హైదరాబాద్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోర్న్ స్టార్ మియా మల్కోవాతో వీడియో తీస్తూ తన కలను నిజం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే మేకింగ్ స్టిల్స్‌తో సంచలనం సృష్టించిన వర్మ, ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ పూర్తి వీడియోను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించాడు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ వీడియోపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ స్పందించారు. దర్శకుడు వర్మకు తన పూర్తి మద్ధతు తెలుపుతూ ఆయన వరుస ట్వీట్లు చేశారు.
‘మియా ఒక దేహం కాదు. విశ్వవ్యాపితమైన ఒక మోహన రూపం. మియా ఒక స్త్రీ కాదు. స్త్రీ లైంగిక స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు ప్రతిరూపం. కొన్ని యుగాలుగా అణచివేయబడ్డ స్త్రీ వాంఛలకు మద్దతుగా మియా మాటల్లో,రాంగోపాల్ వర్మ అనే ఒక పురుషుడు విప్పిన గొంతుక "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్"’ అని కత్తి మహేశ్ ట్వీట్ చేశారు.
‘షాక్ వాల్యుని దాటి ముందుకు వెళితే ఎందరో తత్వవేత్తల వేదాంతం. ఎందరో విప్లవకారుల నినాదం ఈ ట్రైలర్ లో వినిపిస్తోంది. వర్మ చెప్తున్నాడు కాబట్టి, అనుమానాస్పదంగా చూడకుండా, ఆబ్జక్టివ్ గా చూస్తే ఒక ప్రాచీన సత్యం గోచరిస్తుంది. ఒక బలీయమైన, తృణీకరించలేని శారీరక పరమసత్యం అవగతం అవుతుంది.’, ‘మియా రూపం. గొంతు. వర్మ షాక్ వాల్యుతోపాటు, ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం ఒక ఎపిక్ విలువని జోడించింది. గుండె దిటవు చేసుకుని. మెదడు విప్పారజేసి చూడండి. నాకులాగా మీరూ ఎదురుచూస్తారు. మొత్తం ఫిల్మ్ ఎప్పుడు చూస్తామా అని. @RGVzoomin’ అంటూ కత్తి మహేశ్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేయడంతో పాటు వర్మకు మద్ధతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment