క్లైమాక్స్ షూట్కు బాహుబలి టీం | baahubali team back to shoot | Sakshi
Sakshi News home page

క్లైమాక్స్ షూట్కు బాహుబలి టీం

Published Sun, Jun 5 2016 1:19 PM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

క్లైమాక్స్ షూట్కు బాహుబలి టీం - Sakshi

క్లైమాక్స్ షూట్కు బాహుబలి టీం

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి 2 షూటింగ్ లో మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న బాహుబలి టీం త్వరలో సెట్స్ మీదకు రానుంది. సినిమాలో కీలకమైన పతాక సన్నివేశాల చిత్రీకరణ జూన్ 13న ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు నిర్మాత శోభు యార్లగడ్డ. దాదాపు పది వారాల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. తిరిగి షూటింగ్ ప్రారంభించటంపై దర్శకుడు రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ షెడ్యూల్లో భారీ యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించనున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రీ విజువలైజేషన్తో పాటు, పోరాట సన్నివేశాలకు సంబందించిన రిహార్సల్స్ను కూడా పూర్తి చేసినట్టుగా తెలిపారు. భారీ సెట్స్, గ్రాఫిక్స్తో తొలి భాగాన్ని మించేలా బాహుబలి 2ను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి 2017 ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement