సామ్యవాదాన్ని ఆచరించిన ‘పాపులర్’ వ్యాపారి | Today, the head of the Popular Group chukkapalli pichayya 87th birthday | Sakshi
Sakshi News home page

సామ్యవాదాన్ని ఆచరించిన ‘పాపులర్’ వ్యాపారి

Published Fri, Aug 7 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM

సామ్యవాదాన్ని ఆచరించిన ‘పాపులర్’ వ్యాపారి

సామ్యవాదాన్ని ఆచరించిన ‘పాపులర్’ వ్యాపారి

నేడు పాపులర్ గ్రూప్ సంస్థ అధిపతి చుక్కపల్లి పిచ్చయ్య 87వ జయంతి సందర్భంగా ‘చుక్కపల్లి పిచ్చయ్య ఫౌండేషన్ అవార్డు’, రూ.2

నేడు పాపులర్ గ్రూప్ సంస్థ అధిపతి చుక్కపల్లి పిచ్చయ్య 87వ జయంతి సందర్భంగా ‘చుక్కపల్లి పిచ్చయ్య ఫౌండేషన్ అవార్డు’, రూ.2 లక్షల నగదు బహుమతిని భారతరత్న అవార్డుగ్రహీత ఆచార్య సీఎన్‌ఆర్ రావుకు విజయవాడలో ప్రదానం చేస్తున్న సందర్భంగా...
 
 తెనాలి : పాదరక్షల తయారీ, మార్కెటింగ్‌లో ట్రెండ్ సెట్టర్ ఆయన. పేరుకు తగ్గట్టే ఆ రంగంలో ‘పాపులర్’ అయ్యారు. ఎన్నో కుటుంబాలకు ఉపాధి కల్పించారు. ఆయన పేరు చుక్కపల్లి పిచ్చయ్య. ప్రఖ్యాత పాదరక్షల తయారీ కంపెనీ పాపులర్ షూ మార్టు వ్యవస్థాపకుడు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కంచర్లపాలెం స్వస్థల ం. 1928 ఆగస్టు 7న జన్మించారు. అయిదో తరగతితోనే చదువు ఆపేసినా ఆనాటి తెనా లి వాతావరణంలో సామ్యవాద సిద్ధాంతాలను అలవ రచుకున్నారు. తర్వాత తెనాలిలో పాపులర్ షూమార్టు పేరుతో పాదరక్షల వ్యాపారం నడుపుతున్న సోదరుడి ప్రోత్సాహంతో 1957లో గుంటూరులో రిటైల్ పాదరక్షల దుకాణం ఆరంభించారు. అయిదేళ్లకు విజయవాడకు విస్తరించి ఫుట్‌వేర్‌లో ప్రప్రథమంగా హెడ్డాఫీసు, బ్రాంచీల విధానాన్ని చేపట్టారు. పీపుల్స్ షూ కంపెనీ, ప్రగతి ఫుట్‌వేర్, ప్రాఫిటబుల్ ఫుట్‌వేర్, ఫ్రెండ్స్ షూ కంపెనీలను ప్రారంభించారు. కార్మికులు, ఉద్యోగుల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంతోపాటు 1977లో పాపులర్ సంస్థల ట్రస్టును పిచ్చయ్య ప్రారంభించా రు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు తక్షణ సాయం పంపిణీ చే స్తూ, ప్రభుత్వాల సహాయ నిధికి ఇప్పటివరకు రూ.2.90 కో ట్లు విరాళాలు పంపినట్టు ఆయన కుమారుడు అరుణ్‌కుమార్ చెప్పారు. ఇక స్వస్థలం కంచర్లపాలెంలో 150 వృద్ధాప్య కుటుంబాలకు ప్రతి నెల ఆర్థిక సాయం అందిస్తు న్నా రు. నాగార్జున వర్సిటీలో కారల్ మార్క్స్, ఏంగెల్స్‌ల విగ్రహాల ఆవిష్కరణకు దోహదపడ్డారు. డాక్టర్ నాయుడమ్మ సైన్స్ ఫౌండేషన్ (చెన్నై) ‘మాన్యుఫాక్చరర్ ఆఫ్ పిచ్చయ్యాస్ మోడల్’ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. కాట్రగడ్డ గంగయ్య స్మారక అ వార్డు, ఉద్యోగరత్న అవార్డును అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మచే అందుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement