ఎంపీ అవినాష్‌రెడ్డి రక్తదానం | ys jagan mohan reddy birth day celebrations at ysr district | Sakshi
Sakshi News home page

ఎంపీ అవినాష్‌రెడ్డి రక్తదానం

Published Mon, Dec 21 2015 1:16 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy birth day celebrations at ysr district

జమ్మలమడుగు: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు. స్థానిక సీఎస్‌ఐ కాంప్‌బెల్ వైద్యశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఎంపీతోపాటు వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు.

పులివెందులలో పార్టీ నాయకులు పలు సాంఘిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆస్పత్రుల్లో పండ్లు, బ్రెడ్లు, పాలు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతోపాటు స్థానిక గాయత్రి వృద్ధ శరణాలయం, జ్యోతి మనోవికాస కేంద్రంలో వృద్ధులు, పిల్లలకు దుప్పట్లు, బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement