Bhavani Shankar
-
డిష్యుం.. డిష్యూం..
పిఠాపురం: ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఇద్దరు అధికారులు వాగ్వాదానికి దిగడంతో పాటు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం మున్సిపల్ సమావేశం జరుగుతుండగా అందరి సమక్షంలో కమిషనర్ కనకారావు, డీఈఈ భవానీశంకర్‌లు పరస్పరం దాడికి తెగబడ్డారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఉన్న కోల్డ్‌వార్ ఒక్కసారిగా భగ్గుమనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలివీ.. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పచి్చమళ్ల జ్యోతి అధ్యక్షతన శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే అజెండాలోని పలు పనులపై చర్చించారు. ఆ పనులు ఎవరి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్నారు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులు ఎవరు చూస్తున్నారంటూ ఓ కౌన్సిలర్ కమిషనర్ కనకారావును ప్రశ్నించారు. దీనిపై కమిషనర్ బదులిస్తూ ఇక్కడ పనిచేస్తున్న డీఈఈ ఎన్నికల ముందు చెప్పాపెట్టకుండా సెలవుపై వెళ్లిపోయారని, దాంతో ఆయన్ని సరెండర్ చేశానన్నారు. అయితే, కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకుని డీఈఈ భవానీశంకర్ తిరిగి విధుల్లో చేరారన్నారు. కానీ, ఎప్పుడూ అందుబాటులో ఉండరని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పడంతో వారి ఆదేశాల మేరకు ఈఈతో సంతకాలు పెట్టించుకుని పనులు పూర్తిచేస్తున్నామని కమిషనర్ డీఈఈపై ఆరోపణలు చేశారు.అసలాయన ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని చెబుతుండగా.. పక్కనే ఉన్న డీఈఈ భవానీశంకర్ ఒక్కసారిగా ఎదురుతిరిగారు. కమిషనర్ అక్రమాలకు తాను సహకరించడంలేదని, ఇలా అబద్ధాలు చెబుతున్నారంటూ డీఈఈ విరుచుకుపడ్డారు. కనకారావు వచ్చినప్పటి నుంచి పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటికి తాను సహకరించకపోవడంతోనే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రత్యారోపణ చేశారు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఒక్కసారిగా కొట్లాటకు దిగారు. పరస్పరం కొట్టుకోవడంతో సమావేశంలో సభ్యులు అవాక్కయ్యారు. దీంతో కౌన్సిల్ సభ్యులు, మీడియా ప్రతినిధులు వారిని విడదీసి శాంతింపజేశారు. అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.డీఈఈపై సస్పెన్షన్ వేటు.. ఇక ఈ ఘటనలో డీఈఈ భవానీశంకర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అధికారుల ఘర్షణకు సంబంధించి కాకినాడ ఆర్డీఓ ఇట్ల కిశోర్, మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు విచారణ నిర్వహించి కమిషనర్, డీఈఈలతో పాటు కార్యాలయ సిబ్బంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. అనంతరం వారి నివేదిక మేరకు డీఈఈ భవానీశంకర్‌ను సస్పెండ్ చేయాలని ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు జిల్లా కలెక్టర్ సూచించడంతో శనివారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. -
మీటింగ్ లోనే కొట్టుకున్న కమిషనర్, ఇంజనీర్
-
ఇంటర్ విద్యార్థినిపై కన్నేసిన కామాంధుడు
-
పింక్ శారీలో శ్రీలీల అందాలు.. నిహారికకు లావణ్య స్పెషల్ విషెస్
►పింక్ శారీలో శ్రీలీల అందాలు ►నగలతో మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి ►శారీలో అనసూయ హోయలు ►నిహారికకు వరుణ్‌తేజ్, లావణ్య స్పెషల్ విషెస్ ►ప్రియా భవానీ శంకర్ స్మైలీ లుక్స్ ►వీకెండ్ మూడ్‌లోనే నేహాశర్మ ►ఎల్లో డ్రెస్‌లో అరియానా గ్లోరీ అదిరిపోయే పోజులు View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Priya BhavaniShankar (@priyabhavanishankar) View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
వీడియో: వైఎస్సార్ సీపీ నేత భవానీశంకర్ హత్య
-
ఆ పేరు ఎందుకు పెట్టామో క్లైమాక్స్‌లో తెలుస్తుంది
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో భవానీ శంకర్ దర్శకత్వంలో రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇది 60 ఏళ్ళ వ్యక్తికి చెందిన కథ. ఓ స్టార్ హోటల్లో ఉన్న ఓ మల్టీ మిలియనీర్ హత్యకు గురవుతాడు. అతని గదిలోని 500 కోట్ల రూపాయల డబ్బు కూడా మాయం అవుతుంది. అసలు డబ్బు ఏమైంది? హత్య చేసింది ఎవరు? అనే అంశాలతో కథనం ఉంటుంది. సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌గారి పాత్ర పేరు విజయ్ మోడీ. ఆయన పాత్రకు ఈ పేరు ఎందుకు పెట్టాం? అనే విషయం క్లైమాక్స్‌లో తెలుస్తుంది’’ అని అన్నారు. -
మల్టీజానర్ క్లైమాక్స్
పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై పి.రాజేశ్వరరెడ్డి, కె. కరుణాకర్ రెడ్డి తెరకెక్కించారు. భవానీ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను కీలక పాత్రను పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రదర్శకుడు భవానీ శంకర్‌తో గతంలో నేను ‘డ్రీం’ అనే ౖసైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించాను. ఆ చిత్రం రాయల్రీల్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతోపాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. కానీ, ఓ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే ఆదరించారని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్.. ఇలా మల్టీజానర్ కథతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు భవానీ శంకర్. -
పాత్ర కోసం మార్పు
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘డ్రీమ్’ ఫేమ్, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్లైమ్యాక్స్’. నాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రధారులు. పి. రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర పేరు మోడీ. ఆయన పాత్రకు మోడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్ కొత్తగా మారారు’’ అన్నారు. ‘పొలిటిక్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది’’ అన్నారు పి. రాజేశ్వర్‌రెడ్డి. ఈ సినిమాకు రాజేష్ సంగీతం అందిస్తున్నారు. -
ప్రేమజంటకు పెద్దల భయం..
ఒంటిపై కిరోసిన్ పోసుకొని పోలీసులను ఆశ్రయించిన ప్రేమికులు రసూల్‌పురా: ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట పెద్దలకు భయపడి ఒంటిపై కిరోసిన్ పోసుకుని పోలీసులను అశ్రయించింది. బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. బోయిన్పల్లి ఆర్యసమాజ్ వద్ద నివాసముండే కీర్తిరెడ్డి, బాపూజీనగర్‌కు చెందిన భవానిశంకర్ (22) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం కీర్తిరెడ్డి మేజర్ కావడంతో కూకట్‌పల్లిలోని ఆర్యసమాజ్‌లో ఈ నెల 21న వివాహం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బోయిన్పల్లి పోలీసుల వద్దకు వచ్చి పెళ్లి విషయం చెప్పారు. అయితే కీర్తిరెడ్డి తల్లిదండ్రుల కోరిక మేరకు మాట్లాడేందుకు వారిని శుక్రవారం పీఎస్‌కు పిలిపించారు. రెండు రోజులుగా బెదిరింపుకాల్స్ చేస్తుండడం, పోలీసులు రమ్మని చెప్పడంతో స్టేషన్ వద్దకు చేరుకునే ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకుని చేరుకున్నారు. దీంతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ చేసి పంపించారు. -
ప్రేమలో పడితే...
యువత ప్రేమలో పడ్డాక వారికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్ , జయంతి జంటగా చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో పొందూరి రామ్మోహనరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ ప్రేమకథ ల్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి లక్ష్మణ్, సహ నిర్మాత: పొందూరి సాయిమురళీకృష్ణ. -
ప్రేమిస్తే ప్రాణమిస్తా!
ఒక్కసారి ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని, ప్రాణాన్ని సైతం లెక్కచేయనని ఓ యువకుడు తన మనసుకు నచ్చిన అమ్మాయికి మాట ఇస్తాడు. మరి ఆ మాటను ఆ అమ్మాయి నమ్మిందా? ఆమె ప్రేమను ఆ కుర్రాడు గెలుచుకున్నాడా? లేదా అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీ శంకర్, జయంతి జంటగా పొందూరి రామ్మోహనరావు, పొందూరి లక్ష్మీదేవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిత్తజల్లు ప్రసాద్ దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘అందమైన ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణసాయి, సహనిర్మాత: పి.సాయి మురళీకృష్ణ. -
స్వచ్ఛమైన ప్రేమ
స్వచ్ఛమైన ప్రేమకు అంతం ఉండదని, అది ఏడు జన్మల బంధం అవుతుందనే కథాంశంతో చిత్తజల్లు ప్రసాద్‌నాయుడు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఒక్కసారి ప్రేమిస్తే’. భవానీశంకర్, జయంతి జంటగా పొందూరి లక్ష్మీదేవి సమర్పణలో పొందూరి రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రేమకు సరైన అర్థం తెలియకుండా యువతరం తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? అని చెప్పే చిత్రం ఇదని దర్శకుడు అన్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: లక్ష్మణసాయి, ఘంటాడి కృష్ణ, నిర్మాణ సారథ్యం: సాయి మురళీకృష్ణ, సహనిర్మాత: పంటా సుబ్బారావు.