సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలను 2 రోజులపాటు వర్షాలు ముంచెత్తనున్నాయి. అల్పపీడనద్రోణి, ఉపరితల ఆవర్తనాలకు అల్పపీడనం తోడవడంతో భారీ వర్షాలకు ఆస్కారమేర్పడింది. శనివారం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఆదివారం బలపడి అల్పపీడనంగా మారింది.
ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో వాయవ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవరించి ఉంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న 2 రోజుల్లో కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లోను, తెలంగాణ వ్యాప్తంగా కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
ముంచెత్తనున్న వానలు!
Published Mon, Aug 1 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
Advertisement
Advertisement