సాక్షి, హైదరాబాద్: వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా విడుదల చేయబోతున్న ‘గాడ్ సెక్స్ ట్రూత్’ (జీఎస్టీ) వీడియో ప్రకంపనలు రేపుతోంది. ఒక విదేశీ పోర్న్‌స్టార్‌తో తెరకెక్కించిన ఈ వీడియో టీజర్‌పై ఇప్పటికే పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక వీడియోలో పూర్తిస్థాయి నగ్నత్వాన్ని చూపిస్తానని వర్మ బాహాటంగానే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియోపై వెల్లువెత్తుతున్న తీవ్ర విమర్శలపై సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ స్పందించారు.
‘వర్మ తీసిన ‘గాడ్ సెక్స్ ట్రూత్’ ఫీచర్ లెంత్ ఉన్న సినిమా కాదు. థియేటర్లలోనూ విడుదలకాదు. ఇది వెబ్ మీడియాకు ఉద్దేశించిన ‘షార్ట్-డాక్యు-ఫిలాసఫీ’. ఎందుకు దీనిపై ఇంత రభస చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. వర్మ తెరకెక్కించినందుకే ఇలా చేస్తున్నారా? అతను భారత దేశానికి, సమాజానికి, సంస్కృతికి అంత పెద్ద ముప్పా?’ అని కత్తి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను వర్మ రీట్వీట్ చేస్తూ.. ‘హే కత్తి మహేశ్.. నిరసనకారుల అజ్ఞానం చూస్తే.. నిజంగానే భయమేస్తోంది. విదేశీ నటులతో కూడిన పెద్దల వీడియోలు మిలియన్లకొద్దీ అందుబాటులో ఉన్నాయి. కానీ వాళ్లు విదేశీ నటితో తీసిన జీఎస్టీ వీడియో మీదనే నిరసన తెలుపుతున్నారు’ అని వర్మ కామెంట్ చేశారు.
Hey @kathimahesh What’s really scary is the protestors level of ignorance ..There are millions of adult videos with foreign actors avilable and they are protesting on this one video #GodSexTruth featuring a foreign actor https://t.co/ycXptUIBWu
— Ram Gopal Varma (@RGVzoomin) January 23, 2018
Comments
Please login to add a commentAdd a comment