సాక్షి, సినిమా : రాంగోపాల్ వర్మ 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని ఆగిపోయింది. ఆత్రుతతో ఉన్న లక్షలాది మంది ఒకేసారి ఎగబడిపోవటంతో వీడియో క్రాష్ అయిపోయింది. అయితే దీనిని అప్ గ్రేడ్ చేసి కాసేపట్లోనే విడుదల చేయనున్నట్లు వర్మ ట్వీటర్లో వెల్లడించారు.
ఈ రోజు ఉదయం 9 గంటలకే విడుదల కావాల్సిన విషయం తెలిసిందే. అధికారిక లింక్ ఎంతకీ తెరచుకోకపోతుండటం, బఫర్ కావడానికి ఎక్కువ సమయం పడుతుండటం... వెరసి వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతోంది. ‘‘ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతోందని.. అప్ గ్రేడ్ చేసే నిమిత్తం నిలిపివేశాం అని వర్మ వెల్లడించాడు. మరికొంత సమయం తరువాత లింక్స్ తెరచుకుంటాయని.. అప్ డేట్ చేసిన తరువాత ఆ విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
'స్ట్రయిక్ ఫోర్స్' సంస్థ ఈ వీడియోను విడుదల చేస్తుండగా.. భారత్లో వీడియోను తిలకించాలంటే 150 రూ. చెల్లించాల్సిందే. అభిమానుల ఆతృతకు తగ్గట్టుగా అధికమంది ఒకేసారి వీక్షించేందుకు 'స్ట్రయిక్ ఫోర్స్' ఏర్పాట్లు చేస్తోందని చెప్పాడు. మంచి క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్, స్పీకర్లతో వినాలని, కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని, ఆయన సంగీతం మియా మాల్కోవా అందమంత బలమైనదని వర్మ ట్వీట్లో వ్యాఖ్యానించాడు.
Due to heavy traffic of wanting to watch @MiaMalkova ‘s #GodSexTruth #strikeforcegst is upgrading https://t.co/WEefYjbpYh which will cause a delay ..Will update when done
— Ram Gopal Varma (@RGVzoomin) 26 January 2018
Comments
Please login to add a commentAdd a comment