
అభిమానులకు ప్రభాస్ మెసేజ్
బాహుబలి 2 సినిమాకు ఇంతటి ఘనవిజయాన్ని అందించిన అభిమానులకు హీరో ప్రభాస్ కృతజ్ఞతలు తెలియజేశాడు. తన మీద ఇంతటి ప్రేమానురాగాలను చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. తన భారీ విజన్ ను ముందుకు తీసుకెళ్లగలననే నమ్మకాన్ని తన మీద ఉంచి, జీవితంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమయ్యే బాహుబలి పాత్ర తనకు ఇచ్చినందుకు దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఆదివారం తో వెయ్యికోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా అవతరించింది బాహుబలి. ఇప్పటికీ అన్ని ప్రాంతాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తుండటంతో లాంగ్ రన్ లో బాహుబలి 2.. 1500 కోట్ల వసూళ్లు సాధించటం కాయంగా కనిపిస్తోంది. మరో నాలుగు వారాల పాటు బాలీవుడ్ లో కూడా భారీ చిత్రాలేవి లేకపోవటం బాహుబలి 2 కలెక్షన్లకు కలిసొచ్చే అంశం.