రాంగోపాల్ వర్మ, మియా మాల్కోవా (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై: వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తీసిన ఆన్‌లైన్ చిత్రం ‘గాడ్ సెక్స్ ట్రూత్’. (జీఎస్టీ). ఈ సినిమాపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. చర్చోపచర్చలు జరిగాయి. టీవీ చర్చల్లో ప్రజాసంఘాల నేతలను కించపరిచేలా మాట్లాడారంటూ వర్మపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ వివాదాలు ఎలా ఉన్నా తన జీఎస్టీ గ్రాండ్ సక్సెస్ అయిందంటున్నాడు వర్మ. ఈ సినిమాకు ఫెంటాస్టికల్లీ ఆసమ్ రెస్పాన్స్ (అద్భుతమైన స్పందన) వస్తున్నదని తాజాగా ట్వీట్ చేశాడు. అంతేకాదు అద్భుతమైన స్పందనకు ఉబ్బితబ్బిబ్బైపోయి.. వర్మ జీఎస్టీ-2 కూడా తీయబోతున్నాడట. ఇదే విషయాన్ని వర్మ తన ట్వీట్‌లో వెల్లడించాడు. జీఎస్టీ-2 తీయబోతున్న సందర్భంగా దేవుడు తనతో, తన జీఎస్టీ లవర్స్‌తో ఉండాలని ఆకాంక్షించాడు.
విదేశీ పోర్న్‌స్టార్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈ పెద్దల చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. దేశంలో సూపర్‌హిట్ అయిన ‘పద్మావత్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలను మించి తన జీఎస్టీ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో ఉందని మరో ట్వీట్ వర్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment