వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్‌ ట్రైలర్‌ | Ram Gopal Varma And Mia Malkova Climax Movie Trailer Released | Sakshi
Sakshi News home page

వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్‌ ట్రైలర్‌

Published Mon, May 18 2020 11:28 AM | Last Updated on Mon, May 18 2020 12:14 PM

Ram Gopal Varma And Mia Malkova Climax Movie Trailer Released - Sakshi

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, ఫోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవా కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్‌ పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, వీడియో సాంగ్‌ ప్రొమోకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆర్జీవీ తన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తే.. రోమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అర్ధమవుతోంది. ఈ చిత్రంతో ఆర్జీవీ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్‌, శ్రేయాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని మే 29 ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.(చదవండి : వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్‌)

గతంలో ఆర్జీవీ, మియా మాల్కోవా కాంబినేషన్‌ వచ్చిన జీఎస్టీ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఈ చిత్రాన్ని వ్యతిరేకించినప్పటికీ.. ఆర్జీవీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఆర్జీవీ అభిమానులు.. రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన ఫెవరేట్‌ మియా మాల్కోవాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాచని.. ఇందులో ఆమె నటన ఆశ్చర్యపరిచేలా ఉంటుందని వర్మ పేర్కొన్నారు.(చదవండి : విజయ్‌ సేతుపతిపై బీజేపీ నేతల ఫిర్యాదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement