప్పకాలనీ వాసులను మాన్సూరాబాద్‌లోని ఎంఈ రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసి పునరావాస కేంద్రానికి తరలించారు. కాలనీలో పై అంతస్తుల్లో ఉన్నవారికి జీహెచ్ఎంసీ సిబ్బంది కొంత మేరకు పడవల ద్వారా వెళ్లి సహాయం అందించారు. మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలు సైతం వారం రోజులుగా బాధితులను çసురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యాయి. ఎల్బీనగర్ ప్రాంతంలోని కోదండరాం నగర్లో వరద బాధితులను తరలిస్తున్న సహాయక సిబ్బంది పురానాపూల్ బ్రిడ్జికి స్వల్పంగా పగుళ్లు భారీ వర్షం, వరద ఉధృతికి పాతబస్తీలోని పురానాపూల్ కొత్త వంతెనకు స్వల్పంగా పగుళ్లు వచ్చాయి. మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన వంతెన కింది భాగం కొంత శిధిలావస్ధకు చేరుకున్నట్లు కనిపిస్తోంది.సోమవారం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీఈ, అధికారులు వంతెనను పరిశీలించారు. వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 33 మంది మృత్యువాత ఎడతెరిపిలేని భారీ వర్షాలు, వరదలతో రాజధానిలో వారం రోజుల వ్యవధిలో సుమారు 33 మంది మృత్యువాతపడ్డారు. అందులో హైదరాబాద్ నగరానికి చెందిన 18 మంది, శివారు ప్రాంతాలకు చెందిన 15 మంది ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు 29 మందికి సంబంధించిన ఎక్స్‌గ్రేషియా బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. చెరువులు ఇలా.. ♦నగర శివారులోని మీర్‌పేట పెద్ద చెరువుకు వరద ఉ«ధృతి పెరిగి ప్రమాదకరంగా తయారైంది. కట్టతెగే ప్రమాదం ఉన్నందున జనప్రియ మహానగర్, న్యూబాలాజీనగర్, టీఎస్ఆర్నగర్, ఎంఎల్ఆర్నగర్, ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలు ఖాళీ చేశారు. ఇప్పటికే మంత్రాల చెరువు కట్ట తెగడంతో దిగువన గల మిథులానగర్, సత్యసాయినగర్ కాలనీలు కూడా ఖాళీ అయ్యాయి. ♦తాజాగా మన్సూరాబాద్ చిన్నచెరువు నిండుకుండలా మారి ప్రమాదకరంగా తయారైంది. దీంతో సోమవారం కింది భాగంలోకి కాలనీలు ముంపునకు గురికాకుండా చెరువుకు గండికొట్టి నీటిని డ్రైనేజీ నాళాలోకి మళ్లించే ఏర్పాట్లు చేశారు. ♦జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు నిండడంతో కాలువలు తవ్వి వరదనీటిని బయటకు వదిలారు. గంపలబస్తీ, సుభాష్‌నగర్, హనుమాన్ ఆలయం ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు ఏరులై పారింది. ♦టోలిచౌకిలోని నదీమ్‌కాలనీ, విరాసత్‌నగర్ కాలనీ, జమాలి కుంట, వలీ కాలనీ, నీరజా కాలనీలు ఇంకా నీటిలో నానుతూనే ఉన్నాయి. భక్తావర్ గూడ నుండి నిజాం కాలనీ మీదుగా వరద నీరు టోలిచౌకి వచ్చి చేరుతోంది. హకీంపేట్ బుల్కాపూర్ నాలా, హీరానగర్ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. వీడని అంధకారం నగరంలో నీట మునిగిన కాలనీలు వారం రోజులుగా చీకటిలోనే మగ్గుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించినా... ఎల్బీనగర్, చార్మినార్ జోన్లలో ఇంకా చాలాచోట్ల కరెంటు లేదు. అపార్ట్మెంట్ సెల్లార్లు,, వీధుల్లో ముంపు కారణంగా ట్రాన్స్ఫార్మర్లకు విద్యుత్ సరఫరా నిలివేశారు. ముంపు ప్రాంతాల్లో వందల కొద్ది విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినగా ఇప్పటివరకు 920 పునరుద్ధరించారు. వరద ఉధృతి తగ్గగానే మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. సహాయక చర్యలు వరద సహాయక, పునరావాస చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ముంపు బాధితులను సహాయ కేంద్రాలకు తరలించి భోజన వసతి కల్పిస్తున్నారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులకు సీఎం రిలీఫ్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా నీటిలోనే వారం రోజులుగా వరద నీటిలో ఉన్నాం. ఇంట్లో సామగ్రి నీటిలో మునిగిపోయింది. మళ్లీ వర్షం పడే అవకాశం ఉంది... పునరావాస కేంద్రానికి వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. చిన్న పిల్లతో ఎక్కడికి పోవాలి. పట్టించుకునేవారు కరువయ్యారు. – విజయ (బాలింత), మల్లికార్జున్‌నగర్ ఇంటిని ఎలా వదిలి వెళ్లాలి జీవితాన్ని ధారపోసి ఇంటిని కొన్నాం. ఖాళీ చేసి ఎలా వెళ్లాలి. వారం రోజులుగా మోకాలి లోతు వరదనీరు ఇళ్లలోకి చేరడంతో నరకం కనిపిస్తోంది. కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నాం. రాత్రంతా జాగారం తప్పడం లేదు. బురద నీటిలో పాములు, విష పురుగులు వస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శలకు పరిమితమవుతన్నారు. కానీ పరిష్కారం చూపించడం లేదు. – మల్లికార్జున్, అయ్యప్పనగర్ -
ప్రాణాలు అరచేతిలో పట్టుకొని...
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వరద ఉధృతి హైదరాబాద్ మహానగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఆరురోజులుగా సుమారు 90 పైగా కాలనీలు నీట మునిగి నరకయాతన అనుభవిస్తుండగా... తాజాగా శనివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పలు చెరువులు తెగి మరో వందకు పైగా కాలనీలు జలదిగ్బంధం అయ్యాయి. ఆదివారం దాదాపు 200 కాలనీలు మునకలోనే ఉన్నాయి. ఇంకా సుమారు 230 వీధులు అంధకారంలోనే మగ్గుతుండగా, తాజాగా మరో 20 కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శివారు ప్రాంతాల చెరువులు సుమారు 70కు పైగా కాలనీలకు ప్రాణ సంకటంగా మారాయి. ఇప్పటికే ముంపు ప్రాంతాల కాలనీ వాసులు సగానికి పైగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోగా, మిగతా సగం కుటుంబాలు జల దిగ్బంధానికి గురై బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరడంతో పాటు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. తినడానికి లేక, కంటినిండా కునుకు కరువై జనం విలవిలలాడుతున్నారు. స్నానాల మాట దేవుడెరుగు కనీసం తాగడానికి మంచి నీరు కూడా కరువైంది. గూడు చెదిరి, గుండె చెరువై... సురక్షితంగా బయటపడిన వారు సైతం ఆదుకునే వారు లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. మరోవైపు నాలాలు పొంగిపొర్లుతూ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీలు ఏరులైపారుతూ దుర్గంధంతో వీధులు కంపుకొడుతున్నాయి. శనివారం రాత్రి సరూర్‌నగర్, మేడిపల్లి, చార్మినార్లల్లో భారీ వర్షం నమోదైంది. గుర్రం చెరువు తెగి వరద ఉధృతికి భారీగా వాహనాలు కొట్టుకొని పోగా, ఘట్కేసర్ వెంకటాపూర్‌లోని తాళ్లకుంటకు గండి పడి వరద నీరు పంట పొలాల్లోకి చేరి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఉప్పుగూడలోని శివాజీ నగర్లో.. శనివారం అర్ధరాత్రి బాబానగర్ గుర్రం చెరువు తెగి అల్లకల్లోలం సృష్టించింది. ఒక్కసారిగా ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉరుకులు పరుగులు తీశారు. కొందరు ఇంటి పైకప్పుల పైకెక్కి ప్రాణాలను కాపాడుకుంటే.. మరికొందరు సురక్షితప్రాంతాలకు పరుగులు తీశారు. నీటి ఉధృతికి రోడ్డుపై ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు సైతం నేలమట్టమయ్యాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు, పెద్ద ఎత్తున గేదెలు కూడా కొట్టుకుపోయాయి. రాత్రంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని చీకట్లో బిక్కుబిక్కుమని గడిపిన ప్రజలు ఉదయాన్నే బతుకుజీవుడా అంటూ రోడ్లపైకి చేరుకునే ప్రయత్నం చేశారు. వరద ధాటికి దిగువ బస్తీలలో ఇళ్లు, ప్రహ రీలు సైతం కూలాయి. గత మంగళవారం కురిసిన భారీ వర్షంతో గుర్రం చెరువు పూర్తిగా నిండి ఎఫ్టీఎల్లో ఉన్న నబీల్ కాలనీ, సయీద్ కాలనీ, రాయల్ కాలనీ, మెట్రో సిటీ, వీఐపీ కాలనీ, అలీ గుల్షన్, మరియం మజీద్ కాలనీ, బార్కాస్ బస్తీలు నీట మునగగా, తాజాగా శనివారం రాత్రి చెరువు తెగడంతో దిగువ గల హఫీజ్‌బాబానగర్ ఎ, బి, సి బ్లాక్‌లతో పాటు నసీబ్‌నగర్, నర్కీపూల్ బాగ్, సాయిబాబానగర్, శివాజీనగర్, అరుంధతి కాలనీ, లలితాబాగ్‌లు జలమయమయ్యాయి. ఉప్పుగూడలోని అరుంధతి కాలనీ.. పెరిగిన వరద... నాలుగు అడుగుల లోతు నీళ్లలో ఉన్న ముంపు కాలనీల కష్టాలను శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం మరింత పెంచింది. కుదుటపడుతున్న వేళలో ముంపు కాలనీల వాసులపాలిట వర్షం పిడుగులా పడింది. అర్ధరాత్రి ముంపు కాలనీలలో ఒకేసారి నీటిమట్టం పెరిగింది. నదీమ్ కాలనీ, విరాసత్‌నగర్ కాలనీ, నీరజా కాలనీ, జమాలి కుంట తదితర ప్రాంతాల్లో సైతం రోడ్లపై ఐదారు అడుగుల మేర వరదనీరు చేరింది. పలుచోట్ల జనం గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీ చేసి ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలోకి మారారు. హీరానగర్ నాలా, బుల్కాపూర్ నాలాలు పొంగిపొర్లాయి. షేక్‌పేట్ బాలాజీనగర్, ఎంజి నగర్లలో కూడా వరదనీరు బీభత్సం సృష్టించింది. చంపా పేట పరిధిలోని మల్రెడ్డి రంగారెడ్డి, ఉదయ్‌నగర్, సూర్యానగర్ కాలనీలో సుమారు 40 ఇండ్లు వరదనీటి ప్రవాహంలో మునిగిపోయాయి. హరిహరపురం కాలనీలో ట్రాక్టర్ల సహాయంతో ఇళ్లలోని సామాన్లను బయటికి తీసుకొచ్చారు. కొన్ని కుటుంబాలు ఇళ్లు వదలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయాయి. మృత్యువాత భారీవర్షాలకు కరెంట్ షాక్‌కు గురై ముగ్గురు మృతి చెందగా, మరోమూడు గుర్తుతెలియని మృతదేహాలు వరద నీటిలో కొట్టుకువచ్చాయి. చిలుకానగర్‌లో సెల్లార్లో నిండిన వరద నీటిని తోడడానికి విద్యుత్ మోటార్‌ను అన్ చేయబోయి ఇంటి యజమాని శ్రీనివాస్ విద్యుత్ షాక్‌తో మృతి చెందగా, నసీబ్‌నగర్‌లో ఓ వ్యక్తి ఇన్వర్టర్ వద్ద షాక్‌కు గురై మృత్యువాత పడ్డాడు. ఫతేనగర్ శోభనాకాలనీలో ఇంజనీరింగ్ వర్కు షాపులో ఎల్.వెంకటనాయుడు (31) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. బహదూర్‌పురా, దేవిబాగ్, డబీర్‌పురా ఓవైసీ బ్రిడ్జి (నాలా)లో మూడు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. వణికిస్తున్న చెరువులు ►మీర్‌పేటలోని పెద్ద చెరువుకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో కట్టకింది భాగంలో పలుచోట్ల లీకేజీలు ఏర్పడి ప్రమాదపు అంచుల్లో ఉంది. ►బాతుల చెరువు అలుగు ఉధృతితో పలు కాలనీల్లోకి విషపూరిత పాములు చేరుతున్నాయి. ►బండ్లగూడ చెరువు పూర్తిగా నిండిపోయి ప్రమాదస్థాయికి చేరుకుంది. ►నగరశివార్లలోని జల్పల్లి, బురాన్‌ఖాన్ చెరువులు నిండు కుండలా మారాయి. ఉస్మాన్‌నగర్‌లోని బురాన్‌ఖాన్ చెరువు కట్ట తెగితే నీరు నేరుగా నబీల్ కాలనీ మీదుగా గుర్రం చెరువులోకి....అక్కడి నుంచి తిరిగి పాతబస్తీని ముంచెత్తే అవకాశం ఉంది. ►కొంపల్లిలోని ఫాక్స్‌సాగర్ చెరువు పొంగిపొర్లడంతో సమీపంలోని ఉమామహేశ్వర కాలనీ నీట మునిగింది. ►అంబర్‌పేట నుండి నాగోల్ మెట్రో వరకు రామంతాపూర్ ద్వారా ప్రవహించే అతిపెద్ద వరదనీటి కాలువ కట్టతెగిపోవడంతో కేసీఆర్‌నగర్‌లోని పలు బస్తీల్లో నీళ్లు చేరాయి. ►నాచారం పటేల్‌కుంట చెరువు ప్రమాదకర స్థాయికి చేరి దిగువ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. -
వరద తగ్గింది.. బురద మిగిలింది
భీకర వర్షం ముంచెత్తి నాలుగు రోజులైనా హైదరాబాద్ నగరం ఇంకా నీళ్లలోనే నానుతోంది. శుక్రవారానికి కూడా సుమారు 90కు పైగా కాల నీలు ముంపు నుంచి తేరుకోలేదు. వరద ముంపు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాలనీల్లోని రోడ్లపై ఇసుక మేటలు వేసింది. ఎటుచూసినా బురద... చెత్తాచెదారం. అడుగుతీసి అడుగు వేయడం నరకంగా మారింది. ఇదంతా ఎత్తిపోయ డానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పటికి సాధారణ స్థితి నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి సుమారు పదివేల కుటుంబాలను బయటకు తెచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని అపార్ట్మెంట్స్ సెల్లార్లు, కాలనీలు వరద ముంపులో ఉండటంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పునరుద్ధరించక సుమారు 222 వీధులు అంధకారంలో కొనసాగుతున్నాయి. బురదతో అవస్థలు... ముంచెత్తిన వరద నుంచి కొన్ని కాలనీలు బయటపడినా... శివారులోని జల్పల్లి చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, తదితర చెరువుల నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతూనే ఉంది. మరోవైపు డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. అనేక ముంపు ప్రాంతాల్లో రాకపోకలు మెరుగుపడలేదు. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినా ఇళ్లలో మోకాలిలోతు నీరు చేరడంతో తొలగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ బురద, మురుగు పేరుకుపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పేరుకుపోయిన మట్టితో ఇళ్ల తలుపులు, గేట్లు కూడా తీయలేక జనం అవస్థలు పడుతున్నారు. జనజీవనం నరకప్రాయమై రోడ్లు నడవడానికి కూడా వీల్లేకుండా మారాయి. వ్యాధుల భయం మరోవైపు నగరవాసులకు అంటువ్యాధుల ముప్పు పొంచివుంది. పాతబస్తీలో వరదలకు జంతువుల కళేబరాలు కొట్టుకొని రావడం, కొన్ని మృత్యువాత పడి అక్కడే పడి ఉండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. హషమాబాద్, అల్ జుబేల్ కాలనీలు జలమయం కావడంతో ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, షెడ్లలో ఉన్న మేకలు, గొర్రెలు, బర్రెలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. కళేబరాల్లో కొన్ని కొట్టుకుపోగా... మరికొన్ని అక్కడే ఉండిపో యాయి. మరోవైపు ఆహార వ్యర్థాలు కుళ్లిపోయి కంపుకొడుతున్నాయి. కుళ్లిన పశు కళేబరాలు, బురదతో అంటువ్యాధులు ప్రబలే అవకాశా లున్నాయి. నగరంలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లుతున్నాయి. పైపులు లీకవుతున్నాయి. మురు గునీటి నాలాల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి మురుగంతా వీధులను ముంచెత్తుతున్నది. ఇంకోవైపు దుర్గంధంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. శుక్రవారం వరద తాకిడి తగ్గడంతో బయటపడ్డ మూసారాంబాగ్ బ్రిడ్జి. (ఇన్సెట్లో) వరద నీటిలో బ్రిడ్జి మునిగిన దృశ్యం నీటి కాలుష్యంతో... శివారు ప్రాంతాల్లో పోటెత్తిన వరదల వల్ల నీటి కాలుష్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఉప్పల్‌లోని కావేరీనగర్, భరత్‌నగర్, శ్రీనగర్ కాలనీలతో పాటు హబ్సీగూడలోని రవీంద్రనగర్, సాయిచిత్రానగర్, లక్ష్మీనగర్, మధురానగర్‌లలో అంటువ్యాధుల భయం పొంచివుంది. టైఫాయిడ్, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మరోవైపు దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో డెంగీ జ్వరం సోకే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నదీమ్ కాలనీలో నదీమ్ కాలనీతో పాటు బాల్‌రెడ్డినగర్, విరాసత్ నగర్, జమాలికుంట బస్తీల్లో వరదనీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. మోకాలి లోతు నీరు ఇళ్లలోనే ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయంతో అంధకారం నెలకొంది. నదీమ్ కాలనీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, గోల్కొండ పోలీసులు వరదలో చిక్కుకున్న వారిని సరక్షితంగా బయటకు తీసుకొని వస్తున్నారు. వారికి భోజనం, నీటి బాటిళ్లు అందిస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయని వారిని ఒప్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు. నీరు పంపింగ్.. నేషనల్ డిజాస్టర్ టీమ్ (ఎన్డీఆర్ఎఫ్), డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (డీఆర్ఎఫ్), ఆర్మీ, ఆక్టోపస్ బలగాలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కలిసి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. చైతన్యపురి, షిర్డీనగర్, పటేల్ నగర్, వసంతపురి కాలనీ, కావేరి నగర్, పెద్దఅంబర్ పేటలో వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపడంతో పాటు రహదారులకు అడ్డుగా పడి ఉన్న చెట్లను తొలగించారు. ప్రమాదానికి అవకాశమున్న మ్యాన్‌హోల్స్‌ను ఓపెన్ చేసి నీటిని క్లియర్ చేస్తున్నారు. ఇంకా జలదిగ్బంధంలో నగరంలోని నదీం, నిజాం కాలనీ, హబ్సిగూడ, హరిహరపురం, మిథిలానగర్‌కాలనీ, అల్హస్నత్ కాలనీ, గుడిమాల్కాపూర్ హీరానగర్ బస్తీ, షేక్‌పేట ఎంజీనగర్, అంబేడ్కర్ నగర్, సింగరేణి కాలనీ, గౌతం నగర్, శారదా నగర్, కమలానగర్, కోదండ రామ్‌నగర్, పీఅండ్‌టీ కాలనీ, బార్కాస్, మైసారం, చంద్రాయణగుట్ట అల్ జుబేల్ కాల నీ, ఫలక్‌నుమా, ఇంద్రానగర్, జమాల్‌నగర్, సలాలా ప్రాంతాలు దాదాపు రెండు నుంచి మూడు అడుగుల ముంపులో ఉన్నాయి. హబ్సిగూడలో 5 వేల మంది నిరాశ్రయులు హబ్సిగూడ పరిధిలోని నాలుగు కాలనీల్లో వందల కొద్దీ అపార్ట్మెంట్లు, ఇళ్లు నీటము నిగాయి. కనీసం 5,000 మంది నిరాశ్రయుల య్యారు.సెల్లార్లలో, గుడిసెల్లో ఉన్న వాచ్ మెన్లు, సెక్యూరిటీ సిబ్బంది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. వంటపాత్రలు, బియ్యం సహా అన్నీ నీటిపాలయ్యాయి. అదేవిధంగా రవీంద్రనగర్ కాలనీ, లక్ష్మీనగర్, సాయిచి త్రానగర్ కాలనీ, మధురానగర్‌లలో కనీసం 50 దుకాణాలు నీళ్లలో మునిగాయి. కిరాణా, ఎల క్ట్రిక్, బట్టల దుకాణాలు... తదితర అన్ని షాపు ల్లో వస్తువలన్నీ తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజులైనా సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్ ఇళ్లు ఇంకా నీటిలోనే ఉన్నాయి టోలిచౌకిలోని నిజాంకా లనీ, అల్హస్నత్ కాలనీ, గుడిమల్కాపూర్ హీరానగర్ బస్తీ, షేక్‌పేట, ఎంజీనగర్, అంబే డ్కర్ నగర్ తదితర బస్తీలలోనూ వరద నీరు పూర్తిస్థాయిలో క్లియర్ కాలేదు. వివిధ ప్రాం తాల్లో అధికార పక్షంతో పాటు మిగతా రాజ కీయ పక్షాల నేతలు పర్యటించినా బాధితులకు సరైన భరోసా కల్పించలేకపోతున్నారు. అధికార యంత్రాంగం, కొన్ని స్వచ్ఛంద సంస్ధలు బాధితులకు అపన్నహస్తం అందిస్తూ పండ్లు, ఆహారపదార్థాలు అందజేస్తున్నారు. -
ఇంకా ముంపు ముట్టడిలోనే..
సాక్షి, హైదరాబాద్: మహా నగరాన్ని వరద కష్టాలు ఇంకా వీడలేదు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు నగరవాసికి నరకాన్ని చూపించాయి. వాన వెలిసి 48 గంటలైనా అనేక లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలో, అంధకారంలోనే ఉండిపోయాయి. గురువారం వాన తెరిపి నిచ్చినా.. పూడ్చలేని నష్టాలు, కష్టాల కడగండ్లు మాత్రం అలాగే మిగిలాయి. బాధితులకు తినడానికి తిండి.. కంటి నిండా కునుకు కరువయ్యాయి. వందలాది కుటుంబాలు ప్రాణాలు అరచేత పట్టుకొని సహాయం కోసం బిక్కుబిక్కుమంటున్నాయి. వాననీరు వెళ్లే దారులన్నీ మూసుకుపోవడంతో ముంపు ప్రాంతాలు ఇంకా చెరువు లను తలపిస్తున్నాయి. కనీసం తాగేందుకూ నీళ్లు కరువై.. పాలు, ఇతర నిత్యావసరాలు అందక బాధితులు పస్తులతో తల్లడిల్లుతున్నారు. ఇంకా ముంపు ముట్టడిలోనే ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని వారు.. బతుకుజీవుడా అంటూ బంధువుల ఇళ్లకు ప్రయాణమవు తున్నారు. ముంపు ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులకు బాధితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నీళ్లు వెళ్లే నాలాలన్నీ ఆక్రమణలకు గురవడం, భారీ వర్షపునీటి ప్రవాహానికి నాలాలు సరిపోకపోవడం.. నగరానికి కన్నీటి కష్టాలను మిగిల్చాయి. నాలాల పునరుద్ధరణ, ఆధునీకరణకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితమై శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదుపులోకి రాని పరిస్థితి పల్లె చెరువుకు గండిపడటంతో లోతట్టు బస్తీల్లోకి నీరుచేరి 48 గంటలు కావస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. దిగువన ఉన్న జీఎం కాలనీ, చావునీలలో కొద్దిగా నీటి ప్రవాహం తగ్గినా.. క్రాంతినగర్‌లో మాత్రం ఇళ్లలో నీరు అలాగే ఉంది. ఆయా బస్తీలవాసులు కంటి మీద కునుకు కరువై ఇంటి పైకప్పుల పైకెక్కి సాయం కోసం చూస్తున్నారు. అంబర్‌పేట లో చెరువు నీటి ప్రవాహం తగ్గలేదు. గురువారం కూడా పలు బస్తీల్లోంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగింది. మల్లికార్జున్ నగర్, రాహత్‌నగర్ ప్రాంతాలకు పైన ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ, మొయిన్చెరువు నీరు ఇక్కడికి భారీగా పోటె త్తుతోంది. వర్ష బీభత్సంతో వణికిపోయిన పాతబస్తీ ఇప్పుడి ప్పుడే తేరుకుంటోంది. ఇక్కడి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్ల ఆవరణలో నిలిచిన నీటిని పారబోసే పనిలోపడ్డారు. కాలనీల్లో, అపార్ట్మెంట్లలో అల్లకల్లోలం... నగరంలోని పలు అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరింది. ఈ నీటిని తోడిపోయడం తలకు మించిన భారమవుతోంది. సెల్లార్లలో భారీగా నీరు చేరడంతో ఎవరూ ప్లాట్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపేశారు. ఓవైపు అంధకారం.. మరోవైపు జలదిగ్బంధం.. ఇంకోవైపు నిత్యావసరాలు తెచ్చుకునే వీలులేక కాలనీలవాసులు నానాయాతన పడుతున్నారు. సెల్లార్లలోని కార్లు, టూవీలర్లు పూర్తిగా మొరాయించడంతో మెకానిక్‌ల వద్దకు పలువురు క్యూ కడుతున్నారు. కరెంట్ సరఫరా లేక, లిఫ్టులు పనిచేయక వృద్ధులు, అనా రోగ్య సమస్యలున్నవారు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సెల్లార్ల లోని మొత్తం నీటిని తొలగించి, ఎలాంటి తడి లేకుండా ఉంటేనే లిçఫ్టును ఉపయోగించాలని విద్యుత్ శాఖ హెచ్చరించడంతో పై అంతస్తుల్లోని వారు ప్రతి చిన్న అవసరానికి మెట్లు దిగక తప్పట్లేదు. అనేక కాలనీల్లోని అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల సెల్లార్లలోకి చేరిన వర్షపునీటిని తోడేందుకు ఒక్కసారిగా జనరేటర్లకు డిమాండ్ పెరిగింది. రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చుచేస్తే కానీ అవి దొరకడంలేదు. ఆయా భవ నాల వాచ్మన్లు అపార్ట్మెంట్ సెల్లార్, పార్కింగ్ ప్రదేశాల్లో కేటాయించిన గదుల్లోనే ఎక్కువగా ఉంటుంటారు. సెల్లార్లు నీటితో నిండిపోవడంతో వీళ్ల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అపార్ట్మెంట్ కాపలాతోపాటు అందులో ఉండే నివాసితులకు సమయానికి ఏదికావాలంటే అది సమకూర్చే వాచ్మన్లు ఇప్పుడు తాముండటానికే చోటులేక రోడ్డునపడ్డారు. శివార్లలో ‘నీటి యుద్ధం’ నగర శివార్లలో రెండు కార్పొరేషన్ల మధ్య నీటి విషయంలో గంటల తరబడి సాగిన వాదోపవాదాలు ఉద్రిక్తతకు దారితీశాయి. బడంగ్‌పేట కార్పొరేషన్ నుంచి పెద్ద చెరువుకు వరద ప్రవాహం పెరగడంతో లెనిన్‌నగర్ శ్మశానవాటిక వద్ద తాత్కాలికంగా కాలువను తవ్వి నీటిని దిగువకు వదిలారు. దీంతో జనప్రియ మహానగర్ ప్రధాన రహదారి పూర్తిగా కోతకు గురైంది. దీంతో జనప్రియ మహానగర్వాసులు స్థానిక కార్పొరేటర్లతో కలిసి పెద్ద చెరువు నుంచి వచ్చే నీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా బడంగ్‌పేట కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు సైతం అక్కడికి చేరుకున్నారు. రెండు కార్పొరేషన్లకు చెందిన వారు భారీగా గుమిగూడటంతో ఉద్రిక్తత నెలకొంది. మీ పేరు రాసి చచ్చిపోతాం.. హబ్సిగూడ లక్ష్మీనగర్‌లో బాధితులను పరామర్శించడంతో పాటు పరిస్థితుల అంచనాకు ఎన్డీఆర్ఎఫ్ బోటులో అధికారులతో కలిసి వచ్చిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిపై.. ఇళ్లపై ఉండి సాయం కోసం చూస్తున్న ముంపు బాధిత మహిళలు ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ‘అలానే వెళి్లో్పతారా? రెండ్రోజులుగా నీటిలో ఉంటూ పస్తులున్నా పట్టించుకోరా? మీ పేరు రాసి చచ్చిపోతాం’ అంటూ విరుచుకుపడ్డారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి సర్దిచెప్పారు. కేంద్రమంత్రిపై అసహనం హుస్సేన్‌సాగర్ నాలా పరీవాహక ప్రాంతమైన దత్తానగర్, హిమాయత్‌నగర్ స్ట్రీట్ నంబర్–1, దోమలగూడ డివిజన్లోని వెంకటమ్మ బస్తీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి రామన్గౌడ్కు చేదు అనుభవం ఎదురైంది. ‘వర్షాలతో మూడ్రోజులుగా ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడా మీరొచ్చేది’ అంటూ బస్తీవాసులు నిలదీశారు. స్వల్ప ఆగ్రహానికి గురైన కిషన్‌రెడ్డి.. వర్షాల్లో చిక్కుకున్న మిమ్మల్ని చూసి పరామర్శించి, చేతనైన సాయం చేద్దామని వచ్చామని సర్దిచెప్పారు. ‘మమ్మల్ని నిలదీస్తే మీకేం వస్తుంది? మీరు ఓట్లు గెలిపించుకున్న వాళ్లను నిలదీయండి’ అంటూ బస్తీవాసులకు బదులిచ్చారు. తహసీల్దార్ స్థాయి కూడా కాదా నాది: కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీల్లో పర్యటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి తదితర అధికారులకు ముందస్తు సమచారమిచ్చినా.. సంబంధిత విభాగాల అధికారులెవరూ తన పర్యటనకు హాజరుకాకపోవడం కిషన్‌రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. పర్యటనలోనే ఆయన కలెక్టర్ శ్వేతామహంతికి ఫోన్ చేసి ‘ఏమ్మా..నేను వస్తున్నట్లు ముందే చెప్పాను కదా? మీ వాళ్లెవరూ లేరెందుకు? ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. మీ ఉద్దేశమేంటి? నేను వస్తే కనీసం తహసీల్దార్ అయినా రాడా నా వెంట. తహసీల్దార్ స్థాయి కూడా కాదా అమ్మా నాది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. బాధితులకు కాంగ్రెస్ చేయూత ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల బాధితులకు కాంగ్రెస్ ఆహార పదార్థాలను అందించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, నాంపల్లి ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్, íపీసీసీ కార్యదర్శి మధుకర్‌యాదవ్, మహేష్‌యాదవ్ తదితరులు బాధితులను పరామర్శించారు. స్థానికుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌తో మాట్లాడి సూచించారు. ఈ సందర్భంగా మక్తాలో బ్రెడ్డు, పాలు అందజేశారు. -
12 గంటలు ప్రాణాలు అరచేతిలో..
బషీరాబాద్(వికారాబాద్): భారీ వర్షాలకు కాగ్నా నది ఉప్పొంగడంతో చిక్కుకుపోయిన 15 మంది ఏపీ కూలీలను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం క్షేమంగా బయటకు తీసుకొచ్చిన సంఘటన బుధవారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులోని జెట్టూరు వద్ద చోటుచేసుకుంది. స్థాని క పోలీసులు, కర్ణాటక అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు, ఆత్మకూరుకు చెం దిన మూడు కుటుంబాలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా బషీరాబాద్–కర్ణాటకలోని జెట్టూరు మం డలం క్యాద్గిర సమీపంలోని కాగ్నా నది ఒడ్డున ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో కూలి పనులకు వచ్చారు. వీరు ఇక్కడే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం 7గంటల ప్రాంతంలో వీరు నివసిస్తున్న గుడిసెల్లోకి వరద నీరు చేరింది. దీంతో అల్కయ్య, పద్మ, సురేశ్, కుమారి, వెంగమ్మ, మేరీ, అభిరామ్, రమణయ్య, తేజ, వెంకటరమణమ్మ, ఏడుకొండలు, కల్పన, సువర్ణ, అభి.. పక్కనే నిర్మాణంలో ఉన్న కాగ్నా బ్రిడ్జిపైకి ఎక్కారు. అయితే నది ఉద్ధృత రూపం దాల్చడంతో పాటు, కర్ణాటక నుంచి వచ్చే మళ్లమర్రి నదుల సంగమం వద్ద ప్రవాహం పోటెత్తడంతో వీరు నిలబడిన వంతెన చుట్టూ కిలోమీటర్ మేర వరద చుట్టేసింది. విషయాన్ని కూలీలు తమను పనులకు తీసుకొచ్చిన కాంట్రాక్టర్ సుబ్బారావుకు ఫోన్ ద్వారా చేరవేశారు. ఉదయం నుంచి రాత్రి 7వరకు సుమారు 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూశారు. కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో బషీరాబాద్, సులైపేట్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారు రెండు బోట్లలో నదిలోకి వెళ్లి వంతెనపై ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితులకు గ్రామంలోని పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. -
రోడ్లకు నష్టం.. రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం కురిసిన అతిభారీ వర్షానికి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు ఉప్పొంగడం, గండ్లుపడటంతో వచ్చిన ఉధృతికి సమీప రోడ్లు దెబ్బతిన్నాయి. భారీగా కోతకు గురైతారు అట్టముక్కలా లేచి కొట్టుకునిపోయాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, విజయవాడ, భూపాలపల్లి వెళ్లే జాతీయ రహదారులకు భారీగా నష్టం వాటిల్లింది. అలాగే సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రాష్ట్ర రహదారులు బాగా దెబ్బతిన్నాయి. గత నెల రోజుల్లో కురిసిన భారీ వర్షాలకు రూ.1,200 కోట్ల నష్టం వాటిల్లితే, మంగళవారం ఒక్కరోజే రూ.500 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ఇంకా పారుతుండటంతో తాత్కాలిక మరమ్మతులకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రం మట్టి, కంకరతో గుంతలను పూడ్చి వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై కొత్తగూడ వద్ద విజయవాడవైపు వంతెన అప్రోచ్‌రోడ్డు కోతకు గురై గోతులు ఏర్పడ్డాయి. దీని మీదుగా వాహనాల ప్రయాణం సాధ్యం కాకపోవటంతో ఎడమవైపు కాజ్వే మీదుగానే వాహనాలను అనుమతిస్తున్నారు. హైదరాబాద్–భూపాలపట్నం 163వ నంబరు జాతీయ రహదారిపై నారపల్లి వద్ద అర కిలోమీటరు వెడల్పుతో వరద నీరు ప్రవహించింది. వాహనాల రాకపోకలను బుధవారం మధ్యాహ్నం తర్వాత పునరుద్ధరించారు. అలాగే జోడిమెట్ల జంక్షన్ వద్ద చెరువు ఉప్పొంగడంతో అర కిలోమీటరు మేర రోడ్డు నీట మునిగింది. నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో బుధవారం మధ్యాహ్నం వరకు వాహనాల రాకపోకలను నిలిపేశారు. రూ.2 వేల కోట్లు కావాల్సిందే.. ప్రస్తుతం వరదలతో ముంచెత్తిన ప్రాంతాల్లో కొన్ని వంతెనలు కూడా నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. భవిష్యత్తులో ఈ తరహా ముంపు లేకుండా ఉండాలంటే ఆయా ప్రాంతాల్లో పనులు చేపడితే రూ.2 వేల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన నష్టాన్ని పూడ్చి పూర్వపు స్థితికి పునరుద్ధరించాలంటే రూ.500 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. -
హైదరాబాద్ రాకపోకలకు ‘హైవే’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కురిసిన భారీ వర్షం హైవే ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగించింది. వివిధ జాతీయ రహదారులపై నగరానికి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ హైవేలపై పలుచోట్ల వరద ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ చేరుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కొన్ని చోట్ల వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నగరంలోకి వచ్చేలా సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. అలాగే నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉంటూ వెళ్లిన పరిస్థితి కనబడింది. ఎక్కడెక్కడ ఎలా అంటే... ►జాతీయ రహదారి 44 (బెంగళూరు హైవే) అరాంఘర్–శంషాబాద్ మార్గం గగన్ పహాడ్‌లోని అప్పా చెరువు కట్ట తెగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాలైతే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. గగన్ పహాడ్ అండర్‌పాస్ రహదారి సగం వరకు కొట్టుకుపోయిందన్న సమాచారంతో.. వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. ►వరంగల్ హైవేలోని ఉప్పల్ నల్లచెరువు కట్ట తెగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాచకొండ పోలీసులు వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను ఘట్కేసర్ నుంచి యామ్నాంపేట మీదుగా ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్‌వైపు మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వాహనాలను నాగోల్, బండ్లగూడ మీదుగా ఓఆర్ఆర్ ద్వారా ఘట్‌కేసర్‌వైపు మళ్లించారు. ►నాగపూర్ హైవే మార్గంలోనూ వాహన రాకపోకలకు తిప్పలు తప్పలేదు. భారీ వర్షంతో మెదక్ జిల్లా మనోహరాబాద్ వద్ద పనులు జరుగుతున్న అండర్‌పాస్ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో వాహనాలను తూప్రాన్, నాచారం, గజ్వేల్, ములుగు, కిష్టాపూర్ మీదుగా మేడ్చల్ చెక్‌పోస్టుకు మళ్లించారు. తిరుగు ప్రయాణంలోనే అదే మార్గంలో వాహనాలను అనుమతించారు. ►అబ్దుల్లాపూర్‌మెట్‌లో రెడ్డికుంట చెరువు తెగి.. విజయవాడ హైవే మార్గంలోని ఇమామ్‌గూడ వద్ద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడ మరమ్మతులు చేసి వాహనాలు సాఫీగా వెళ్లేలా చూశారు. ►శ్రీశైలం హైవేలోనూ రహదారులపై వరద నీరు ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నింపాదిగా కలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిగిలిన జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ వరద వల్ల వెతలు తప్పలేవు. రాజధానిలోనూ తిప్పలు... భారీ వర్షం వల్ల హైదరాబాద్ రహదారులపై నీళ్లు నిలవడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాలు ట్రాఫిక్ ఫ్లైఓవర్ ఎక్కకుండా సెవెన్ టూంబ్స్ రోడ్డు మీదుగా వెళ్లాయి. గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వచ్చే వాహనాలు షేక్‌పేట, సెన్సార్ వల్లీ, ఫిల్మ్‌నగర్, బీవీబీ జంక్షన్ , బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12 మీదుగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పురానాపూల్ 100 ఫీట్ రోడ్డు, మలక్‌పేట ఆర్యూబీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లారు. అలాగే శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలను అనుమతించకపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
11 గ్రామాలకు రాకపోకలు బంద్
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉరకగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో వి.మాడుగుల మండలం శంకరం పంచాయతీలో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు ఇబ్బందులు పడకుండా తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన శంకరం పంచాయతీకి చేరుకుని బాధితులను పరామర్శించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు..ఎన్టీఆర్ఎఫ్ బృందాలను రప్పించి రేషన్ సరకులు, వైద్య ఏర్పాట్లు చేశారు. సహాయక చర్యల్లో అనకాపల్లి ఆర్డీవో, అధికారులు పాల్గొన్నారు. -
భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, విలుపురం జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వేలూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. విస్తారమైన వర్షాలు కురవడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు నగరాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కుండపోత గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. పది జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ ప్రకటించింది. -
తెల్లబారిన ఎర్ర బంగారం..!
నర్సంపేట రూరల్: ఈ సారి మిర్చి రైతుల కంట్లో కారం కొట్టినట్లయింది తుఫాన్ల ప్రభావం మిరప పంటపై తీవ్ర ప్రభావం చూపి ది. లక్షలు పెట్టుబడి చేసి సాగు చేస్తే పెట్టుబడులు అట్లుంచితే కనీసం కూలీల డబ్బులు రాని పరిస్థితి ఉంది. చివరకు అప్పులే మిగిలాయి. జిల్లాలో వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలు ఉండగా ఎక్కువశాతం నర్సంపేట, పరకాల నియోజకవర్గాల్లో మిర్చి పంట లను అధిక సంఖ్య లో సాగు చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలకు నర్సంపేట నియోజకర్గంలో అధిక నష్టం జరిగిం ది. నర్సంపేట డివిజన్లోని దుగ్గొండి, నర్సంపే ట, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, మండలాల్లో ఎక్కువగా మిర్చి రైతులు నష్టపోయారు. మిర్చి పంట సాగు ఒక ఎకరానికి రూ. 1.50 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి సుమారుగా 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా సుమారు 15 క్వింటాళ్ల నుంచి 18 క్వింటాళ్ల వరకు వచ్చింది. నాణ్యమైన మిర్చి ఉంటే రూ. 8వేల నుంచి రూ.12వేల వరకు ధర పలుకుతోంది. కాని అకాల వర్షాల దెబ్బకు పంట పూర్తిగా దెబ్బతినండంతో ఎక్కువ శాతం తాలు కాయే అయింది. దీనిని మార్కెట్‌కు తీసుకెళ్తే కనీసం ధర రూ. 2వేల నుంచి రూ. 4వేలు పలికే పరిస్థితే కనపడడంలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పంట దిగుబడి సైతం గణనీయంగా పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరీ తేజ కాయల పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. పంటను ఏరిస్తే సుమారు రూ. 50వేల వరకు కూలీలకే చెల్లించాల్సి వస్తోందని, తీరా మార్కెట్‌కు వెళ్తే కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా పంటనష్టంపై హార్టికల్చర్ అధికారులతో సర్వే నిర్వహించి నష్ట పరిహారం అందించాలని పలువురు రైతులు కోరుతున్నారు. పెట్టుబడి అధికం.. దిగుబడి తక్కువ.. మిర్చి పంట సాగుచేసేందుకు ఎకరానికి సుమారు పది ప్యాకెట్లు వరకు విత్తనాలు అవసరం. ఒక్కొక్క ప్యాకెట్ సుమారు రూ.3వేలు వరకు ధర ఉంది. కొన్ని సందర్భాల్లో ఆ గింజలు మొలకెత్తకపోతే అదనంగా మరో రెండు ప్యాకెట్ల వరకు నారు పోయాల్సి వస్తోంది. దుక్కులు, దున్నినందుకు సుమారు రూ. 10 నుంచి రూ. 15వేల ఖర్చు వస్తోంది. పంట నాటినప్పటి నుంచి కాయలు వేరడం వరకు కూలీల ఖర్చు సుమారు రూ. 50వేల నుంచి రూ. 60వేల వరకు వస్తోంది. ఎరువు, పురుగు ముందుల, ఇతర ఖర్చులతో కలిపి సుమారు రూ. 1.50 వరకు ఖర్చు వస్తోంది. దిగుబడి తగ్గడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితులు ఈ ఏడాది నెలకొన్నాయి. నాణ్యమైన మిర్చి దొడ్డు రకం సుమారు రూ. 10వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతోంది. సన్నరకం (తేజ)కు రూ. 8వేల నుంచి రూ. 12వేల వరకు పలుకుతోంది. కనీసం ఈ ఏడాది వర్షాలకు దెబ్బతిన్న కాయ పూర్తిగా తాలు కావడంతో సుమారు రూ. 3వేలు కూడా ధర పలికే అవకాశం లేకుండాపోయింది. కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు లబోదిబోమంటున్నారు. తెగుళ్లు ఎక్కువగా సోకాయి. మిర్చి పంట ఏపుగా పెరిగే దశలో తుపాన్ల వల్ల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో ఎక్కువ శాతం తెగుళ్లు సోకాయి. జిల్లా వ్యాప్తంగా కొంత శాతం పంట దెబ్బతింది. వర్షం కురిసిన సమయంలో ఎక్కువ పూత దశలో ఉండడంతో పెద్ద నష్టం జరగలేదు. కాకపోతే వర్షాభావ పరిస్థితితో తెగుళ్లు అధికంగా సోకాయి. కాయలమీద ఉన్న చేను మాత్రం దెబ్బతింది. తెగుళ్ల నివారణ కాప్టన్, తైరాన్ పిచికారీ చేస్తే పంట బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడున్న పరిస్థితులను అణుగుణంగా నీటిని పంటకు అవసరమున్న మోతాదులోనే అందించాలి. లేని ఝెడల వైరస్లు ఎక్కువ సోకే అవకాశాలు ఉంటాయి. చలి కాలంలో సూక్షపోషకాలు తక్కువగా అందుతాయి. సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి -
అక్కమ్మ చెరువులో వ్యక్తి గల్లంతు
మెదక్ జిల్లా జిన్నారం మండలం అక్కమ్మ చెరువులో పడి బుధవారం ఉదయం ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న చాకలి రాములు(39) చెరువు సమీపంలో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసుల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ముంచెత్తనున్న వానలు!
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలను 2 రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలకు అల్పపీడనం తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారమేర్పడింది. శనివారం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం బలపడి అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోను, తెలంగాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. -
కుండపోత