రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ ఆల్ లైన్ లో రిలీజ్ అయ్యింది. ఈ వీడియో జనవరి 26నే రిలీజ్ కావాల్సి ఉండగా సైట్ క్రాష్ ఉండటంతో సర్వర్లు హ్యాంగ్ అయిన కారణంగా 27 ఉదయం రిలీజ్ చేశారు. వీడియో విడుదలైన తరువాత వచ్చిన స్పందనలను వర్మ తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశాడు.
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చూసిన తరువాత ఓ మహిళ నాకు మేసేజ్ చేసింది. ప్రతీ సీన్ నాకు వణుకు తెప్పించింది. ఇది పోర్న్ కాదు. కేవలం ఫిలాసఫీ మాత్రమే కాదు. శృంగారం పట్ల ఓ పవిత్ర భావన, స్త్రీ శరీరం పట్ల ఆరాధన. ఈ సినిమాను ప్రతీ మహిళ గౌరవంగా భావించాలి’
‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చూసిన తరువాత ఓ అమ్మాయి మెసేజ్ చేస్తూ, సాంఘిక కట్టుబాట్ల వల్ల నేను అణచివేయబడ్డాను. కానీ జీఎస్టీ చూసిన తరువాత నేను స్త్రీగా జన్మించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్త్రీ లైంగిక స్వేచ్ఛ పట్ల మీరు చూపించిన ఫిలాసఫీ నచ్చింది. ఈ వీడియో నా సెక్సువల్ రైట్స్ గురించి ఆలోచించేలా చేసింది. మియా మాల్కోవా, ఆర్జీవీలకు కృతజ్ఞతలు’ అంటూ తనకు మెసేజ్ చేసినట్టుగా వర్మ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment