
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరో నెల రోజుల పాటు షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మేకర్స్ ఈ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా సుకుమార్ డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పుష్ప చిత్రంలో శ్రీవల్లిగా మెప్పించిన రష‍్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పుష్ప 2 క్లైమాక్స్ సీన్ వీడియో అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వీడియో పుష్ప-2 చిత్రానికి సంబంధించిందా? లేదా ?అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఈ వీడియో చూసిన బన్నీ ఫ్యాన్స్ నెటిజన్ తీరుపై మండిపడుతున్నారు. దీంతో సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుతున్నారు.
మరికొందరు ఫ్యాన్స్ ఈ వీడియోనూ డిలీట్ చేయాలంటూ అతనికి రెక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఎందుకిలా లీక్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. దయచేసి ఈ వీడియో డిలీట్ చేయండి బ్రో అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో డిలీట్ చేయకపోతే కొందరి ఉద్యోగాలు కూడా పోతాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెట్టింట వైరలవుతోన్న వీడియో ఒరిజినలా, కాదా అన్నది తెలియాలంటే మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
#Pushpa2 Climax Fight Scene 😉
Enjoy pandagowww 💥🥵😎@alluarjun #Pushpa2TheRule pic.twitter.com/EyGDhWtvzu— Jaisai Nimmala (Allu Arjun Die Hard Fan) (@NimmalaJaisai23) July 30, 2024