climax
-
విశ్వంభర యాక్షన్
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ అ¯Œ్ల అరసు నేతృత్వంలో ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘‘చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. చిరంజీవి కోటి విరాళం కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్‌లో భారీ ఎత్తున ్ర΄ాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన నటీనటులు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా హీరో చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కోటి రూ΄ాయలు విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ 25లక్షల విరాళంవయనాడ్ వరద బాధితుల సహాయార్థం హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షలు విరాళం ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ఆయన తెలి΄ారు. -
అల్లు అర్జున్ పుష్ప-2.. నెట్టింట లీకైన క్లైమాక్స్ సీన్!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరో నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మేకర్స్ ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 క్లైమాక్స్ సీన్ వీడియో అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వీడియో పుష్ప-2 చిత్రానికి సంబంధించిందా? లేదా ?అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ నెటిజన్ తీరుపై మండిపడుతున్నారు. దీంతో సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుతున్నారు.మరికొందరు ఫ్యాన్స్ ఈ వీడియోనూ డిలీట్ చేయాలంటూ అతనికి రెక్వెస్ట్లు పెడుతున్నారు. ఎందుకిలా లీక్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ వీడియో డిలీట్ చేయండి బ్రో అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో డిలీట్ చేయకపోతే కొందరి ఉద్యోగాలు కూడా పోతాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెట్టింట వైరలవుతోన్న వీడియో ఒరిజినలా, కాదా అన్నది తెలియాలంటే మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. #Pushpa2 Climax Fight Scene 😉Enjoy pandagowww 💥🥵😎@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/EyGDhWtvzu— Jaisai Nimmala (Allu Arjun Die Hard Fan) (@NimmalaJaisai23) July 30, 2024 -
ఇలా రాజీనామా, అలా ప్రమాణం!
పట్నా/న్యూఢిల్లీ: బిహార్‌లో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్‌కు చేరుతోంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కని్పస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఆదివారం ఉదయం నితీశ్ సారథ్యంలో పటా్నలో ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్ అవామీ లీగ్ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం. మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్ కావడం వాటిని బలపరుస్తోంది! దాంతో పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తరఫున ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘెల్ హుటాహుటిన పట్నా చేరుకున్నారు. ఇండియా కూటమిలోకి రావాల్సిందిగా మాంఝీతో మంతనాలు జరిపారు. మరోవైపు నితీశ్‌తో చేదు అనుభవాల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ వ్యూహాత్మకమౌనం పాటిస్తోంది. శనివారం పటా్నలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో దీనిపై లోతుగా చర్చ జరిగినా జేడీ(యూ)ను తిరిగి ఎన్డీఏలోకి ఆహా్వనించడంపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక ఘట్బంధన్ సంకీర్ణంలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన ఆర్జేడీ ఎలాగైనా సర్కారును కాపాడుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఆర్జేడీ నేతలతో పార్టీ చీఫ్ లాలు మంతనాల్లో మునిగి తేలుతున్నారు. జేడీ(యూ) లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వాలని నేతలు ప్రతిపాదించారు. అయితే బీజేపీ, జేడీ(యూ) కలిస్తే 123 ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్కు (122)ను సులువుగా దాటేస్తారంటూ లాలు కుమారుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వాటిని తిరస్కరించినట్టు చెబుతున్నారు. ఇలా శనివారమంతా పట్నాలో హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామా నడిచింది. ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ) బిహార్‌లో ఘట్బంధన్ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
సినిమాల్లో క్లైమాక్స్ అదుర్స్
-
క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. ఈ సినిమాలు సూపర్ హిట్
ఫస్ట్ సీన్ అదిరిపోవాలి. హీరో ఇంట్రడక్షన్ కేక పుట్టించాలి. ఇంటర్వెల్ బ్యాంక్ మెస్మరైజ్ చేసేలా ఉండాలి. సినిమా అంతా బాగా రావాలనే తీస్తారు కానీ… ఇలా కొన్ని సీన్స్ మీద డైరెక్టర్స్ ప్రత్యే క శ్రద్ధ పెడతారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేస్తూ కథలో లీనం అయ్యేలా చేయాల న్నదే మూవీ మేకర్స్ లక్ష్యం. మరి క్లైమాక్స్ సంగతేంటి ? అత్యంత కీలకం ఇదే. సినిమా అంతా బావుండి చివర్లో చెడిందనుకోండి…ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. మూవీ యావరేజ్‌గా ఉన్నా…ఎండింగ్ అదిరిదంటే రిజల్ట్ హిట్టే. మరి అలాంటి క్లైమాక్స్‌లో ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన సినిమాలపై లుక్కేద్దాం. ఉప్పెన సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో తమ ప్రేమకి అడ్డుపడుతున్న వాళ్లని ఎదిరించి ప్రేమికులు ఒకటవుతారు లేకపోతే పెద్దల పంతాలకు బలైపోతారు. అదీ కాకుంటే హీరో, హీరోయిన్లలో ఒకరు చనిపోతారు. మరొకరు జీవచ్ఛావంలా మిగిలిపోతారు. ఎన్ని ప్రేమకథాచిత్రాలొచ్చినా క్లైమాక్స్‌లు మాత్రం ఇవే. కానీ…ఉప్పెన మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ముగింపు తీసు కుంది. మగాడు అన్న పదానికి సరికొత్త అర్థం ఇస్తూ…ఎవరూ ఊహించని క్లైమాక్స్‌ని ఫిక్స్ చేసేశాడు దర్శకుడు బుచ్చిబాబు. తొలి రోజు క్లైమాక్స్ కేంద్రంగా నెగిటివ్ టాక్ నడిచినా…ఆ తరహా ముగింపుకి ప్రేక్షకులు మద్దుతు ప్రకటించారు. ఉప్పెనని వంద కోట్ల క్లబ్లో కూర్చోపెట్టేశారు. రంగస్థలం రామ్ చరణ్ ‘రంగస్థలం’ క్లైమాక్స్ కూడా ఊహించని ట్విస్ట్‌తో ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మొదటి నుంచి జగపతిబాబునే విలన్‌గా చూపిస్తూ వస్తారు. నిజానికి ప్రెసిడెంట్‌గారు విలనే. కానీ…మూవీలో అసలు విలన్ మాత్రం కాదు. ఆ విషయం చివరి వరకు ప్రేక్షకులు గమనించకుండా స్క్రీన్‌ప్లే ని చక్కగా రెడీ చేసుకున్నాడు సుకుమార్. చివర్లో ప్రకాష్‌రాజ్ విలన్ అని తెలిసే సరికి సగటు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఒక మంచి సినిమా చూశామన్న ఫీల్‌తో పాటుగా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో థియేటర్ నుంచి బయటకుకొచ్చారు. ఆర్ఎక్స్ 100 క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వాలని దర్శకుడు డిసైడ్ అయినప్పుడు… ఊహించని మలుపులు. ముసుగులేసుకున్న పాత్రలు లాంటి వాటితోనే కథని అల్లుకుంటాడు. అలాంటి ఒక కథతో యూత్ అటెన్షన్‌ని గెయిన్ చేసిన చిత్రం ఆర్ఎక్స్ 100. పిల్లారా పాటలో సినిమా విడుదలకు ముందే బజ్ క్రియేట్ చేసింది ఆర్ఎక్స్ 100. ఫస్ట్ మూవీతోనే కార్తికేయ హీరోగా మంచి మార్కులు కొట్టేశారు. పాయల్ రాజ్పుట్ కి గ్లామర్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అన్నింటికీ మించి క్లైమాక్స్ మాత్రం ఆడియన్స్ ఊహాలకు అందలేదు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్‌లైన్‌తో మొదటి నుంచి ఆసక్తి రేపిన ఆర్ఎక్స్ 100…క్లైమాక్స్ కోణంలో మాత్రం అలజడి రేపింది. హీరోయిన్ తండ్రి విలన్ అన్నట్టుగా సినిమా ని ముందుకు తీసుకువెళ్లి…మరొకరిని విలన్‌గా చూపించడం చాలా సినిమాల్లో చూసిందే. కానీ దర్శకుడు అజయ్ భూపతి ఏకంగా హీరోయిన్నే విలన్‌గా చూపించేసి ఆడియన్స్‌ని షాక్‌కి గురిచేశాడు. అలానే…చివరకు హీరోని చంపేసి ప్రేక్షకుల్లో భావోద్వేగాలను పూర్తి స్థాయి లో పెంచేసి థియేటర్ నుంచి బయటకు పంపాడు. కేరాఫ్ ‘కంచరపాలెం’ చిన్న సినిమాగా వచ్చి ఘన విజయం సాధించిన కేరాఫ్ ‘కంచరపాలెం’ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. ఒక్కో కథకి ఏమాత్రం సంబంధం ఉండదు. అసలు వీళ్లందరినీ దర్శకుడు ఎలా కలుపుతాడు ? కలపడా ? ఎవరి కథ వారిదేనా ? ఇలా రకరకాల సందేహాలు సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులని వేధిస్తూనే ఉంటాయి. చివర్లో ఇవి నాలుగు కథలు కాదు. ఒక కథే. ఆ నలుగురు…ఈ రాజే అంటూ దర్శకుడు ఇచ్చే ట్విస్ట్‌కి థియేటర్లు ఈలలతో మార్మో గాయి. ఎలాంటి సినిమా అయినా సరే…మూవీ స్టార్టింగ్‌లో ఈలలు వినిపిస్తాయి. లేకపోతే పవర్ఫుల్ డైలాగో, అదిరిపోయే పాటో వచ్చినప్పుడు విజిల్స్ కామన్. కానీ క్లైమాక్స్‌తో ప్రేక్షకు లు చప్పట్లు, విజిల్స్‌తో సంతోషాన్ని వ్యక్తం చేయడం చాలా అరుదు. ఆ అరుదైన అనుభ వాన్ని కేరాఫ్ కంచరపాలెం సినిమా సొంతం చేసుకుంది. ఎవరు డిఫరెంట్ క్లైమాక్స్‌తో ఆడియన్స్‌ని షాక్ ఇచ్చిన చిత్రాల్లో ఎవరు ఒకటి. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు గురించి చెబుతూ ఉండటంతో సినిమా మొదలవుతుంది. హఠాత్తుగా ఆ కేసు నుంచి ఆడియన్స్‌కి ఫోకస్‌ని తప్పించి, ఇంటర్వెల్ పాయింట్‌కి అసలు కథతో లింక్ చేయడం. అసలు ఈ స్క్రీన్‌ప్లే నే భలే ట్విస్ట్‌గా అనిపిస్తే…ఇక బాధితురాలే నేరస్తురాలు. హీరోయినే విలన్ అన్న ట్విస్ట్ మరింతగా ప్రేక్షకులకి మజాని ఇస్తుంది. మత్తువదలరా సింపుల్ క్రైమ్ కథని కాంటెంపరరీ ఎలిమెంట్స్‌తో ఆసక్తికరంగా వెండితెర పై ప్రజెంట్ చేసిన చిత్రం మత్తువదలరా. సీరియస్ సీన్స్‌లోనూ కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడటంతో తొలి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చింది. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో జరిగే చోటా స్కామ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో కథ మొదలవుతుంది. ఒక 5 వందల రూపాయల కోసం చేసిన చిన్న తప్పు కథానాయకుడి జీవితాన్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. విలన్ ఎవరన్నది రివీల్ అయిపోయా క ఇక క్లైమాక్స్ రెగ్యులర్ ఫార్మెట్‌లోనే ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. కానీ… క్లైమాక్స్‌లో ఊహించని విధంగా నోట్ల రద్దు అంటూ ఇచ్చిన ట్విస్ట్ ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. హిట్ హీరో నాని నిర్మాత అనగానే…హిట్ మూవీ చుట్టూ ఒక అటెన్షన్ ఏర్పడింది. అనుకున్నట్టుగా నే డిఫరెంట్ క్లైమాక్స్‌తో…ఆడియన్స్‌ని థ్రిల్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్కి లింక్ అవుతూ మిస్ అయిన మరో యువతి. ఆడి యన్స్ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి దర్శకుడు శైలేష్ కొలను చేసిన ఈ సెటప్ బానే వర్కౌట్ అయింది. హీరోతో పాటుగా ఉంటూ కేసుని పరిశోధన చేస్తున్న అతని మిత్రుడే విలన్ అంటూ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్…థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మిస్టరీ చేధించే డిటెక్టివ్ సినిమాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. కానీ ఎక్కువుగా రావు. ఎందుకంటే…మిస్టరీ జానర్లో సస్పెన్స్‌ని హోల్డ్ చేసి ఉంచడం చాలా కీలకం. అలాంటి కీలక మైన అంశాన్ని వెండితెర మీద చక్కగా పెర్ఫామ్ చేయడంలో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సక్సెస్ అయ్యాడు. బాధితురాలు అన్నకున్న క్యారెక్టరే…అస్సలు ఈ భూమ్మీదే లేదనుకున్న క్యారెక్టరే…విలన్ అన్న ట్విస్ట్…మిస్టరీ జానర్ ని మజా చేస్తాయి. ఆ! సినిమాకి క్లైమాక్స్ బలం కావాలి. సినిమాకి క్లైమాక్స్ మరింత మైలేజ్ ఇచ్చేలా ఉండాలి. కానీ …క్లైమాక్స్ ట్విస్ట్ మీదే ఆధారపడి కథని రాసేసుకుని, సినిమా తీసేస్తే…అది ఆ! మూవీ నే అవుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. క్లైమాక్స్‌కి వచ్చిన తర్వాత కానీ దర్శకుడి ప్రతిభ అర్థం కాదు. అయితే…అప్పటి దాకా నడిచిన సినిమా మొత్తం ఆడియ న్స్‌కి అయోమయంగానే అనిపిస్తుంది. దీంతో…ఆ ! చిత్రం హిట్ మూవీస్ జాబితా లోకి అయితే ఎక్కలేదు. - దినేష్ రెడ్డి వెన్నపూస, డిప్యూటీ న్యూస్ ఎడిటర్ -
ఆ పేరు ఎందుకు పెట్టామో క్లైమాక్స్‌లో తెలుస్తుంది
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో భవానీ శంకర్ దర్శకత్వంలో రాజేశ్వర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. శుక్రవారం ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ – ‘‘ఇది 60 ఏళ్ళ వ్యక్తికి చెందిన కథ. ఓ స్టార్ హోటల్లో ఉన్న ఓ మల్టీ మిలియనీర్ హత్యకు గురవుతాడు. అతని గదిలోని 500 కోట్ల రూపాయల డబ్బు కూడా మాయం అవుతుంది. అసలు డబ్బు ఏమైంది? హత్య చేసింది ఎవరు? అనే అంశాలతో కథనం ఉంటుంది. సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌గారి పాత్ర పేరు విజయ్ మోడీ. ఆయన పాత్రకు ఈ పేరు ఎందుకు పెట్టాం? అనే విషయం క్లైమాక్స్‌లో తెలుస్తుంది’’ అని అన్నారు. -
నా నటన చూసి షాక్ అవుతారు
‘‘క్లైమాక్స్’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను ఎప్పుడూ చేయని పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా నటన చూసి షాక్‌కు గురవుతారు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ‘డ్రీమ్’ ఫేమ్ భవానీ శంకర్. కె. దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృధ్వీ, శివ శంకర్ మాస్టర్, రమేష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశామనే దానికంటే, మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ముఖ్యం. ‘క్లైమాక్స్’ సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి.. అప్పుడే భవానీ శంకర్‌లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు’’ అన్నారు. భవాని శంకర్ మాట్లాడుతూ– ‘‘ రాజేంద్ర ప్రసాద్‌గారు గొప్ప నటుడు. 40 సంవత్సరాల నుండి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎస్.వి.రంగారావు తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్‌గారే కనిపిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్ సాషా సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్, నిద్వాన, కెమెరా: రవి కుమార్ నీర్ల. -
క్లైమాక్స్ మార్చుకున్న‘ది గాడ్ ఫాదర్’
ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా దర్శకత్వం వహించిన ‘ది గాడ్ ఫాదర్’ ఇంగ్లీష్ చిత్రానికి హాలివుడ్లో అప్పటికీ ఇప్పటికీ చెరిగిపోనీ ఓ ప్రత్యేక ముద్ర ఉన్న విషయం తెలిసిందే. ఇటాలియన్ మాఫియా గురించి ఆయన తీసిన ‘ది గాడ్ ఫాదర్’ సినిమా మూడు పార్ట్‌లను కూడా భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఒక్క సినిమా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దర్శకులుగా సినిమా ప్రపంచానికి పరిచయం కాగా, మరెంతో మంది దర్శకులు అదే సినిమా స్ఫూర్తితో ఎన్నో సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందారనడంలో సందేహం లేదు. (చదవండి : మహాబలేశ్వరంలో ‘ఆర్ఆర్ఆర్’ సందడి) టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించిన రామ్ గోపాల్ వర్మ కూడా ‘ది గాడ్ ఫాదర్’ సిరీస్ సినిమాలను 300 సార్లు చూశానని చెప్పుకోవడమే కాకుండా వాటి స్ఫూర్తితో తాను పలు చిత్రాలను తీశానని ఒప్పుకున్నారు. 1990లో తీసిన ‘ది గాడ్ ఫాదర్ పార్ట్–3’ కి ఇప్పుడు కూడా ‘రాటెన్ టమాటోస్’ 68 శాతం రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ సినిమా ఇప్పుడు కొత్త రూపంలో మళ్లీ మన ముందుకు వస్తోంది. 81 ఏళ్ల ఫాన్సిస్ ఫోర్డ్ కపోలా ‘ది గాడ్ ఫాదర్ పార్ట్–3’ సినిమా బిగినింగ్‌ను కొద్దిగా మార్చి, క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చివేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.ఇంకా ఎన్నో ఏళ్లు జీవించాల్సిన మైకేల్ కార్లియోన్ అర్ధాంతరంగా చనిపోయే చివరి పతాక సన్నివేశంలో మార్పులు చేశానని, ఇది నాటి తరం ప్రేక్షకులతోపాటు ఈ తరం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని భావిస్తున్నట్లు దర్శకులు కపోలా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రం డిజిటల్, ఇతర రూపాల్లో డిసెంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. -
మల్టీజానర్ క్లైమాక్స్
పొలిటికల్ సెటైర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై పి.రాజేశ్వరరెడ్డి, కె. కరుణాకర్ రెడ్డి తెరకెక్కించారు. భవానీ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను కీలక పాత్రను పోషించిన నటుడు రాజేంద్రప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రదర్శకుడు భవానీ శంకర్‌తో గతంలో నేను ‘డ్రీం’ అనే ౖసైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించాను. ఆ చిత్రం రాయల్రీల్ అనే ప్రతిష్టాత్మక అవార్డుతోపాటు మరో 7 అంతర్జాతీయ అవార్డులను దక్కించుకుంది. కానీ, ఓ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే ఆదరించారని మా ఇద్దరి అభిప్రాయం. అందుకే ఈసారి కామెడీ, లవ్, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ సెటైర్.. ఇలా మల్టీజానర్ కథతో వస్తున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు భవానీ శంకర్. -
ఎనీ టైమ్ థియేటర్
‘‘థియేటర్లు తాత్కాలికంగా మూతబడటంతో ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల హవా నడుస్తోంది. తాజాగా మేం ప్రవేశపెడుతున్న ఏటీటీ (ఎనీ టైమ్ థియేటర్) ప్లాట్‌ఫామ్‌కు కూడా ప్రేక్షకాదరణ ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రేయాస్ శ్రీనివాస్. శ్రేయాస్ఈటీ అనే యాప్ ద్వారా ఏటీటీ (ఎనీటైమ్ థియేటర్) అనే ఆన్లైన్ థియేటర్ మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశారు శ్రీనివాస్. ఈ సందర్భంగా శ్రీనివాస్ విలేకర్లతో మాట్లాడుతూ – ‘‘ఏటీటీలో కొన్ని స్క్రీన్స్ ఉంటాయి. ఇటీవలే ఓ స్క్రీన్ (ఆర్జీవీవరల్డ్)లో రామ్‌గోపాల్‌వర్మగారి ‘క్లైమాక్స్’ చిత్రం విడుదలైంది. కంటెంట్ క్రియేటర్స్‌కు, చిన్న సినిమాల నిర్మాతలకు ఈ ఏటీటీ ప్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి మా ఏటీటీ ప్లాట్ఫామ్లో పది నుంచి 15 స్క్రీన్స్‌ను తెలుగుకి, పది స్క్రీన్స్‌ను కన్నడ, మలయాళం, తమిళ చిత్రాలకు ఐదు చొప్పున కేటాయించాం. వచ్చే ఏడాది మార్చికల్లా యాభై స్ట్రయిట్ సినిమాలను మా ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదల చేయాలన్నదే మా టార్గెట్. థియేటర్లో చూసే పెద్ద సినిమాల ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే కిక్కే వేరు. ఇదివరకు మా గుడ్సినిమాస్ గ్రూప్ బ్యానర్లో ‘ఈ రోజుల్లో’ , ‘రోజులుమారాయి’, ‘రొమాన్స్’, ‘వెంకటాపురం’ వంటి సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం ఐదు సినిమాలు మా ప్రొడక్షన్లో ఉన్నాయి’’ అన్నారు. -
అది ఆర్జీవీ సీక్రెట్!
‘‘ఆర్జీవీ వరల్డ్’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రా లు నేను తీయను. ఇంట్లోనే ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలు తీస్తాను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్జీవీ వరల్డ్’ అనే ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ‘క్లైమాక్స్’ చిత్రం ఈ యాప్‌లో విడుదల కానుంది. అలాగే వర్మ నేతృత్వంలోని మరో చిత్రం ‘కరోనా వైరస్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుంది. ‘ఆర్జీవీ వరల్డ్ యాప్’, ఓటీటీ ప్లాట్ఫామ్స్ల హవా వంటి విషయాలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. ఆ విశేషాలు.. ► నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం నుంచీ వెబ్‌సిరీస్ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడిదో (డిజిటల్ ప్లాట్‌ఫామ్) ప్యారలల్ ఇండస్ట్రీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్షిప్ పెరుగుతుందంటే ఆడియన్స్ చూస్తున్నట్లేగా. ఓటీటీ ప్లాట్ఫామ్స్వారు కంటెంట్ కోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ► ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్‌లు ఉంటాయి. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకు వీకెండ్ ఓపెనింగ్స్ రావాలి. దీని పబ్లిసిటీ కోసం నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్స్ ఇలా మరికొన్ని పనులను చక్కబెట్టుకోవాలి. ఇంతా చేసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా? రారా? అనే టెన్షన్. మొబైల్లో సినిమా చూసినప్పుడు థియేటర్ ఫీల్‌ని మిస్ అవుతాం అనే ఫీల్‌ని పక్కనపెడితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. కొందరు నిర్మాతలకు ఇది ప్లస్. ► పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ సినిమాలయితే థియేటర్లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్ అవుతాయి. అలాగే ఫీచర్ ఫిల్మ్ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే. ► ‘ఆర్జీవీ వరల్డ్’ ఐడియా నాకు ఎప్పటినుంచో ఉంది. ఇందులో ‘పే ఫర్’ వ్యూ విధానంలో చూడొచ్చు. చూసిన ప్రతిసారీ చార్జ్ చేస్తాం. ► కమల్‌హాసన్ ‘డైరెక్ట్ హోమ్’ ఫార్మట్‌లో ‘విశ్వరూపం’ విడుదల ప్లాన్ చేశారు. అప్పుడు సెటప్ బాక్స్‌లు అందరికీ లేవు. కానీ ఈ నిర్ణయాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. ► నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్’. ఇది నా దృష్టిలో ఒక హారర్ ఫిల్మ్. దెయ్యం బదులు వైరస్ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్. ► ఫిల్మ్‌మేకింగ్ అనేది టీమ్ ఎఫర్ట్ అని నమ్ముతాను. అయితే సినిమాకు ఎవరు రూపకల్పన చేస్తారనేది ముఖ్యం. మా దగ్గర నేను చేస్తాను. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి క్రెడిట్ ఇస్తాను. ‘కరోనా వైరస్’ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్. ఆలోచన నాది. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ► జబ్బు, తుఫాన్, యాక్సిడెంట్... ఇలా ఏ కారణంతో అయినా మనకు చావు రావొచ్చు. ఈ జాబితాలో కరోనా వైరస్ కూడా చేరింది. కరోనా వైరస్ వెళ్లేట్లు లేదు. ఇంకేం చేస్తాం? దానితో కలిసి ఉండటమే. లాక్డౌన్ సమయంలో ‘క్లైమాక్స్, కరోనా వైరస్’ చిత్రాల పనులు చూసుకున్నాను. నేను తాత (వర్మ కుమార్తె రేవతి ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది)ను అయ్యానని తెలిసినప్పుడు నాకేం అనిపించలేదు. చచ్చినట్లు కరోనా వైరస్‌ను భరించాలి. నేను తాతను అయ్యానన్నది భరించాలి. ► ‘కరోనా వైరస్’ ట్రైలర్ చివర్లో ఉన్న రెండు డైలాగ్స్ సెటైర్స్ కాదు. నా సినిమాకి నప్పుతాయని పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ నుంచి చైనా వరకు కరోనా విషయంలో అందరూ చేయాల్సింది చేస్తున్నారు. అందుకే నేను ఎవరిపైనా సెటైర్ వేయలేదు. ఆ అమ్మాయంటే ఇష్టం చాలామంది పోర్న్‌స్టార్స్ ఉన్నప్పటికీ ‘జీఎస్టీ’, ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అమెరికన్ కపుల్ ఓ టూర్‌కి వెళతారు. అక్కడి వారి అనుభవాల ఆధారంగా ‘క్లైమాక్స్’ చిత్రం ఉంటుంది. హారర్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. ‘ఎంటర్ ద గాళ్ డ్రాగన్’ చిత్రం షూటింగ్ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉంది. చైనా షూట్‌ను కంప్లీట్ చేశాం. మేం చైనా నుంచి వచ్చిన నాలుగు రోజులకు అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. -
వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్ ట్రైలర్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఫోర్న్ స్టార్ మియా మాల్కోవా కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్ పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, వీడియో సాంగ్ ప్రొమోకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆర్జీవీ తన యూట్యూబ్ చానల్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తే.. రోమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అర్ధమవుతోంది. ఈ చిత్రంతో ఆర్జీవీ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ఎస్ఆర్ ప్రొడక్షన్, శ్రేయాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని మే 29 ఉదయం 11 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.(చదవండి : వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్) గతంలో ఆర్జీవీ, మియా మాల్కోవా కాంబినేషన్ వచ్చిన జీఎస్టీ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఈ చిత్రాన్ని వ్యతిరేకించినప్పటికీ.. ఆర్జీవీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఆర్జీవీ అభిమానులు.. రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన ఫెవరేట్ మియా మాల్కోవాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాచని.. ఇందులో ఆమె నటన ఆశ్చర్యపరిచేలా ఉంటుందని వర్మ పేర్కొన్నారు.(చదవండి : విజయ్ సేతుపతిపై బీజేపీ నేతల ఫిర్యాదు) -
పాత్ర కోసం మార్పు
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో ‘డ్రీమ్’ ఫేమ్, ప్రవాసాంధ్రుడు భవానీశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘క్లైమ్యాక్స్’. నాషా సింగ్, రమేష్, చందు కీలక పాత్రధారులు. పి. రాజేశ్వర్ రెడ్డి, కె.కరుణాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా భవానీ శంకర్ మాట్లాడుతూ– ‘‘ఇందులో రాజేంద్రప్రసాద్‌గారి పాత్ర పేరు మోడీ. ఆయన పాత్రకు మోడీ అనే పేరు ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ పాత్ర కోసం రాజేంద్రప్రసాద్ కొత్తగా మారారు’’ అన్నారు. ‘పొలిటిక్ సెటైర్ నేపథ్యంలో నడిచే మర్డర్ మిస్టరీ ఇది. మా సంస్థకు గొప్ప పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది’’ అన్నారు పి. రాజేశ్వర్‌రెడ్డి. ఈ సినిమాకు రాజేష్ సంగీతం అందిస్తున్నారు. -
సార్వత్రిక ఎన్నికల సమరమే..!
సార్వత్రిక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. 36 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభం కానుంది. జిల్లాలో రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 రోజుల పాటు హోరాహోరీగా ప్రచారం సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ప్రచార పర్వం నిర్వహించగా, జాతీయ పార్టీల నేతలు జిల్లాకు రాకుండా ముఖం చాటేశారు. మరో వైపు 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలింగ్ బూత్‌ల వద్ద సౌకర్యాలు ఏర్పాటు చేసే పనిలో జిల్లా ఎన్నికల అధికారులు బిజీగా ఉన్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, బీఎస్పీతో కలిసి జనసేన, స్వత్రంత అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం ముగియనుండడంతో, ఆఖరుగా 36 గంటలు ఉండగా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. అధికార తెలుగుదేశం పార్టీ జిల్లాలో ధన ప్రవాహాన్ని పారిస్తోంది. గత నెల 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ నెల 11వ తేదీన పోలింగ్, వచ్చే నెల 23వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. వచ్చే నెల 23 వరకు అధికారికంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రోజు నుంచి జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలులోకి వచ్చింది. దీని కొనసాగింపుగా 9వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత జిల్లాలో సెక్షన్ 144 పక్కాగా అమలులోకి రానుంది. జగన్ సభలతో నూతనోత్తేజం జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రధానంగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అగ్రనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని కావలి, గూడూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించి పార్టీ క్యాడర్లో నయా జోష్ నింపారు. ప్రధానంగా ఆయా నియోజకవర్గాల ప్రధాన సమస్యలపై సమగ్ర అవగాహనతో మాట్లాడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు. పార్టీ నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి జరిగే లబ్ధిని వివరించారు. గత నెల 21న కావలిలో, 31న గూడూరు, ఈ నెల 4న నెల్లూరు సిటీలో ఎన్నికల సభలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 7న సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఎన్నికల సభలో పాల్గొన్నారు. జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడని ఆమె విజ్ఞప్తి చేశారు. పది నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విసృత్తంగా ప్రచారం నిర్వహించారు. దాదాపు ఆరు నెలలుగా ‘రావాలి జగన్––కావాలి జగన్’ పేరుతో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ప్రజలకు దగ్గరయ్యారు. ఒక్క అవకాశం ఇస్తే అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామని, పార్టీ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రచార పర్వాన్ని విజయవంతంగా ముగించుకుని ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యారు. వ్యక్తిగత విమర్శలతో బాబు హడావుడి మరో వైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాల్లో ఎన్నికల సభలు నిర్వహించారు. అయితే ప్రతి సభలో చేసింది చెప్పుకోలేని పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, స్థానిక అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. చివరి నిమిషం వరకు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు దొరక్క ఆఖరిలో అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితిని టీడీపీ ఎదుర్కొంది. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులపై సృష్టత రాలేకపోయారు. నామినేషన్ల ఘట్టం వరకూ విడతల వారీగా చివరి వరకు అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ వచ్చారు. ఈ పరిణమాలతో జిల్లాలో పార్టీ క్యాడర్లో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా నియోజకవర్గాల్లో ప్రచారంలో అభ్యర్థులు వెనుకబడిపోయారు. ప్రలోభాలపైనే వారు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు నిర్వహించిన సభలకు జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడం, ఆయన ప్రసంగం గందరగోళంగా సాగింది. దీంతో క్యాడర్లో ఉత్సాహాన్ని నింపలేకపోయింది. ప్రస్తుతం వారు ధన ప్రవాహంపై దృష్టి సారించారు. జిల్లాలో పోలీసులు చేస్తున్న దాడుల్లో అధికార పార్టీకి చెందిన నగదు, మద్యం లభించడమే ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత పేలవంగా సాగింది. ముఖ్యంగా నెల్లూరు సిటీ, కోవూరు, కావలిలో సభలు జనంలేక వెలవెలబోయాయి. భారతీయ జనాతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు జిల్లా ముఖం చూడకపోవడం గమనార్హం. ప్రత్యేక బృందాల ఏర్పాటు నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంకాలం 6.00 గంటలతో ముగిసిన తర్వాత ప్రచారం చేసే వారిపై ఎన్నికల సంఘం కేసులు నమోదు చేయనుంది. దీని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన తనిఖిల్లో రూ 31253510లు నగదు పట్టుకున్నారు. రూ 18272765ల విలువ చేసే మ«ధ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ 17143577ల విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు పాటించని 142 మందిపై కేసులు నమోదు చేశారు. -
క్లైమాక్స్ ముందే చెప్పేస్తే..!
ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు స్నేహితులతో కలసి వెళ్లామనుకోండి. అందులో ఎవరో ఒకరు ఆ సినిమాను ముందే చూసి ఉంటారు. ముందు చూడటంలో తప్పు లేదు కానీ కొందరు మాత్రం ఆ సినిమాలోని సీన్ రాకముందే ‘ఇలా జరుగుతుంది... ఇలా జరుగుతుంది’ అంటూ అన్నీ చెప్పేస్తుంటారు. అప్పుడు భలే చిరాకేస్తుంది కదా.. మరీ కోపం వస్తే కొట్టాలని కూడా అనిపిస్తుంటుంది. అచ్చు మీలాగే రష్యాకు చెందిన ఓ పెద్దాయనకు కూడా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా తాను చదివే పుస్తకాల్లోని క్లైమాక్స్‌ను ముందే చెప్పేస్తున్నాడనే కోపంతో తన సహోద్యోగిని ఏకంగా కత్తితో పొడిచేశాడట. రష్యాకు చెందిన 55 ఏళ్ల సెర్గెయ్ సవిస్కీ అనే శాస్త్రవేత్తకు పుస్తకాలు చదవడం అలవాటు. ఆయనతో పాటు 52 ఏళ్ల ఒలెజ్ బెలెగుజోవ్ నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ఒలెజ్కు కూడా పుస్తకాలు చదవడం అంటే మహా పిచ్చి. టైం పాస్ అయ్యేందుకు ఇద్దరూ వందల కొద్దీ పుస్తకాలు చదివారు. చదువుతూ ఉన్నారు. సెర్గెయ్ చదివే పుస్తకాల్లోని కథ ముగింపును సరదాగా ఒలెజ్ ముందే చెప్పేస్తూ ఆయనను ఆట పట్టిస్తుండే వాడు. అయితే ఇది సెర్గెయ్కు నచ్చలేదు. పుస్తకంలోని థ్రిల్‌ను కోల్పోతున్నానని ఫీల్ అయ్యేవాడు. అంతే... కోపం పట్టలేక ఓ రోజు ఒలెజ్ను సెర్గెయ్ ఏకంగా కిచెన్‌లోని చాకుతో ఛాతీలో పొడిచాడు. అయితే వెంటనే ఒలెజ్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందనుకోండి. మీరు కూడా సినిమా చూసేటప్పుడు వచ్చే సీన్లను చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్త సుమా! -
లవ్ మీటర్
సినిమాలో మీటితే వచ్చేది లవ్ మరి, దాన్ని లవ్ మీటర్ అనమా? చిరిగిన ప్యాంట్ వేసుకున్న అబ్బాయిది లవ్వు కుదరదు పొమన్న అమ్మాయి తెగువ జివ్వు చంపేస్తా.. నరికేస్తా.. అన్న విలన్‌ది భౌవ్వు అంతా సెటిల్ అయిపోతే క్లైమాక్స్‌లో నవ్వు ఓకే... ఆర్టికల్ బాగుంటుంది కమాన్... సినిమా లవ్వుని కొంచెం తవ్వు ఆ“ మీటర్ పడిందిరా! ఇచ్చి పుచ్చుకో సినిమా ప్రేమకి ఎర్ర గులాబీ పువ్వు! ప్రేమ ఒక సినిమా ‘సాహసం చేయరా ఢింబకా. రాకుమారి లభించునులే’ అంటాడు నేపాళ మాంత్రికుడు. రాకుమారిగానీ, ప్రేమగానీ సాహసం లేకుండా దొరకవని తెలుగు సినిమాలో సమర్థంగా ప్రవేశ పెట్టిన నటుడు ఎన్.టి.రామారావు. ఆయన నటించిన రెండు ప్రేమకథలు ‘పాతాళభైరవి’, ‘మల్లీశరి’ దాదాపు ఒక సమయానికి చెందినవి. నిరుపేద కూడా రాకుమారిని వలచవచ్చు, వలచి సాధించవచ్చు అని ‘పాతాళభైరవి’ నిరూపిస్తే నిర్మలమైన ప్రేమకు అడ్డుగా చక్రవర్తి నిలుచున్నా ఆ ప్రేమ సఫలమై తీరుతుందని ‘మల్లీశ్వరి’ స్థిరపరిచింది. తెలుగు సినిమాల్లో ప్రేమ, పాటా కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగాయి. అందుకే ప్రేమ ఉంటే పాట ఉంటుంది. పాటలో ప్రేమ ఉంటుంది. ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’... వాహ్ ఏం పాట. ‘జాలి గుండెల మేఘమాల..’ అని మేఘాలతో ప్రేమను మొరపెట్టుకుంటే మనసు మబ్బుల్లో తేలిపోదూ. కుడి ఎడమైంది ఇలా సాహసంగా మొదలైన ప్రేమ మరో రెండేళ్లకు మందుగ్లాసు పట్టుకుంది. మరి మన ఏ.ఎన్.ఆర్ వచ్చాడు కదా. ‘పల్లెకు పోదాం పారును చూదాం చలోచలో...’ అని హుషారుగా ప్రేమలో పడ్డాడు. ఆ ప్రేమ సఫలం కాదు. పార్వతి కోసం దేవదాసు పుట్టాడు. దేవదాసు కోసం పార్వతి ఊపిరి పోసుకుంది. వారిద్దరినీ విధి ఓడిస్తే ఆలంబనగా మత్తు విషాన్ని ఆశ్రయించాడు దేవదాసు. ‘శరత్’ రాసిన ఈ నవల భారతదేశానికే కాదు భారతీయ ప్రేమకు కూడా ఒక పాత్రను ఇచ్చింది. ప్రతి విఫల ప్రేమికుడూ లోకం దృష్టిలో దేవదాసే. ప్రేమ ఫలిస్తే ఒక దైవత్వం. విఫలమైనా దైవత్వమే. అందుకే దేవదాసు ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..’ అన్నాడు. అవును. ఓడిపోలేదోయ్. నా పేరు బికారి నా దారి ఎడారి కృష్ణ వచ్చాడు. రావడం రావడమే రివాల్వర్‌తో ఢామ్మని ప్రేమలో పడ్డాడు. ‘డీరి డిరిడిరి డీరిడి’ అని అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. కాని తుపాకీని ప్రేమించేవాడికి కూడా మెత్తటి మనసు ఉంటుంది. అందుకే ‘శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’లో కృష్ణ హోటల్ అధిపతి అందాల కుమార్తెను మూగగా ప్రేమించాడు. ‘నా పేరు బికారి... నా దారి ఎడారి..’ అయినా నన్ను ప్రేమించలేవా అని ప్రాధేయపడ్డాడు. ‘ఆకాశపందిరిలో నీకు నాకు పెళ్లంట..’ అని పాటల్లో కలలు కన్నాడు. ఆ ప్రేమ ఫలించిందనుకోండి చివరకు. నీవు లేక నేను లేను నేను లేక నీవు లేవు ఇలా పవిత్రంగా అమూర్తంగా ఉన్న ప్రేమ శోభన్‌బాబు దగ్గరకు వచ్చేసరికి కొంచెం హద్దు దాటింది. అసలే మంచు ప్రాంతం. ఆమె చలి బారిన పడింది. పక్కనే అతడున్నాడు. ప్రేమలో ఉన్న జంట దగ్గరయ్యింది. కాని దాని వల్ల వారి మధ్య ఎడబాటే వచ్చింది. బిడ్డ పుట్టినా కలిసి ఉండలేని దురదృష్టం. ‘నిన్ను మరిచి పోవాలని అన్ని విడిచి వెళ్లాలని ఎన్నిసార్లో అనుకున్నా మనసు రాక మానుకున్నా...’ అని అతడు బాధ పడాల్సి వచ్చింది ‘మంచి మనసులు’ సినిమాలో. కాని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అని సినిమా చివరలో ఆమే, అతడూ, నడిచే కొడుకూ ఒక్కటవుతారు. ఇదే శోభన్‌బాబు ‘గోరింటాకు’ సినిమాలో ‘ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం...’ అంటూ సుజాతను ప్రేమిస్తాడు. ‘కొమ్మకొమ్మకో సన్నాయి..’ అని ఆమె ప్రేమలో రాగాలు ఊదుకున్నాడు. ఆమె మాత్రం గోరింటాకులా అతడి బతుకును పండించి రాలిపోతుంది. కొన్ని ప్రేమలు అంతే. ఎదుటివారి జీవితాన్ని పండిస్తాయి. నా జీవన సంధ్యాసమయంలో ఒక దేవత ఉదయించింది కృష్ణంరాజు నటించిన ‘అమరదీపం’లో ఈ పాట. దేవదాసు సినిమాలో తాగితాగి అతడు మరణాన్ని ఆశ్రయిస్తే తను ప్రేమించిన ప్రియురాలి సంతోషమయమైన జీవితం కోసం ఈ సినిమాలో కృష్ణంరాజు ఆత్మార్పణ చేసి అమరదీపం అవుతాడు. అసాంఘిక కార్యక్రమాల్లో ఉన్న కృష్ణంరాజు తన దగ్గర పని చేసే జయసుధను ప్రేమిస్తాడు. కాని ఆమె అతడి తమ్ముణ్ణి కోరుకుంటుంది. వారిరువురూ ఇతడి మనసు తెలుసుకోలేక ద్వేషిస్తారు. ఏ దేవత అయితే తన జీవితంలో ఉదయించిందో ఆ దేవతే శాపంగా మారడం అతడు తట్టుకోలేక వారి జీవితాల్లో నుంచి నిష్క్రమిస్తాడు. అగ్రిమెంట్ ప్రేమ ఈ తీరులో సాగుతున్న తెలుగు సినీ ప్రేమ కథను బాలచందర్ ‘మరో చరిత్ర’ మలుపు తిప్పింది. తమిళ అబ్బాయి, తెలుగు అమ్మాయి, భీమిలీ బీచ్, అందమైన పాట ఆ సినిమా తెలుగు ప్రాంతపు నలుమూలలా ప్రేమను పదింతలు పెంచి, కుర్రకారును ప్రేమలో మునకలేసేలా చేసింది. ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు వారి ప్రేమను అంగీకరించారు. అప్పుడే ఆ ప్రేమికులు ఆ తల్లిదండ్రులు పెట్టిన అగ్రిమెంట్‌కు అంగీకరిస్తారు. ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకుండా గడిపి తమది నిజమైన ప్రేమ అని నిరూపించి పెళ్లి చేసుకుందామనుకుంటారు. కాని ప్రేమికులు ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుంది. ఆ గొప్ప ప్రేమికులు తమ ప్రేమలో ప్రాణాలు కోల్పోయి తీరంలో అనాథ కెరటాల్లా విగతమవుతారు. ప్రేమకు ఖైదీ చిరంజీవి వచ్చాడు. రగులుతోంది మొగలిపొద అన్నాడు. ‘ఖైదీ’లో మాధవితో ప్రేమలో పడ్డాడు. కాని ఆ ప్రేమ రావుగోపాలరావుకు ఇష్టం లేదు. నానా హింసా సృష్టించాడు. చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాల్సిన హీరోని ఖైదీగా మార్చాడు. చివరకు ఆ ఖైదీ క్లయిమాక్స్‌లో ‘పగ కోసం ఈ జన్మ ప్రేమ కోసం మరో జన్మ...’ అని అనాల్సి వస్తుంది. ఇదే చిరంజీవి ‘రుద్రవీణ’లో తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఒక దళిత అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్లది నిజంగా ఎంతో హుందా అయిన ప్రేమ. ఊరి బాగు కోసం ఆ ప్రేమికులిరువురూ తమ ప్రేమను త్యాగం చేస్తారు. ‘లలిత ప్రియ కమలం విరిసినది’... ఆ పాట మాత్రం ప్రేక్షకులకు మిగిల్చారు. సాహసమే జీవితం తండ్రి నీడ నుంచి బయటికొచ్చి హీరోగా పూర్తి స్థాయి కెరీర్ ప్రారంభిస్తూ బాలకృష్ణ చేసిన తొలి సినిమా ప్రేమ సినిమాయే. మొన్నటి ‘చంద్రముఖి’ డైరెక్టర్, పెద్ద ఎన్టీఆర్‌కు పర్సనల్ మేకప్ మేన్ అయిన పి.పీతాంబరం కుమారుడు పి.వాసు దాని డైరెక్టర్. విజ్జి హీరోయిన్. కాలేజీలో, సిటీ బస్సులో ప్రేమలూ మొదటిసారి చూపించిన సినిమా ‘సాహసమే జీవితం’. అంతేకాదు తమ క్లాస్మేట్స్ ప్రేమను విజయవంతం చేయడానికి కాలేజీ స్టూడెంట్స్ తిరుగుబాటు చేయడాన్ని మొదటిసారి చూపిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత దానిని చాలా సినిమాల్లో ఉపయోగించారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా, మరో ప్రేమ కథ (వరుసకు మరదలైన రజనీని చిన్నప్పటి నుంచి ప్రేమించి, పెద్దయ్యి సాధించుకోవడం) ‘సీతారామ కల్యాణం’తో బాలకృష్ణ పెద్ద విజయాన్ని సాధించాడు. ‘రాళ్లల్లో ఇసుకల్లో రాశాము ఇద్దరి పేర్లూ...’ పాట ఉన్న ఆ సినిమా మంచి ప్రేమ సినిమాగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. మజ్నూ ప్రేమించిన గీతాంజలి తండ్రికి ‘ప్రేమాభిషేకం’ ఇచ్చిన దాసరి నారాయణరావు.. కొడుకు నాగార్జునకు ‘మజ్నూ’ ఇచ్చాడు. వరస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగార్జునను ఎత్తి గట్టున పెట్టిన సినిమా ఈ ‘మజ్నూ’. నాటి దేవదాసు స్ఫూర్తితో తీసిన ఈ సినిమాలో కూడా నాగార్జున మరణిస్తాడు. ఈ సినిమాలో నాగార్జున తాను ప్రేమించిన రజనీని కొందరి మాటల ప్రభావంతో అనుమానిస్తాడు. ప్రేమలో ఉండాల్సింది నమ్మకమనీ అనుమానం కాదనీ ఆమె అతణ్ణి చీదరించుకుని విడిపోతుంది. దాంతో తట్టుకోలేని నాగార్జున చివరకు మృత్యు పరిష్వంగంలో సేద తీరుతాడు. కాని మరణం ఖాయం అని తెలిసినా ఎప్పుడు వస్తుందో తెలియని మరణం కోసం ఎదురు చూసేకన్నా ఉన్న నాలుగు రోజులు హాయిగా ప్రేమలో ఉందాం అని చెప్పిన సినిమా మణిరత్నం ‘గీతాంజలి’. ఇందులో హీరో హీరోయిన్ ఇద్దరూ కేన్సర్ బాధితులే. కాని ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమే వారిని బతికిస్తుంది. బతికించగలుగుతుందనే భరోసాను ఇస్తుంది. ‘ఓ పాపా లాలి...’, ‘ఆమని పాడవే హాయిగా...’ వంటి హాౖయెన పాటలు ఉన్న ఈ ప్రేమ సినిమాలు ప్రభాతపు మంచుదుప్పట్ల అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈనాడే ఏదో అయ్యింది ప్రేమకు అమ్మాయి తండ్రో అబ్బాయి తండ్రో అడ్డు పడటం అప్పటి దాకా అందరూ చూశారు. కాని అమ్మాయి తల్లి ప్రేమకు విలన్ కావడం ‘ప్రేమ’లో చూశారు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్, రేవతి కలసి నటించిన ఈ సినిమాలో రేవతి తల్లి మంజులకు, వెంకటేష్‌కు ఇగో క్లాషెస్ వస్తాయి. ఆమె వారి ప్రేమను అన్ని విధాలా అడ్డుకుంటుంది. కాని గొప్ప మనసు, పాట ఉన్న వెంకటేష్ ప్రేమే చివరకు గెలుస్తుంది. మొదట ఈ సినిమా క్లయిమాక్స్‌లో హీరోయిన్ చనిపోతుంది. కాని ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చనిపోయే సీన్‌ను వెంటనే కట్ చేశారు. ఇళయరాజా ‘ఈనాడే ఏదో అయ్యింది..’ హిట్ ఇందులోనే. ప్రేమ సినిమాలో రఫ్ అండ్ టఫ్‌గా ఉండే వెంకటేషే ‘చంటి’ సినిమాలో ఎంతో అమాయకంగా మీనా ప్రేమలో పడతాడు. పావురానికి, పంజరానికి పెళ్లి చేసే పాడులోకంలో వారి ప్రేమకు చాలా అడ్డంకులే వస్తాయి. చివరకు సఫలమయ్యి ‘ఎన్నెన్నో అందాలు...’ వారు చూడగలుగుతారు. తొలిప్రేమ, వర్షం, నువ్వు–నేను ఆ తర్వాతి తరంలో ఎందరో హీరోలు. ఎన్నో ప్రేమ కథలు. సృష్టిలో స్త్రీ, పురుషుడు ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది. తెర మీద సినిమా ఉన్నంత కాలం అందులో ప్రేమ ఉంటుంది. కెరీర్ ఒడిదొడుకులలో ఉన్న పవన్ కల్యాణ్‌ను హిట్లలోకి తీసుకుచ్చింది కరుణాకరన్ తీసిన ప్రేమకథ ‘తొలి ప్రేమ’. అందులో గొప్పింటి అమ్మాయిని ప్రేమించి మామూలు కుర్రాడు బాలూగా పవన్‌కల్యాణ్ మనసులను ఆకట్టుకుంటాడు. ఇక ‘వర్షం’లో ప్రభాస్, త్రిషాలు ప్రేమజల్లులను ప్రేక్షకుల మీద చిలకరిస్తారు. అయితే దర్శకుడు తేజా వచ్చి ప్రేమను మరింత ఘాటుగా ప్రేక్షకులకు ఎక్కించాడని చెప్పాలి. ఉదయ్‌కిరణ్, అనితా కలిసి నటించిన ‘నువ్వు–నేను’ పెద్ద హిట్. ‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కామా...’ పాటా హిట్టే. ఇదే తేజా నితిన్, సదాలతో తీసిన ‘జయం’ ఇంకా పెద్ద హిట్టయిన ప్రేమకథగా నిలిచింది. హీరోయిన్ కాలిపట్టీలతో హీరో ప్రేమలో పడతాడు. ‘అందమైన మనసులో ఇంత అలజడెందుకో...’ అని ప్రశ్నిస్తాడు. ఈ కాలంలోనే ప్రేమను స్నేహం అనుకుని మోసపోవద్దు, స్నేహాన్ని ప్రేమ అనుకొని భ్రమపడవద్దు అనే పాయింట్‌తో వచ్చిన ‘నువ్వే కావాలి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తరుణ్, రిచాలకు మాత్రమే కాదు యువ ప్రేక్షకులకు కూడా అదో పెద్ద జాక్‌పాట్. లవ్పాట్. వీటి మధ్యలో ఫ్యాక్షన్ కథలో కూడా అందమైన ప్రేమను చూపించగలిగిన ‘ప్రేమించుకుందాం రా’, ‘ఒక్కడు’ సినిమాలను కూడా ప్రేక్షకులు మర్చిపోలేదు. ‘ఒక్కడు’లో ఎయిర్‌పోర్ట్‌లో భూమికను వదిలి ఖాళీ బైక్‌ను కిక్ కొట్టాక మహేశ్‌బాబు ఆ అమ్మాయి ఇంకా తనతోనే ఉందనుకుంటూ ‘ఎక్కు’ అనంటాడు. అది చూసి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి అతణ్ణి కావలించుకుంటుంది. ప్రేమ పుట్టింది. చప్పట్లు పడ్డాయి. మంచి ప్రేమ సన్నివేశం అది. ఇక రవితేజ ‘ఇడియట్’ ఒక మొండివాడి ప్రేమ గెలుపు. గంగోత్రి... మనసంతా నువ్వే అల్లు అర్జున్ హీరోగా తొలి సినిమా ‘గంగోత్రి’ ప్రేమ వల్లే విజయం సాధించగలిగింది. పాలేరైనా ప్రేమికుడే అని చెప్పిన సినిమా ఇది. మరోవైపు ఎమ్మెస్ రాజు నిర్మాణ సారధ్యంలో వచ్చిన ‘మనసంతా నువ్వే’ ఉదయ్ కిరణ్ జీవితంలో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. ‘తూనీగ తూనీగ ఎందాక పరిగెడతావే’... పాటకు జనం థియేటర్లకు పరిగెట్టారు. అలాగే సిద్ధార్థ, త్రిష నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ జూబ్లీహిట్గా నిలిచింది. ప్రేమ జన్మజన్మలకు కొనసాగుతుందని రామ్‌చరణ్ ‘మగధీర’ నిరూపించింది. ఏ మాయ చేసావె కాలం మారింది. తరం కూడా మారింది. నాగచైతన్య వచ్చి ‘ఏ మాయ చేసావె’, ‘హండ్రెడ్ పర్సెంట్ లవ్’ వంటి హిట్స్ ఇచ్చాడు. తాజాగా ‘ప్రేమమ్’ను డెలివర్ చేశాడు. జీవితం కొనసాగుతూ ఉంటే ప్రేమ కూడా కొనసాగుతుంది అని చెప్పిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది. నాని తన ప్రేమ కోసం ‘ఈగ’గా పునర్జన్మ ఎత్తాడు. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ప్రేక్షకులకు చూపించాడు. తనకు మతిమరుపు ఉన్నా ప్రేమను గెలుచుకుని ‘భలే భలే మగాడివోయ్’ అనిపించాడు. నాని నటించిన ప్రేమకథలు మజ్నూ, నేను లోకల్ కూడా సక్సెస్ మీటర్‌ను టచ్ చేశాయి. రాజ్‌తరుణ్ ‘ఉయ్యాల జంపాల’, విజయ్‌దేవరకొండ ‘పెళ్లిచూపులు’, రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ ఇవన్నీ ప్రేమ చుట్టూ అల్లుకున్న కథలే. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఒక్క సినిమాకు ఐదు క్లైమాక్స్‌లు
యంగ్ హీరో రానా హీరోగా తెరకెక్కుతున్న బహుభాషా చిత్రం ఘాజీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రానాతో పాటు అతుల్ కులకర్ణి, కె కె మీనన్, తాప్సీలు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాదు సముద్ర జలాల్లో జరిగిన యుద్ధకథతో తెరకెక్కుతున్న తొలి భారతీయ చిత్రం కూడా ఘాజీనే కావటం విశేషం. కొత్త దర్శకుడు సంకల్ప రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా క్లైమాక్స్‌పై ఆసక్తికరమైన వార్త ఒకటి వినిపిస్తోంది. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్‌కు చెందిన ఘాజీ అనే సబ్ మెరైన్ అదృష్యమైంది. ఈ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దర్శకుడు ఐదు రకాల క్లైమాక్స్‌లు రాశాడట. యూనిట్ సభ్యులతో పాటు కొంత మంది బాలీవుడ్ రచయితలను కూడా సంప్రదించి వాటిలో బెస్ట్ క్లైమాక్స్‌ను ఫైనల్ చేసి తెరకెక్కించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 17న రిలీజ్ కానుంది. -
సత్యాగ్యాంగ్ ఫైట్
పాతపాడు(బనగానపల్లె రూరల్): బనగానపల్లె నవాబు బంగ్లాలో సత్యాగ్యాంగ్ సినిమా క్లైమాక్్సఫైట్ను బుధవారం చిత్రీకరించారు. హీరో సుమన్‌తో విలన్ గొడవపడే సన్నివేశాన్ని తెరకెకి్కంచారు. దీంతో సినిమా షూటింగ్ పూరైనట్లు చిత్రయూనిట్ సభ్యులు తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు వారు వెల్లడించారు. -
రోబో 2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి
రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా ఫెయిల్యూర్‌తో డీలా పడ్డ శంకర్, 2.0తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చూసుకోవాలని భావిస్తున్నాడు. రజనీ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినా.. ప్రస్తుతం శంకర్ ప్లానింగ్‌తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ అయిపోవటంతో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే అని భావిస్తున్నారు. పాటలతో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్స్ రూపొందించారు. పతాక సన్నివేశాల్లో ఎర్రకోట, పార్లమెంట్ పరిసరాల్లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఆ రెండింటినీ చెన్నైలో సెట్ వేసినట్టుగా సమాచారం. భారీ గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి 2017 చివర కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయింది
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మంగళవారంతో బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయినట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేటితో క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. భారీ షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ బ్రేక్ తీసుకోనుంది. తిరిగి సెప్టెంబరు 6 వ తేదీన కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది తెలియాలంటే 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల కావాల్సిందే. Climax of @BaahubaliMovie 2 is completed as scheduled! A well deserved break for the unit till Sept 6th. https://t.co/1txMPyCCOY — Shobu Yarlagadda (@Shobu_) 30 August 2016 -
ఎన్టీఆర్ సినిమాకు రెండు క్లైమాక్స్‌లు..?
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్‌లతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్‌తో ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే జనతా గ్యారేజ్‌లో మరో ప్రధాన పాత్రలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండటంతో సినిమాపై మాలీవుడ్‌లో మంచి టాక్ వస్తోంది. ఆ టాక్‌ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకోసం తెలుగు, మళయాల భాషల్లో వేరు వేరు క్లైమాక్స్‌లను షూట్ చేస్తున్నారట. ఇప్పటికే దళపతి, ఏం మాయ చేసావే, ఘర్షణ లాంటి చిత్రాలకు ఇలా రెండు క్లైమాక్స్‌లను తీసి సక్సెస్ సాధించగా.. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫార్ములాను యూజ్ చేస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ను ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్‌ను చిత్రీకరించి, మళయాలంలో మాత్రం మోహన్ లాల్‌ను హైలెట్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. -
అక్కడ ‘కబాలి’ క్లైమాక్స్ మారింది!
విడుదలకు ముందు ‘కబాలి’ సినిమా క్లైమాక్స్‌పై అనేక కథనాలు వచ్చాయి. ‘కబాలి’ సినిమాలో నెగిటివ్ ఎండింగ్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో క్లైమాక్స్‌లో ‘కబాలి’ చనిపోతాడా? అని రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ నిజానికి దర్శకుడు పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో సాహసం చేయలేకపోయాడు. చివరి సీన్లో తుపాకీ పేలుడు శబ్దం వినిపించినా.. ఈ తూటాకి ‘కబాలి’ చనిపోయాడా? అన్న విషయాన్ని మాత్రం దర్శకుడు చూపించలేదు. కథ, కథనం విషయంలో తనదైన స్టైల్‌ను ఫాలో అయిన పా రంజిత్ క్లైమాక్స్ విషయంలో మాత్రం సాహసించలేకపోయాడు. రజనీ పాత్ర తెరపై చనిపోయినట్టు చూపించడం అంత ఈజీ కాదు. దీనిని అభిమానులు జీర్ణించుకోలేరు. అందుకే తుపాకీ శబ్దంతో, కొంత సస్పెన్స్‌తో ‘కబాలి’ క్లైమాక్స్‌ను ముగించాడు. దీంతో సినిమా నెటిగివ్ ఎండింగా.. పాజిటివ్ ఎండింగా అనేది ప్రేక్షకుడికి అంతుచిక్కలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా క్లైమాక్స్ గురించి మరో ట్విస్టు వెలుగుచూసింది. సినిమా అంతా మలేషియా నేపథ్యంగా, అక్కడ జరిగే గ్యాంగ్‌వార్ ప్రధాన కథగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలేషియాలో ఈ సినిమా క్లైమాక్స్‌ను మార్చారు. క్లైమాక్స్‌లో ‘కబాలి’ పోలీసులకు లొంగిపోతాడని పేర్కొన్నారు. మలేషియా నేపథ్యంగా సినిమా తెరకెక్కడం, ఎక్కువశాతం షూటింగ్ అక్కడే జరిగిన నేపథ్యంలో స్థానికంగా వ్యతిరేకత రాకుండా.. చట్టాన్ని గౌరవించి ‘కబాలి’ పోలీసులకు లొంగిపోయినట్టు పేర్కొన్నారని భావిస్తున్నారు. -
కబాలి క్లైమాక్స్‌పై షాకింగ్ న్యూస్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కబాలి గురించే వార్తలు వినిపిస్తున్నాయి. మీడియా, సోషల్ మీడియాలలో కూడా కబాలినే ట్రెండ్ అవుతోంది. అందుకే కబాలి సంబందించిన ఏ చిన్న వార్త అయినా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కబాలి సినిమా క్లైమాక్స్‌కు సంబందించిన ఓ వార్త రజనీ అభిమానులకు షాక్ ఇస్తోంది. ముందుగా కబాలి కథను రజనీకాంత్‌కు వినిపించిన దర్శకుడు పా రంజిత్ ఆ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ను సూచించాడట. రజనీకి ఆ పాయింట్ నచ్చినా.., అభిమానులు అంగీకరిస్తోరో.. లేదో అన్న అనుమానం వ్యక్తం చేశాడట. అయితే దర్శకుడు మాత్రం సినిమాకు ఈ క్లైమాక్స్ అయితేనే కరెక్ట్ అని అదే కొనసాగించాడన్న టాక్ వినిపిస్తోంది. నెగెటివ్ క్లైమాక్స్అంటే ఏంటి.. సినిమా చివర్లో రజనీ పాత్ర విలన్ చేతిలో ఓడిపోతుందా..? లేక కబాలి చనిపోతాడా..? నిజంగా రజనీ ఓటమిని అభిమానులు అంగీకరిస్తారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు నిజంగానే పా రంజిత్ సినిమాకు నెగెటివ్ ఎండింగ్ ఇచ్చాడా..? అసలు విషయం తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
యుద్ధానికి 30 కోట్లు?
దాదాపు రెండు నెలలకు పైగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ చిత్రబృందం షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టేసి, సోమవారం నుంచి షూటింగ్‌తో బిజీ కానున్నారు. క్లైమాక్స్‌లో భాగంగా వచ్చే భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు రాజమౌళి అన్ని సన్నాహాలూ పూర్తి చేశారు. ఈ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ తయారు చేయించారు. నటీనటులకు కూడా శిక్షణ ఇప్పించారు. ఈ భారీ యుద్ధ సన్నివేశాలకు అయ్యే ఖర్చు దాదాపు 30 కోట్ల రూపాయలు అని సమాచారం. తొలి భాగం క్లైమ్యాక్స్కి 10 కోట్లు అయిందనే వార్త వినిపించింది. ఇప్పుడు సీక్వెల్ క్లైమ్యాక్స్‌కు అంతకు మూడింతల బడ్జెట్ అంటే.. భారీ స్థాయిలో ఉంటుందని ఊహించవచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరుల కాంబినేషన్లో శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.