Mia Malkova
-
విధి వెక్కిరిస్తే.. పోర్న్‌స్టార్ అయ్యాడు
ఆ కుర్రాడి లక్క్ష్యం బలమైందే. ఆ ప్రయత్నంలోనూ అతను సిన్సియర్‌గా ఉన్నాడు. కానీ, అనుకోకుండా జరిగిన ఘటన అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా దేశానికి ఆడాలనే కల చెల్లాచెదురు అయ్యింది. 600 అడల్ట్ సినిమాలు.. కోట్లలో సంపాదన, బ్రాండ్ అంబాసిడర్‌గా-సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా రాణింపుతో అదనపు ఆదాయం, సెలబ్రిటీలతో సాన్నిహిత్యం.. ఇదీ 37 ఏళ్ల అడల్ట్ స్టార్ డేనియల్ రెగినాల్డ్ మౌంటేయిన్ సాధించిన ఘనత కానీ ఘనత... డేనియల్ రెగినాల్డ్ మౌంటేయిన్.. ఇంగ్లండ్ బ్రాక్నెల్లో 1984 జులై 18న పుట్టాడు. స్కూల్ వయసులో తొమ్మిదేళ్ల వయసుకే సాకర్‌లో మంచి ప్లేయర్‌గా పేరు రావడంతో చెల్సీ, వెస్ట్ హామ్, స్పర్స్ లాంటి జట్లు అతని మీద నజర్ పెట్టాయి. పదిహేను పదహారేళ్లకే సౌత్ఆంప్టన్ కీ ప్లేయర్‌గా అతని పేరు మారుమోగిపోయింది. ఇక సాకర్ శకంలో అతని టైం మొదలైందనుకున్న టైంలో.. విధివశాత్తూ కాలికి గాయం అయ్యింది అతనికి. మోకాలి గాయం కొన్ని నెలలపాటు వేధించింది అతన్ని. దీంతో ఫుట్‌బాల్‌కు పనికిరాడనే ఉద్దేశంతో సౌత్ఆంప్టన్ అతన్ని ట్రీట్మెంట్కు అయ్యే డబ్బు అందించి.. టీం నుంచి ఉద్వాసన పలికింది. అలా పదహరేళ్ల వయసుకే ఫుట్‌బాల్ కావాలనే కల చెదిరిపోయింది. డేటింగ్ గర్ల్ సాయంతో.. ఫుట్‌బాల్ రేపిన గాయం నుంచి తేరుకున్నాక.. కార్పెంటర్‌గా ఆరేళ్లపాటు పని చేశాడతను. ఆ టైంలోనే.. ఓ డేటింగ్ సైట్ ద్వారా ఒక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అయితే అతన్ని పోర్న్ సినిమాల్లో ప్రయత్నించమని చెప్పిందా యువతి. సిగ్గు-భయంతోనే లండన్‌లో జరిగిన అడిషన్స్‌కు వెళ్లిన అతనికి.. అవకాశం దక్కింది. విషయం తెలిసి ఇంట్లోవాళ్లు బాధపడ్డారు. కొన్నిరోజులకు అలవాటు పడ్డారు. అడల్ట్ సినిమాల్లో అవకాశాలు పెరుగుతున్నా కొద్దీ.. ఆదాయం-క్రేజ్ పెరగడం మొదలైంది. దీంతో 24 ఏళ్లకు లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చాడు. పోర్న్స్టార్లతో డేటింగ్.. పెళ్లి లాస్ ఏంజెల్స్‌లో అడుగుపెట్టాక.. డానీ మౌంటెన్ పేరుతో అడల్ట్ పరిశ్రమలో సూపర్ స్టార్ అయ్యాడు డేనియల్ రెగినాల్డ్. ఆ స్టార్డమ్తో సెలబ్రిటీలు అతనితో డేటింగ్‌కు క్యూ కట్టారు. అడల్ట్ భామలు ఎవా ఎంజెలీనా-మియా మాల్కోవాలు అతని మాజీ భార్యలు కూడా. ఇక హాలీవుడ్ ప్రముఖులు జాసోన్ స్టాథమ్, విన్నీ జోన్స్‌లు డేనియల్‌కి జిగిరీ దోస్తులు. హయ్యెస్ట్పెయిడ్ ప్రస్తుతం అడల్ట్ ఫిల్మ్ స్టార్లలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ టాప్ టెన్ లిస్ట్‌లో డేనియల్ రెగినాల్డ్ ఒకడు. ఏటా 1 మిలియన్ పౌండ్లకు పైనే అడల్ట్ సినిమాలతో సంపాదిస్తున్నాడు. కిందటి ఏడాదిలో డేనియలే నెంబర్ వన్ కూడా(తాజా రిపోర్ట్ ప్రకారం). ఇక హోటల్స్ బిజినెస్‌తో, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా-ఫిట్నెస్ కోచ్‌గా సంపాదన అదనం. డేనియల్‌కు సిల్వీ, జాక్సన్ అనే ఇద్దరూ పిల్లలు. భవిష్యత్తులో వాళ్లను అడల్ట్ సినిమాల్లోకి రానిస్తారా? అంటే.. తెలివైన సమాధానం ఇస్తున్నాడు. ‘చిన్నప్పుడు దేశానికి ఆడాలని కలలు కన్నా. కానీ, కుదరలేదు. ఇవాళ డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. కానీ, గాయంతో ఆ లక్క్ష్యం అసంపూర్తిగా ముగిసింది. అందుకే నేను సాధించింది పెద్ద ఘనతేం కాదు. అఫ్కోర్స్.. నాలా చాలా మంది ఉండొచ్చేమో. అలాంటివాళ్లకు ప్రయత్నించకుండా ఆగిపోవద్దని మాత్రం సలహా ఇస్తా. నా ఫెయిల్యూర్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని.. జీవితంలో గెలుపు బావుటా ఎగరేయమని చెప్తా. ఇక అనుకోని వృత్తిలోకి దిగినప్పటికీ.. అనుకున్న గుర్తింపు మాత్రం దక్కలేదని బాధ మాత్రం ఇప్పటికీ నన్ను వేధిస్తోంది. అలాగని నా పిల్లల భవిష్యత్తును శాసించడం.. నిర్ణయించడం నా చేతుల్లో లేదు. కానీ, ఒక తండ్రిగా నా కూతురికి వద్దనే చెప్తా. కొడుక్కి మాత్రం ‘ధైర్యం చేయమ’ని ప్రొత్సహిస్తా చెప్తున్నాడు 37 ఏళ్ల డేనియల్ రెగినాల్డ్. -
అది ఆర్జీవీ సీక్రెట్!
‘‘ఆర్జీవీ వరల్డ్’లో నా అభిరుచికి తగ్గ సినిమాలే ఉంటాయి. చూడాలనుకున్నవాళ్లే చూస్తారు. నా సినిమాలతో ప్రతి ఒక్కరిని సంతృప్తిపరచాలనే ఉద్దేశం నాకు లేదు. ఇంటిల్లిపాదీ చూడదగ్గ చిత్రా లు నేను తీయను. ఇంట్లోనే ఒక్కొక్కరు వేరు వేరు గదుల్లో ఒంటరిగా చూసే సినిమాలు తీస్తాను’’ అన్నారు రామ్‌గోపాల్ వర్మ. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆర్జీవీ వరల్డ్’ అనే ఓ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు రామ్‌గోపాల్‌వర్మ. ‘క్లైమాక్స్’ చిత్రం ఈ యాప్‌లో విడుదల కానుంది. అలాగే వర్మ నేతృత్వంలోని మరో చిత్రం ‘కరోనా వైరస్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కాబోతుంది. ‘ఆర్జీవీ వరల్డ్ యాప్’, ఓటీటీ ప్లాట్ఫామ్స్ల హవా వంటి విషయాలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. ఆ విశేషాలు.. ► నాటకాల నుంచి సినిమాలు వచ్చాయి. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాలు వచ్చాయి. నాలుగేళ్ల క్రితం నుంచీ వెబ్‌సిరీస్ అనే మాట వినిపిస్తోంది. ఇప్పుడిదో (డిజిటల్ ప్లాట్‌ఫామ్) ప్యారలల్ ఇండస్ట్రీ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్వంటి డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వ్యూయర్షిప్ పెరుగుతుందంటే ఆడియన్స్ చూస్తున్నట్లేగా. ఓటీటీ ప్లాట్ఫామ్స్వారు కంటెంట్ కోసం కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ► ఇండస్ట్రీలో 90శాతం ఫ్లాప్‌లు ఉంటాయి. ఒక సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాకు వీకెండ్ ఓపెనింగ్స్ రావాలి. దీని పబ్లిసిటీ కోసం నిర్మాతలు డబ్బు ఖర్చు పెడతారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, థియేటర్స్ ఇలా మరికొన్ని పనులను చక్కబెట్టుకోవాలి. ఇంతా చేసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా? రారా? అనే టెన్షన్. మొబైల్లో సినిమా చూసినప్పుడు థియేటర్ ఫీల్‌ని మిస్ అవుతాం అనే ఫీల్‌ని పక్కనపెడితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వల్ల పబ్లిసిటీ ఖర్చు తగ్గుతుంది. కొందరు నిర్మాతలకు ఇది ప్లస్. ► పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు, ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ సినిమాలయితే థియేటర్లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్ అవుతాయి. అలాగే ఫీచర్ ఫిల్మ్ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే. ► ‘ఆర్జీవీ వరల్డ్’ ఐడియా నాకు ఎప్పటినుంచో ఉంది. ఇందులో ‘పే ఫర్’ వ్యూ విధానంలో చూడొచ్చు. చూసిన ప్రతిసారీ చార్జ్ చేస్తాం. ► కమల్‌హాసన్ ‘డైరెక్ట్ హోమ్’ ఫార్మట్‌లో ‘విశ్వరూపం’ విడుదల ప్లాన్ చేశారు. అప్పుడు సెటప్ బాక్స్‌లు అందరికీ లేవు. కానీ ఈ నిర్ణయాన్ని చివరి నిమిషంలో విరమించుకున్నారు. అయితే ఇప్పుడు మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియదు. ► నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్’. ఇది నా దృష్టిలో ఒక హారర్ ఫిల్మ్. దెయ్యం బదులు వైరస్ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్. ► ఫిల్మ్‌మేకింగ్ అనేది టీమ్ ఎఫర్ట్ అని నమ్ముతాను. అయితే సినిమాకు ఎవరు రూపకల్పన చేస్తారనేది ముఖ్యం. మా దగ్గర నేను చేస్తాను. ఎవరు ఎక్కువ కష్టపడితే వారికి క్రెడిట్ ఇస్తాను. ‘కరోనా వైరస్’ సినిమాకు అగస్త్య మంజు డైరెక్టర్. ఆలోచన నాది. ఈ సినిమా ఓటీటీలోనే విడుదలవుతుంది. ► జబ్బు, తుఫాన్, యాక్సిడెంట్... ఇలా ఏ కారణంతో అయినా మనకు చావు రావొచ్చు. ఈ జాబితాలో కరోనా వైరస్ కూడా చేరింది. కరోనా వైరస్ వెళ్లేట్లు లేదు. ఇంకేం చేస్తాం? దానితో కలిసి ఉండటమే. లాక్డౌన్ సమయంలో ‘క్లైమాక్స్, కరోనా వైరస్’ చిత్రాల పనులు చూసుకున్నాను. నేను తాత (వర్మ కుమార్తె రేవతి ఇటీవల ఓ పాపకు జన్మనిచ్చింది)ను అయ్యానని తెలిసినప్పుడు నాకేం అనిపించలేదు. చచ్చినట్లు కరోనా వైరస్‌ను భరించాలి. నేను తాతను అయ్యానన్నది భరించాలి. ► ‘కరోనా వైరస్’ ట్రైలర్ చివర్లో ఉన్న రెండు డైలాగ్స్ సెటైర్స్ కాదు. నా సినిమాకి నప్పుతాయని పెట్టాను. డొనాల్డ్ ట్రంప్ నుంచి చైనా వరకు కరోనా విషయంలో అందరూ చేయాల్సింది చేస్తున్నారు. అందుకే నేను ఎవరిపైనా సెటైర్ వేయలేదు. ఆ అమ్మాయంటే ఇష్టం చాలామంది పోర్న్‌స్టార్స్ ఉన్నప్పటికీ ‘జీఎస్టీ’, ‘క్లైమాక్స్’ కోసం మియా మాల్కొవానే ఎందుకు తీసుకున్నానంటే ఆ అమ్మాయి అంటే నాకిష్టం. అమెరికన్ కపుల్ ఓ టూర్‌కి వెళతారు. అక్కడి వారి అనుభవాల ఆధారంగా ‘క్లైమాక్స్’ చిత్రం ఉంటుంది. హారర్, యాక్షన్ అంశాలు ఉన్నాయి. ‘ఎంటర్ ద గాళ్ డ్రాగన్’ చిత్రం షూటింగ్ ఇంకా నాలుగు రోజులు చేయాల్సి ఉంది. చైనా షూట్‌ను కంప్లీట్ చేశాం. మేం చైనా నుంచి వచ్చిన నాలుగు రోజులకు అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది. -
వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్ ట్రైలర్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, ఫోర్న్ స్టార్ మియా మాల్కోవా కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. క్లైమాక్స్ పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, వీడియో సాంగ్ ప్రొమోకు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆర్జీవీ తన యూట్యూబ్ చానల్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌ను చూస్తే.. రోమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా అర్ధమవుతోంది. ఈ చిత్రంతో ఆర్జీవీ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ఎస్ఆర్ ప్రొడక్షన్, శ్రేయాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రాన్ని మే 29 ఉదయం 11 గంటలకు ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించారు.(చదవండి : వలస కార్మికుల కోసం సోనూసూద్.. హ్యాట్సాఫ్) గతంలో ఆర్జీవీ, మియా మాల్కోవా కాంబినేషన్ వచ్చిన జీఎస్టీ చిత్రం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో ఈ చిత్రాన్ని వ్యతిరేకించినప్పటికీ.. ఆర్జీవీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అయితే మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఆర్జీవీ అభిమానులు.. రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన ఫెవరేట్ మియా మాల్కోవాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాచని.. ఇందులో ఆమె నటన ఆశ్చర్యపరిచేలా ఉంటుందని వర్మ పేర్కొన్నారు.(చదవండి : విజయ్ సేతుపతిపై బీజేపీ నేతల ఫిర్యాదు) -
ప్రామిస్ డే: మియా మాల్కోవా మీద వర్మ ప్రామిస్..
