ప్లీజ్‌ నన్ను విష్‌ చెయ్‌ నాగ్‌ | Ram Gopal Varma Celebrating Birthday | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌ నన్ను విష్‌ చెయ్‌ నాగ్‌

Published Sat, Apr 7 2018 10:42 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Ram Gopal Varma Celebrating Birthday - Sakshi

ఒకప్పుడు తెలుగు సినిమాకు గాడ్‌ఫాదర్‌. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ మీడియాకు టైంపాస్‌. అతడు మాట్లాడితే వివాదమే. సినిమాలు తీస్తే వివాదమే. అతడే రామ్‌ గోపాల్‌ వర్మ. సంచలనాలకు కేరాఫ్‌. వివాదాలకు మారు పేరు ఆర్జీవీ. ఎన్నో వివాదాల పుట్టుకకు కారణమైన ఆర్జీవీ పుట్టినరోజు నేడు(ఏప్రిల్‌ 7).

టాలీవుడ్‌లో అప్పటిదాక ఉన్న మూసధోరణిని పక్కన పెట్టి, తెలుగు తెరకు కొత్త కథనాన్ని నేర్పించిన వాడు ఆర్జీవీ. శివ సినిమాతో టాలీవుడ్‌ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. తెలుగు సినిమా శివకు ముందు శివకు తరువాత అనే స్థాయిలో తన మార్క్‌ చూపించారు వర్మ. చాలా ఏ‍ళ్ల తర్వాత ఆర్జీవీ నాగార్జున కాంబినేషన్‌ మళ్లీ సెట్‌ అయింది. ‘ఆఫీసర్‌’ సినిమాతో మళ్లీ మ్యాజిక్‌ క్రియేట్‌ చేయడానికి రెడీ​ అవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమా తరువాత అఖిల్‌ అక్కినేని హీరోగా ఓ సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు.  ఆర్జీవీ బర్త్‌డే స్పెషల్‌గా ఈ సినిమాకు సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం( ఏప్రిల్‌ 9) ఉదయం పది గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలిపారు. తనకు బర్త్‌డే విషెస్‌ నచ్చవనీ, కానీ...ప్లీజ్‌ నాగ్‌ నన్ను విష్‌ చెయ్‌ అంటూ ట్వీట్‌ చేశారు ఆర్జీవీ.

ప్రతీ విషయంలో తనకు నచ్చిన విధంగా రియాక్ట్‌ అ‍వ్వడం ఆర్జీవీ స్టైల్‌. మొన్నామధ్య జీఎస్టీ అంటూ సంచలనం సృష్టించి వేడి రగిల్చారు. కడప వెబ్‌ సిరీస్‌ అంటూ ఇంకో బాంబ్‌ పేల్చారు. ఇలా వివాదాలను ఇంటి పేరుగా మార్చుకుని ఒక ఐకాన్‌గా మారిపోయారు. సాధారణంగా వేడుకలకు దూరంగా ఉండే వర్మ, తన పుట్టిన రోజును సెలబ్రేట్‌ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ మేస్ట్రోకి శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఆర్జీవీ జీఎస్టీని అభినందించిన హరిణి ఎలిజబెత్‌ లాంటి వారు ట్విటర్‌లో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement