ఎన్టీఆర్ సినిమాకు రెండు క్లైమాక్స్లు..?
ఎన్టీఆర్ సినిమాకు రెండు క్లైమాక్స్లు..?
Published Tue, Aug 9 2016 8:58 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్లతో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా భారీ స్టార్ కాస్ట్తో ఎన్టీఆర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే జనతా గ్యారేజ్లో మరో ప్రధాన పాత్రలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తుండటంతో సినిమాపై మాలీవుడ్లో మంచి టాక్ వస్తోంది.
ఆ టాక్ను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందుకోసం తెలుగు, మళయాల భాషల్లో వేరు వేరు క్లైమాక్స్లను షూట్ చేస్తున్నారట. ఇప్పటికే దళపతి, ఏం మాయ చేసావే, ఘర్షణ లాంటి చిత్రాలకు ఇలా రెండు క్లైమాక్స్లను తీసి సక్సెస్ సాధించగా.. ఇప్పుడు కొరటాల శివ కూడా అదే ఫార్ములాను యూజ్ చేస్తున్నాడు. తెలుగులో ఎన్టీఆర్ ఇమేజ్ను ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్ను చిత్రీకరించి, మళయాలంలో మాత్రం మోహన్ లాల్ను హైలెట్ చేయాలని భావిస్తున్నారట. మరి ఈ ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.
Advertisement
Advertisement