సాక్షి, హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రామిస్ చేశారు. ప్రామిస్ డే రోజు డైరెక్టర్ వర్మ చేసిన ప్రామిస్‌కు అనూహ్య స్పందన వస్తోంది. సాధారణంగా దేవుడి మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు (గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్) అని చెబుతుంటారు కదా.. అందుకు వర్మ కాస్త భిన్నంగా కొందరు వ్యక్తులపై ప్రామిస్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రామిస్ డే రోజు ఓ ప్రామిస్ చేస్తున్నా... నేను ఏనాడు చేసిన మాటపై నిలబడనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోనని ప్రామిస్ చేస్తున్నానంటూ వర్మ తొలుత ఓ ట్వీట్ చేశారు. దేవుడిపై గానీ, తన తల్లిపై గానీ తాను ఆ ప్రామిస్ చేయడం లేదన్నారు వర్మ. అందుకు బదులుగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, స్టీవెన్ స్పిల్బర్గ్, అయన్ ర్యాండ్, డావూద్ ఇబ్రహీం, బ్రూస్ లీ మరియు మియా మాల్కోవాలపై ప్రామిస్ డే రోజు ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఏడాది నేను చాలా మంచి బాధ్యతాయుత వ్యక్తిగా ఉండేందుకు తీవ్రంగా కష్టపడతాను' అంటూ మరో ట్వీట్లో రాసుకొచ్చాడు డైరెక్టర్ వర్మ. మియా మాల్కోవాపై వర్మ ప్రామిస్ చేస్తున్నారు.. మాట నిలబెట్టుకుంటారో లేదో వేచిచూద్దాం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. -
‘అవి ఫేక్ న్యూస్.. జీఎస్టీ తొలగించలేదు’
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో ప్రసారాలను భారత్‌లో నిలిపివేసినట్టుగా వస్తున్న వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆదేశాలతోనే విమియో చానల్ జీఎస్టీ వీడియోను తొలగించినట్టుగా వచ్చిన వార్తలను వర్మ ఖండించారు. అంతేకాదు ప్రస్తుతం విమియోలో వీడియో అందుబాటులో లేకపోవడానికి కారణాలను కూడా వెల్లడించారు వర్మ. ‘స్ట్రయిక్ ఫోర్స్ ఎల్ఎల్సీ నిర్మాతలు ఫైరసీ వెబ్‌సైట్‌గా భావించి ఫిర్యాదు చేయడంతో కాపీరైట్ చర్యల్లో భాగంగా విమియో జీఎస్టీ వీడియోను తొలగించింది. నిర్మాతలకు చెందిన అధికారిక వెబ్ సైట్లో గాడ్స్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో యాక్టివ్‌గా ఉంది.’ అంటూ ట్వీట్ చేశారు వర్మ. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా జోడించాడు వర్మ. Fake news circulating #GodSexTruth not avilable becos removed from Vimeo ..It’s removed there because of complaint from producers StrikeForce LLC as a piracy site ..The main site of the producers is https://t.co/KkvHk3aNt7 which is very much alive and jumping with joy 💃💃💃 pic.twitter.com/UNoIlhkKNF — Ram Gopal Varma (@RGVzoomin) 1 February 2018 -
జీఎస్టీకి అద్భుతమైన రెస్పాన్స్.. పార్ట్-2కు వర్మ రెడీ!
సాక్షి, ముంబై: వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తీసిన ఆన్లైన్ చిత్రం ‘గాడ్ సెక్స్ ట్రూత్’. (జీఎస్టీ). ఈ సినిమాపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. చర్చోపచర్చలు జరిగాయి. టీవీ చర్చల్లో ప్రజాసంఘాల నేతలను కించపరిచేలా మాట్లాడారంటూ వర్మపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదాలు ఎలా ఉన్నా తన జీఎస్టీ గ్రాండ్ సక్సెస్ అయిందంటున్నాడు వర్మ. ఈ సినిమాకు ఫెంటాస్టికల్లీ ఆసమ్ రెస్పాన్స్ (అద్భుతమైన స్పందన) వస్తున్నదని తాజాగా ట్వీట్ చేశాడు. అంతేకాదు అద్భుతమైన స్పందనకు ఉబ్బితబ్బిబ్బైపోయి.. వర్మ జీఎస్టీ-2 కూడా తీయబోతున్నాడట. ఇదే విషయాన్ని వర్మ తన ట్వీట్లో వెల్లడించాడు. జీఎస్టీ-2 తీయబోతున్న సందర్భంగా దేవుడు తనతో, తన జీఎస్టీ లవర్స్‌తో ఉండాలని ఆకాంక్షించాడు. విదేశీ పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈ పెద్దల చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. దేశంలో సూపర్‌హిట్ అయిన ‘పద్మావత్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను మించి తన జీఎస్టీ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో ఉందని మరో ట్వీట్ వర్మ పేర్కొన్నారు. -
రొమాన్స్-కామెడీ-సెక్స్... పిచ్చి వర్మ
సాక్షి, సినిమా : విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పై ఎట్టకేలకు సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. జీఎస్టీతో తన సంగీతాన్ని వర్మ మరో మెట్టు ఎక్కించాడంటూ కీరవాణి పొగడ్తలు కురిపించారు. పొర్న్ స్టార్ మియా మల్కోవాతో వర్మ రూపొందించిన వీడియోకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ‘‘సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో 'రొమాన్స్'ను, 1992లో 'కామెడీ'ని, 2018లో 'సెక్స్'ను పలికించాయి. ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించబోతున్నా. నన్ను నమ్మిన పిచ్చి దర్శకుడికి(వర్మను ఉద్దేశించి) కృతజ్ఞతలు’’ అంటూ కీరవాణి ఓ ట్వీట్ చేశారు. కాగా, కీరవాణి కంటే ముందు కృతజ్ఞతలు తెలియజేస్తూ వర్మ ఓ ట్వీట్ చేశాడు. వివాదాలు చుట్టు ముట్టినా.. మియా మల్కోవా స్వగతం వీడియో ఆన్లైన్లో విడుదలై ట్రెండ్ సెట్ చేసింది. Love @RGVzoomin for uplifting my music in the process of showcasing his brilliance in various kinds of celluloid aesthetics. Romance in 1991, Comedy in 1992, and Sex in 2018. Horror and Violence to follow soon this year, Thanks to the mad movie maker for believing in me. — mmkeeravaani (@mmkeeravaani) 28 January 2018 -
జీఎస్టీ బ్లాక్ బస్టర్.. కాలేజ్ గర్ల్స్‌కు థ్యాంక్స్ : వర్మ
సాక్షి, ముంబయి : సంచలనాల కేంద్ర బిందువు, వివాదాస్పద అంశాలతో స్నేహం చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా విడుదల చేసిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని బ్లాక్ బస్టర్‌గా నిలిచిందట. ఆన్లైన్ ఫ్లాట్ ఫాంపై జీఎస్టీ దుమ్ము రేపుతున్నట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. జీఎస్టీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్న రామ్ తాజాగా ట్విటర్ స్పందించారు. అందులో జీఎస్టీ బ్లాక్ బస్టర్ అయిందని చెప్పారు. ముఖ్యంగా జీఎస్టీ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మద్దతు ఇస్తున్న కాలేజీ అమ్మాయిలకు, మహిళలకు తాను గొప్పగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. జీఎస్టీ గురించి పూర్తిగా తెలియకుండానే దాడి స్వభావంగల ఆందోళనకారుల నోర్లు మూతపడేలా మరింత బిగ్గరగా, స్వేచ్ఛగా ఈ జీఎస్టీ గురించి మాట్లాడాలని తాను వారిని ( కాలేజ్ గర్ల్స్, మహిళలు) కోరుతున్నానని చెప్పారు. శృంగారంలోని అందాన్ని నీచమైన ఆలోచనగలవారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు. A big thank you to all you College girls and women who are supporting the intention of #GodSexTruth and I request you to speak more openly and more loudly to shut up the regressive minded protestors ..Them with such ugly thoughts will never realise the Beauty of Sex pic.twitter.com/je4vGsNDJU — Ram Gopal Varma (@RGVzoomin) 27 January 2018 -
వర్మ జీఎస్టీ : ‘ప్రతి స్త్రీకి గౌరవం’
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఆల్ లైన్ లో రిలీజ్ అయ్యింది. ఈ వీడియో జనవరి 26నే రిలీజ్ కావాల్సి ఉండగా సైట్ క్రాష్ ఉండటంతో సర్వర్లు హ్యాంగ్ అయిన కారణంగా 27 ఉదయం రిలీజ్ చేశారు. వీడియో విడుదలైన తరువాత వచ్చిన స్పందనలను వర్మ తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశాడు. ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చూసిన తరువాత ఓ మహిళ నాకు మేసేజ్ చేసింది. ప్రతీ సీన్ నాకు వణుకు తెప్పించింది. ఇది పోర్న్ కాదు. కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు. శృంగారం పట్ల ఓ పవిత్ర భావన, స్త్రీ శరీరం పట్ల ఆరాధన. ఈ సినిమాను ప్రతీ మహిళ గౌరవంగా భావించాలి’ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చూసిన తరువాత ఓ అమ్మాయి మెసేజ్ చేస్తూ, సాంఘిక కట్టుబాట్ల వల్ల నేను అణచివేయబడ్డాను. కానీ జీఎస్టీ చూసిన తరువాత నేను స్త్రీగా జన్మించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్త్రీ లైంగిక స్వేచ్ఛ పట్ల మీరు చూపించిన ఫిలాసఫీ నచ్చింది. ఈ వీడియో నా సెక్సువల్ రైట్స్ గురించి ఆలోచించేలా చేసింది. మియా మాల్కోవా, ఆర్జీవీలకు కృతజ్ఞతలు’ అంటూ తనకు మెసేజ్ చేసినట్టుగా వర్మ వెల్లడించారు. -
వర్మ జీఎస్టీ మళ్లీ గ్రాండ్ రిలీజ్
సాక్షి, సినిమా : వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని మళ్లీ శనివారం గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. 26న (శుక్రవారం) ఉదయం 9 గంటలకే విడుదల కావాల్సి ఉండగా.. ఆత్రుతతో ఉన్న లక్షలాది మంది ఒకేసారి ఎగబడిపోవటంతో వీడియో క్రాష్ అయిపోయింది. దీంతో అప్‌గ్రేడ్ చేసే నిమిత్తం విడుదలను నిలిపివేశారు. అయితే సమస్య పరిష్కారమైందని రేపు గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని వర్మ ట్వీటర్లో పేర్కొన్నాడు. ‘స్ట్రయిక్ ఫోర్స్ సర్వర్ సమస్యను పరిష్కరించింది. 27న(రేపు) ఉదయం 9 గంటలకు గాడ్సెక్స్ట్రూత్ గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ప్రతి ఒక్కరు మియామాల్కోవాను చూస్తూ కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని’ ట్వీట్ చేశాడు. #Strikeforcegst is solving all server problems of #GodSexTruth and grandly releasing it tomorrow 27th morning 9 Am for everyone to watch @MiaMalkova and listen to @mmkeeravaani 😘💐🍾💪💃💃😍 pic.twitter.com/MQVFcGtCip — Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2018 ఇక మరోవైపు సామాజిక కార్యకర్త, మహిళ సంఘం నాయకురాలు దేవి ఆర్జీవీపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ యాక్ట్ 67, ఐపీసీ 508, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
‘నా హీరోయిన్ చేతిలో దీపిక పని అయిపోతోంది’
సాక్షి, ముంబయి : జీఎస్టీ దూసుకెళుతోంది. జీఎస్టీ అంటే కేంద్రం పన్నులకోసం తీసుకొచ్చిన సంస్కరణ కాదు.. వివాదాలతో సహవాసం చేసే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం జీఎస్టీ (గాడ్ సెక్స్ ట్రూత్). అవును! ఈ విషయాన్ని రామ్‌గోపాల్ వర్మనే ట్విటర్ ద్వారా తెలియజేశారు. అది కూడా ఈ విషయం తాను చెప్పడం లేదని, ఎనాలిటిక్స్ చెబుతున్నాయని విశ్లేషణకు సంబంధించిన రేఖా చిత్రాన్ని పోస్ట్ చేసి మరి వర్మ ఆ విషయాన్ని నిర్దారించి చూపించారు. 'చూస్తుంటే మియామాల్కోవా (పోర్న్‌స్టార్) గాడ్ సెక్స్ ట్రూత్ పేరిట చాలా వేగంగా దీపికా పదుకునేపై..... దండయాత్ర చేస్తున్నట్లుంది' అంటూ వర్మ ట్వీట్లో పేర్కొన్నారు. ఓ హాలీవుడ్ పోర్న్‌స్టార్‌తో రామ్ గోపాల్‌వర్మ జీఎస్టీ అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆయనపై కేసులు కూడా నమోదు అయ్యాయి. పైగా ఈ చిత్రాన్ని ఆపివేయాలంటూ మహిళా సంఘాలు చేసిన డిమాండ్లను కూడా ఆయన ఖాతరు చేయలేదు. పైగా తాను తీసిన చిత్రాన్ని ప్రమోషన్‌కు పనికొచ్చేలాగా ఆయనను నిలదీసిన వారికి సమాధానాలు చెప్పారు. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందు చెప్పినట్లుగానే రిపబ్లిక్ డేనాడే ఆన్లైన్ ప్లాట్ ఫాంపై ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఆ సినిమా పద్మావతి సినిమాను బీట్ చేస్తుందని వర్మ పోస్ట్ ద్వారా చెప్పారు. అంతేకాదు ప్రాంతాల వారీగా లెక్క చూపిస్తూ పద్మావత్ చిత్రాన్ని భారత్‌లో సగటున 39మంది చూస్తుండగా జీఎస్టీని మాత్రం 100మంది చూస్తున్నట్లు కూడా లెక్కలు తేల్చారు. It looks like @MiaMalkova is very aggressively _______g @deepikapadukone in the name of #GodSexTruth pic.twitter.com/auUXnbX5IW — Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2018 -
వర్మ జీఎస్టీ.. ఆగిపోయింది
సాక్షి, సినిమా : రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని ఆగిపోయింది. ఆత్రుతతో ఉన్న లక్షలాది మంది ఒకేసారి ఎగబడిపోవటంతో వీడియో క్రాష్ అయిపోయింది. అయితే దీనిని అప్ గ్రేడ్ చేసి కాసేపట్లోనే విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీటర్లో వెల్లడించారు. ఈ రోజు ఉదయం 9 గంటలకే విడుదల కావాల్సిన విషయం తెలిసిందే. అధికారిక లింక్ ఎంతకీ తెరచుకోకపోతుండటం, బఫర్ కావడానికి ఎక్కువ సమయం పడుతుండటం... వెరసి వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ‘‘ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతోందని.. అప్ గ్రేడ్ చేసే నిమిత్తం నిలిపివేశాం అని వర్మ వెల్లడించాడు. మరికొంత సమయం తరువాత లింక్స్ తెరచుకుంటాయని.. అప్ డేట్ చేసిన తరువాత ఆ విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. 'స్ట్రయిక్ ఫోర్స్' సంస్థ ఈ వీడియోను విడుదల చేస్తుండగా.. భారత్‌లో వీడియోను తిలకించాలంటే 150 రూ. చెల్లించాల్సిందే. అభిమానుల ఆతృతకు తగ్గట్టుగా అధికమంది ఒకేసారి వీక్షించేందుకు 'స్ట్రయిక్ ఫోర్స్' ఏర్పాట్లు చేస్తోందని చెప్పాడు. మంచి క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్, స్పీకర్లతో వినాలని, కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని, ఆయన సంగీతం మియా మాల్కోవా అందమంత బలమైనదని వర్మ ట్వీట్లో వ్యాఖ్యానించాడు. Due to heavy traffic of wanting to watch @MiaMalkova ‘s #GodSexTruth #strikeforcegst is upgrading https://t.co/WEefYjbpYh which will cause a delay ..Will update when done — Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2018 -
వర్మ జీఎస్టీ.. చూడాలంటే డబ్బు కట్టాల్సిందే!
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా వివాదం.. జీఎస్టీ అలియాస్ గాడ్ సెక్స్ ట్రూత్! పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో తెరకెక్కించిన ఈ వీడియో చుట్టూ ఇప్పటికే అనేక వివాదాలు ముసురుకున్నాయి. ఇందులో మియాను పూర్తి నగ్నంగా, పవిత్రంగా చూపించానని, ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను ఆన్లైన్లో విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. వర్మ జీఎస్టీపై మహిళా సంఘాలు తీవ్రంగా మండితున్న సంగతి తెలిసిందే. వివాదాలు, టీవీ చర్చలు, మియా మల్కోవా టీజర్, రాంగోపాల్ వర్మ వీడియో కామెంట్ల నేపథ్యంలో ఇప్పటికే జీఎస్టీకి ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ వీడియోను చూడాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందట. ఈ విషయాన్ని రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో వెల్లడించారు. జీఎస్టీని నిర్మించిన అమెరికా కంపెనీ స్ట్రయిక్ఫోర్స్ ఈ వీడియోను తిలకించేందుకు చార్జీలు వసూలు చేస్తుందని వర్మ తెలిపారు. గాడ్సెక్స్ట్రూత్.ఆన్లైన్ వెబ్సైట్లో ఈ వీడియోను విడుదల చేస్తామని, ఈ వీడియోను చూడాలంటే అమెరికా, కెనడాలో 2.99 డాలర్లు, యూరప్‌లో 1.99 పౌండ్లు, భారత్‌లో రూ. 150, శ్రీలంకలో రూ. 200 చెల్లించాల్సి ఉంటుందంటూ నిర్మాణ కంపెనీ చేసిన ట్వీట్‌ను వర్మ రీట్వీట్ చేశారు. -
వారి అజ్ఞానం చూస్తే భయమేస్తుంది కత్తి..: వర్మ
సాక్షి, హైదరాబాద్: వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా విడుదల చేయబోతున్న ‘గాడ్ సెక్స్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో ప్రకంపనలు రేపుతోంది. ఒక విదేశీ పోర్న్‌స్టార్‌తో తెరకెక్కించిన ఈ వీడియో టీజర్‌పై ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వీడియోలో పూర్తిస్థాయి నగ్నత్వాన్ని చూపిస్తానని వర్మ బాహాటంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ స్పందించారు. ‘వర్మ తీసిన ‘గాడ్ సెక్స్ ట్రూత్’ ఫీచర్ లెంత్ ఉన్న సినిమా కాదు. థియేటర్లలోనూ విడుదలకాదు. ఇది వెబ్ మీడియాకు ఉద్దేశించిన ‘షార్ట్-డాక్యు-ఫిలాసఫీ’. ఎందుకు దీనిపై ఇంత రభస చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వర్మ తెరకెక్కించినందుకే ఇలా చేస్తున్నారా? అతను భారత దేశానికి, సమాజానికి, సంస్కృతికి అంత పెద్ద ముప్పా?’ అని కత్తి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను వర్మ రీట్వీట్ చేస్తూ.. ‘హే కత్తి మహేశ్.. నిరసనకారుల అజ్ఞానం చూస్తే.. నిజంగానే భయమేస్తోంది. విదేశీ నటులతో కూడిన పెద్దల వీడియోలు మిలియన్లకొద్దీ అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్లు విదేశీ నటితో తీసిన జీఎస్టీ వీడియో మీదనే నిరసన తెలుపుతున్నారు’ అని వర్మ కామెంట్ చేశారు. Hey @kathimahesh What’s really scary is the protestors level of ignorance ..There are millions of adult videos with foreign actors avilable and they are protesting on this one video #GodSexTruth featuring a foreign actor https://t.co/ycXptUIBWu — Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2018 -
దర్శకుడు వర్మకు ‘కత్తి’ లాంటి మద్ధతు!
హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో వీడియో తీస్తూ తన కలను నిజం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మేకింగ్ స్టిల్స్‌తో సంచలనం సృష్టించిన వర్మ, ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పూర్తి వీడియోను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ వీడియోపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్పందించారు. దర్శకుడు వర్మకు తన పూర్తి మద్ధతు తెలుపుతూ ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో,రాంగోపాల్ వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్"’ అని కత్తి మహేశ్ ట్వీట్ చేశారు. ‘షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది. ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది.’, ‘మియా రూపం. గొంతు. వర్మ షాక్ వాల్యుతోపాటు, ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం ఒక ఎపిక్ విలువని జోడించింది. గుండె దిటవు చేసుకుని. మెదడు విప్పారజేసి చూడండి. నాకులాగా మీరూ ఎదురుచూస్తారు. మొత్తం ఫిల్మ్ ఎప్పుడు చూస్తామా అని. @RGVzoomin’ అంటూ కత్తి మహేశ్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేయడంతో పాటు వర్మకు మద్ధతు తెలిపారు.