ప్రేమలో పడితే...
యువత ప్రేమలో పడ్డాక వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్ , జయంతి జంటగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో పొందూరి రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ప్రేమకథ ల్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి లక్ష్మణ్, సహ నిర్మాత: పొందూరి సాయిమురళీకృష్ణ.