రోబో 2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి | Robo 2 has finished shooting the climax portion | Sakshi
Sakshi News home page

రోబో 2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి

Published Wed, Oct 5 2016 11:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM

రోబో 2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి

రోబో 2 క్లైమాక్స్ షూటింగ్ పూర్తి

రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజువల్ వండర్ 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా రూపొందుతున్న ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఐ సినిమా ఫెయిల్యూర్తో డీలా పడ్డ శంకర్, 2.0తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చూసుకోవాలని భావిస్తున్నాడు.

రజనీ అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినా.. ప్రస్తుతం శంకర్ ప్లానింగ్తో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ అయిపోవటంతో దాదాపు సినిమా షూటింగ్ పూర్తయినట్టే అని భావిస్తున్నారు. పాటలతో పాటు కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ కోసం భారీ సెట్స్ రూపొందించారు.

పతాక సన్నివేశాల్లో ఎర్రకోట, పార్లమెంట్ పరిసరాల్లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో ఆ రెండింటినీ చెన్నైలో సెట్ వేసినట్టుగా సమాచారం. భారీ గ్రాఫిక్స్ అవసరం ఉండటంతో వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి 2017 చివర కల్లా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement