
భవానీ శంకర్
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో భవానీ శంకర్ దర్శకత్వంలో రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇది 60 ఏళ్ళ వ్యక్తికి చెందిన కథ. ఓ స్టార్ హోటల్లో ఉన్న ఓ మల్టీ మిలియనీర్ హత్యకు గురవుతాడు. అతని గదిలోని 500 కోట్ల రూపాయల డబ్బు కూడా మాయం అవుతుంది. అసలు డబ్బు ఏమైంది? హత్య చేసింది ఎవరు? అనే అంశాలతో కథనం ఉంటుంది. సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌గారి పాత్ర పేరు విజయ్ మోడీ. ఆయన పాత్రకు ఈ పేరు ఎందుకు పెట్టాం? అనే విషయం క్లైమాక్స్‌లో తెలుస్తుంది’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment